మూలిగే నక్క మీద తాటి పండు పడింది. నక్కకు ఏదో జరిగి అది చేతకాక మూలుగుతోంది. దాని మీద తాటి పండు పడితే ఎలా ఉంటుంది? నక్క తట్టుకోగలదా? తట్టుకోలేదు కదా. ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి అలాగే తయారైంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం ఇప్పుడు చావుదెబ్బలు తింటోంది. అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని సమాచారం. అక్కడి పాలకులను దేశ ప్రజలే అసహ్యించుకుంటున్నారు. ప్రధానినే బూతులు తిడుతున్నారు.
అంటే అక్కడి ప్రజలు ప్రభుత్వం మీద ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ఎంతగా విసిగిపోతున్నారో అర్థమవుతోంది. ఆపరేషన్ సిందూర్ దెబ్బ గట్టిగానే తగులుతోంది. భారత్ వరుస దాడులతో బిత్తరపోతున్న పాకిస్తాన్‌కు తాజాగా మరో సంక్షోభం ఎదురైంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంక్‌లు మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా, పెట్రోల్ బంకుల మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇస్లామాబాద్ లోని అన్ని పెట్రోల్, డీజిల్ బంకులను 48 గంటల పాటు మూసేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఇంధనం కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిరోసిన్ కొరత కూడా వేధిస్తుండడంతో పాక్ ప్రజలు అల్లాడుతున్నారు. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయింది అంటే సరిహద్దుల్లో ఉన్న శత్రువులకు సైతం సరిగా ఆహార పదార్థాలు సరఫరా చేయలేని పరిస్థితి వచ్చేసింది.
ఇస్లామాబాద్‌లోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లు పూర్తిగా మూసివేశారు. శనివారం ఉదయం ఈ ప్రకటన చేశారు. తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు పెట్రోల్ బంకులు ఓపెన్ చేయకూడదని ఆర్డర్ వేశారు. అకస్మాత్తుగా ఇంధన అంతరాయం ఏర్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇస్లామాబాద్ లోని వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించటం తెల్లవారుజామునే పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై భారత్ దాడి చేయడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా పలు ప్రాంతాల్లో విమాన సేవలను బంద్ చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో సాగు నీటి కొరత కూడా ఏర్పడింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పై దెబ్బ పడింది. ఖరీఫ్ సీజన్‌లో సరఫరా కావాల్సిన నదీ జలాల్లో 21 శాతం కొరత ఏర్పడినట్లు ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. చీనాబ్ నదీ ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్‌లో 21 శాతం నీటి కొరత తలెత్తిందని అంచనా వేసింది. తాగు నీటి కొరత కూడా తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దీంతో ఎన్ని అడుగుల మేర తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా కనిపించడం లేదు.
700 అడుగులు తవ్వినా నీళ్లు రాకపోవడంతో.. పాక్‌వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తిండి లేక విలవిలలాడుతుండగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఇప్పుడు నీటి సమస్య కూడా పెరిగిపోవడంతో.. ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక పాకిస్తాన్ ప్రజలు అయోమయంలో మునిగిపోయారు. పాకిస్తాన్‌లో 1990ల్లో నీటి మట్టం 100 అడుగులు ఉండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తూ ఇప్పుడు 700 అడుగులకు పడిపోయినట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత దుర్భరంగా ఉంటుందో.
Sarihaddullo unna shathruvulaki aaharam sarafara cheyyadam endi sir
memu anthe anna ni yettadaniki tappinchi maku inkemi telidu ..
Sarihaddullo shathruvule untaruu ….papam maname sariga artham chesukole..




సైనికులకు
వీళ్లకు ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటో తెలీదు మరి..!
In Pakistan Gas stations closed and India halted flights in many cities. What is this logic? It appears the article is really pointing situation in our India or to cover up issues in India and poting at Pakistan.
Adedo undi ga “Mana illu ikkada kaali potuntae, pakkodi illu akkada thagala badi potundani santhoshmatho ganthuleyyadam”.
Flights half chesindhi missile attack avuthundhi ani….Fuel leka kaadhu…… Ela pudathaaru ra mee laanti drohulu.
“half” cheyyaledu, temporary cancel chesaru may 15th varaku.
This episode looks like more of a mutual political benifit, at the cost of precious lives of army personnel, than real issue. They say pak directly tried attacking Indian cities still accepted for cease fire within no time and without any acceptance of guilt by pak. Gods must be crazy
. They didn’t even said sorry. When army was about to capture pok then suddenly cease fire during Nehru’s time now this one… What’s our standard on pak, just let them do whatever they want and then go?
Are we feared of them, by any chance?