భోగాపురం వర్సెస్ అమరావతి !

భోగాపురం పేరులో భోగం ఉంది కానీ ఆ యోగం మాత్రం గతంలో పట్టలేదు. కానీ అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అక్కడ ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా దశ తిరిగింది. ఈ గ్రీన్ ఫీల్డ్…

భోగాపురం పేరులో భోగం ఉంది కానీ ఆ యోగం మాత్రం గతంలో పట్టలేదు. కానీ అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అక్కడ ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా దశ తిరిగింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు తొలి దశ నిర్మాణం పనులు 2025 మధ్య నాటికి పూర్తి అవుతాయి. అపుడు భోగాపురం వైభోగాన్ని ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు.

ఇప్పటికే భోగాపురాన్ని అల్లుకునే రియల్ బిజినెస్ జోరుగా సాగుతోంది. భోగాపురం ఉన్న లోకాలిటీ కూడా చాలా కీలకంగా ఉంది. మూడు జిల్లాలకు మధ్యన ఉండడంతో పాటు అలరించే తీర ప్రాంతం నేచురల్ బ్యూటీతో కళకళలాడుతోంది.

భోగాపురం నుంచి విశాఖకు ఆరు లైన్ల జాతీయ రహదారి కూడా భవిష్యత్తులో సిద్ధం అవుతోంది. భోగాపురం అపుడు మరో శంషాబాద్ అవుతుంది అని అంతా అంటున్నారు. భోగాపురాన్ని ఎవరూ నెత్తికెత్తుకోలేదు. దాన్ని భూతల స్వర్గం అని ప్రచారం చేసి పెట్టలేదు.

కానీ ఇపుడు అదే అద్భుతం అయ్యేలా ఉంది. విశాఖ వంటి మెగా సిటీని కూడా దాటుకుని వెళ్తుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అమరావతి గురించి చెప్పుకోవాలి. అమరావతి కూడా విజయవాడకు కడు దూరంలో ఉంది. దానిని అయితే రాజధాని చేద్దామనుకున్నారు. కానీ అమరావతికి ఆ రాజభోగం ఉందో లేదో తెలియడం లేదు, కానీ కళ్ల ముందే భోగాపురం మాతం నంబర్ వన్ సిటీగా రూపాంతరం చెందడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే జరిగితే విశాఖతో పాటు జంట నగరంగా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. దాని వల్ల విశాఖ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది. రానున్న రోజులలో విశాఖతో పాటు భోగాపురం ఏపీకి ఆర్ధికంగా గ్రోత్ ఇంజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేధావులు అంటున్నారు.

దీనిని బట్టి అర్ధం అయ్యేది ఒక్కటే నగరాలు ఎవరో పనిగట్టుకుని చేస్తే నిర్మాణం కావు. వాటికి ఉన్న అవకాశాలే అలా తీర్చిదిద్దుతాయని భావించాలి. భోగాపురం అయితే కొన్నేళ్ళ క్రితం అసలు ఊసులో లేదు ఒక కుగ్రామం. కానీ మరో ఏడాదితో అది ఇంటర్నేషల్ లెవెల్ లో మారు మోగే సూపర్ సిటీ ఆఫ్ డెస్టినీగా మారబోతోంది. భోగాపురం గురించి ఆలోచిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. తద్వారా ఏపీని ఇంకా బాగా తీర్చిదిద్దుకోవచ్చు. కొత్త పాలకులు ఎవరైనా ఈ సంగతి ఆలోచించాలన్నదే విజ్ఞుల నుంచి వస్తున్న హితవు.