గత కొంత కాలంగా సొంత పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై స్పందించానంటూనే స్పందించారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కేశినేని నాని ఎన్నోసార్లు తనను అవమానించిన సైలెంట్ గా ఉన్నానని.. అది కేవలం చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట కోసం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేశినేని మాటలకు సమాధానం ఇస్తానన్నారు.
కాగా తనకు వ్యతిరేకంగా సొంత తమ్ముడైన కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించడాన్ని నాని తట్టుకోలేక గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు కురిపిస్తున్నారు. నిన్న కూడా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇన్‌చార్జ్‌లను గొట్టంగాళ్లని వారి ఫోటోలను చూపిస్తూ మరి పరుష పదజాలంతో దూషించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు తనను గొట్టంగాడు అని అన్నారని ఆయన గుర్తు చేశారు.
కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య చాలా కాలంగా పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. గత వారంలో కూడా ఆయన మాట్లాడుతూ..కేశినేని నాని చంద్రబాబును విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. కేశినేనిని పార్టీ నుంచి బయటకు పంపడానికి టీడీపీ డిసైడ్ అయితే మాత్రం బుద్దా వెంకన్న నుండి వచ్చే మాటలను నాని తట్టుకోవడం కష్టమే. కాగా విజయవాడ ఎంపీ టికెట్‌ను టీడీపీ ఏ పిట్టలదొరకెవరికో కేటాయిస్తారని, తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.