గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!

సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి…

సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఆ ప్రయత్నాలు కొనసాగించి ఫలించకపోవడంతో వెనక్కు తగ్గింది.

వృద్ధ నారీ పతివ్రతః అన్న సామెత చందంగా.. తమకు వక్ర రాజకీయాలకు అవకాశం లేకపోయేసరికి.. హుందా రాజకీయాలు మాత్రమే చేద్దాం అంటూ చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు కూడా. తెదేపా తప్పుకున్న తర్వాత.. బరిలో ఉన్న ఇండిపెండెంటు అభ్యర్థి షఫీ కూడా ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అయితే బొత్స సత్యనారాయణ మండలిలో ఉంటే.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గీత దాటి ఏ నిర్ణయం తీసుకోజూసినా వారికి ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గట్టిగా స్వరం వినిపించగల సీనియర్ నాయకుల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. ప్రభుత్వం మీద నిశిత విమర్శలతో విరుచుకుపడగల నాయకుడు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయగల నాయకుడు. అసలే మండలిలో తెలుగుదేశం ప్రభుత్వానికి మెజారిటీ లేని నేపథ్యంలో.. నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా వారికి ఎదురుదెబ్బ తగులుతుంది.

ఇదొక కోణం కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా బొత్స సత్యనారాయణ మూలంగా లాభం చేకూరే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఓటర్లను మభ్యపెట్టి లోబరచుకుని ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని అనుకున్నట్టే తెలుగుదేశం పార్టీ.. ఏకంగా మండలిలోని ఎమ్మెల్సీలను లోబరచుకుని అక్కడ తామే పైచేయి సాధించాలని చూస్తున్నదనే సంగతి అందరికీ తెలుసు.

ఇప్పటికే మండలిలోని కొందరు ఎమ్మెల్సీలు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వంటి బలమైన నాయకుడు.. మండలిలో గళం వినిపిస్తూ ఉండడమే కాదు.. అక్కడి పార్టీ ఎమ్మెల్సీ అందరినీ కూడా ఫిరాయించకుండా కట్టుబాటులో ఉంచగలరనే అభిప్రాయం కూడా పార్టీలో ఉంది.

39 Replies to “గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!”

  1. Manam pakkavallini thittukodam sare mana Bothsa saru pathivratha mari…eeyana gurinchi manam goppagaa cheppukovali…vijayanagaram visakha lo eeyana swaahaa chesinavi enno

  2. ఈ మహానుభావుడు నోరు తెరిచి మాట్లాడి, ఆ మాటలు అందరికీ అర్థం అయ్యేసరికి తెల్లారిపోయింది. అది అర్థమైతే కదా దిబిడి దబిడో దబిడి దిబిడో..

  3. Nee spirits matram sooper ra GA. Edo oka rakanga TDP ni thiduthoo YCP ni support chese nee thaapatrayam mutchatesthondi. Kani botsa babu meeda nee expectation choosthe matram jalesthondi. Neekanna ekkuva mandala speaker meeda.

  4. అసలు వాడు ఏమి మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. ఈ సన్నాసి great andhra gadiki బాగా అర్థం అవుతుంది.

  5. అసలు గ్రేట్ ఆంధ్రా నీకు జగన్ మీద, జగన్ పార్టీ మీద అభిమానంతో ఏమి రాస్తున్నావో అర్ధమవుతుందా. బొత్స ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధమవదు. ఈ మధ్య బైపాస్ చేయించుకున్నారు. ఆయనతో దబిడి దిబిడి అని రాస్తున్నావ్. ఆయనకంటే గుడివాడ అమరనాధ్ నయం ఏమి మాట్లాడుతున్నాడో వినే వాడికి అర్ధం అవుతుంది

  6. ప్రతిపక్ష హోదా కోసం తంటాలు పడే జగన్ గారే పోటీచేస్తే ఆ అవకాశం దక్కేది ఇప్పటికైనా మించిపోయింది లేదు విద్యావంతులు ఎన్నుకొన్న మ్మెల్సీ ఎవరైనా అయన పార్టీలో ఉంటే ఆయన చేత రాజీనామా చేయించి జగన్ గారు ట్రై చేసుకోవచ్చు

  7. బొత్స సత్యనారాయణ మాట్లాడేది వాడికే అర్ధం కాదు…మళ్ళీ వాడి గురించి భజన….

  8. అవసాన దశలో ఉన్న టీడీపీ జనసేన పార్టీలకు కేంద్ర బీజేపీ నాయకత్వం మద్దతు లభించింది. ఏదో అనుకుంటే మరేదో జరిగింది బీజేపీకి ఆంధ్రాలో టీడీపీ ఆధిపత్యం సాధించింది మిగిలిన రెండు పార్టీల నేతలు గెలుపు సాధ్యం కాకపోయినా గెలిచారు. కేంద్రంలో బీజేపీకి బొటాబొటి సీట్లు వచ్చేసరికి చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతు కీలకం అయి కూర్చుంది. బీహార్ కు ప్రత్యేక హోదా అప్డిపుడే మాండ్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజీ కోసం మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనే విషయం మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు పరిశీలనకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏం జరగబోతోందో కాలం నిర్ణయించాలి

  9. వీడిని ప్రతినిధిగా చూపిస్తే వైసిపి కు వచ్చే 11 సీట్లు కూడా next టైమ్ రావు

  10. వాడు మాట్లాడేది ఒక్క ముక్క కూడా అర్థం కాదు మండలిలో మాట్లాడుతాడు అంటా వాట్ ఎ జోక్

  11. ఓటర్లను మభ్యపెట్టి గెలవాల్సిన అవసరం వైసీపీకి, సైకో తుగ్లక్ జగన్ కి ఉందికానీ చంద్రబాబుగారికి ఆ అవసరం లేదురా గ్రేట్ ఆంధ్ర కులగజ్జి సన్నాసి.

  12. ఒరేయ్ నీకు బుద్ది ఉందా, ఏమిటి రా నువ్వు రాసేది, జోక్ అన్పిపించడం లేదా నీకు.

  13. ఏదైనా టాపిక్ మీద ఈయన అనర్గళంగా అసెంబ్లీలో కానీ, మీడియా ముందు కానీ మాట్లాడిన వీడియో ఉంటే ఉంటే పెట్టండి. ఈయన ఎప్పుడూ ప్రతిపక్షంలో పనిచేసినట్లు గుర్తు లేదు, అధికారం పక్షాన్ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వీడియో ఏమైనా ఉంటే చూపించండి..

  14. GA కు పక్షవాతం ( అదేనండీ పక్షపాతం ) కాస్త ఎక్కువే ఉన్నట్లుంది. బొత్స ఏమైనా మాయల మరాటీ నా మ్యాజిక్ చేయడానికి. ఇంకో 4 సంవత్సరాల 10 నెలలు అలా చూస్తూ ఉండాల్సిందే. మీరు నేర్పిన విద్య యే నీరజాక్షా.

  15. ఈ రోజుల్లో డబ్బుకు అమ్ముడు పోని నాయకులు ఎవరైనా ఉన్నారా. MLC లకు ఏమీ మినహాయింపు లేదు. అందరికీ అధికారం కావాలి.

Comments are closed.