పీఆర్సీపై ప్ర‌భుత్వం ఏమార్చి!

త‌మ మ‌ద్ద‌తుతో భారీ ప్ర‌యోజ‌నం పొందిన కూట‌మి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి ఉద్యోగ‌, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల్లో వుంది.

వైఎస్ జ‌గ‌న్ గ‌ద్దె దిగ‌డంలో ఉద్యోగులు అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించారు. వైసీపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగితే త‌ప్ప‌, త‌మ బ‌తుకుల్లో వెలుగు ఉండ‌ద‌న్నంత‌గా ప‌ట్టుప‌ట్టి మ‌రీ జ‌గ‌న్‌ను ఓడించారు. ఇదే సంద‌ర్భంలో కూట‌మిపై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. సీఎంగా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే త‌మ జీవితాల్లో ఆర్థికంగా స‌మూల మార్పులు చోటు చేసుకుంటాయ‌ని ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, పెన్ష‌న‌ర్లు విశ్వ‌సించారు.

మ‌రో రెండు రోజులు గ‌డిస్తే కూట‌మి పాల‌న 12వ నెల‌లో అడుగు పెడుతుంది. అయితే ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, విశ్రాంత ఉద్యోగులు ఆశించిన‌ట్టుగా జ‌రిగిందా? అంటే… ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా జ‌ర‌గ‌లేద‌ని వాళ్లే వాపోతున్నారు. ముఖ్యంగా 12వ వేత‌న స‌వ‌ర‌ణ క‌మిష‌న్ (పీఆర్‌సీ)ను నియ‌మించ‌డంలో 11 నెల‌లుగా ఉద్యోగ వ‌ర్గాల‌ను కూట‌మి స‌ర్కార్ ఏమార్చుతూ వ‌స్తోంద‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

ఏపీ జేఏసీ అమ‌రావ‌తి చైర్మ‌న్‌, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి 11 నెల‌లు పూర్తి అవుతున్నా 12వ పీఆర్సీ నియ‌మించ‌డంలో జాప్యం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఇది ఎంత మాత్రం త‌గ‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ఫ్రెండ్లీ సీఎం అని ఉద్యోగులు న‌మ్మి ఓట్లు వేశారన‌డం కంటే, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కొంద‌రి తీరుతో విసిగిపోయి కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికారు.

అయితే త‌మ మ‌ద్ద‌తుతో భారీ ప్ర‌యోజ‌నం పొందిన కూట‌మి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి ఉద్యోగ‌, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల్లో వుంది. సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌ను ఏ విధంగా అయితే మ‌భ్య‌పెడుతూ వ‌స్తున్నారో, ఉద్యోగ వ‌ర్గాల్ని కూడా అదే ర‌కంగా ఎదురు చూపుల‌కు గురి చేస్తున్నారు. వాళ్ల స‌హ‌నంతో కూట‌మి స‌ర్కార్ ఆడుకుంటోంద‌న్న చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. దీన్ని కూట‌మి స‌ర్కార్ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి.

3 Replies to “పీఆర్సీపై ప్ర‌భుత్వం ఏమార్చి!”

  1. ఉద్యోగులు కేవలం సజ్జల పై అసహనంతో ఉన్నారు, కానీ జగన్ అంటే ప్రేమ అని చెప్పాలని తాపత్రయ పడుతున్నారు….కవరింగ్ భలే చేస్తారు …. //చంద్రబాబు ఫ్రెండ్లీ సీఎం అని ఉద్యోగులు నమ్మి ఓట్లు వేశారనడం కంటే, వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొందరి తీరుతో విసిగిపోయి కూటమికి మద్దతు పలికారు// అని రాసుకొచ్చారు…. తన ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో జగన్ కి తెలియదు, నాయకత్వం పూర్తిగా విఫలం, ఎవ్వరో అధికారి (సజ్జల గారు) పేత్థనం ఉద్యోగులకి నచ్చలేదు… ఆ అధికారికి బాస్ ఎవ్వరు జగన్ కాదా?

  2. అవును పీఆర్సీ వేసి అన్న మాదిరి ఐఆర్ కన్న పీఆర్సీ తక్కువ ఇచ్చిన చరిత్ర చూసి ఆహా అన్న. … ఒహో అన్న అంటున్నారు ఉద్యోగులు

Comments are closed.