బాబుకు లేని ధీమా తమ్ముళ్ళకు ఎక్కడ నుంచి వస్తోందో…?

ఒంటరిగా పోటీ చేస్తే ఓడుతామని తెలుగుదేశం అధినాయకత్వం అనుమానిస్తోందని అంటారు. అందుకే పొత్తుల కోసం చూస్తోందని ప్రచారంలో ఉన్న మాట. ఏపీలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఉఫ్ అని ఊదేస్తే పోయే…

ఒంటరిగా పోటీ చేస్తే ఓడుతామని తెలుగుదేశం అధినాయకత్వం అనుమానిస్తోందని అంటారు. అందుకే పొత్తుల కోసం చూస్తోందని ప్రచారంలో ఉన్న మాట. ఏపీలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఉఫ్ అని ఊదేస్తే పోయే ప్రభుత్వం ఇదని చాలా ఈజీగా తమ్ముళ్లు మాటలు వదులుతూంటారు. చంద్రబాబు స్పీచులలో కూడా అదే కనిపిస్తుంది.

ఈసారి వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తామని కూడా అంటూంటారు. ఎక్కడ చూసినా వ్యతిరేకత వెల్లువలా ఉందని కంటికి కనిపిస్తోందని అంటూంటారు. మరి అంత వెల్లువలా వ్యతిరేకత  ఉంటే సోలో ఫైట్ కి ఎందుకు రెడీ అవరో అన్న డౌట్లు అందరిలో కలుగుతున్నాయి.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఉత్తరాంధ్రా పార్టీ ఇంచార్జిగా విశాఖలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించడానికి జనాలు డిసైడ్ అయిపోయారు అన్నట్లుగా మాట్లాడారు. ఎన్నికలు జరగాలే కానీ బాబే ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నారు పనిలో పనిగా జగన్ కి రాజకీయం 2024తో సరి అని జోస్యం చెప్పేశారు.

ఏపీలో జగన్ ఫ్రాక్షనిస్ట్ పాలన చేస్తున్నారని కొత్త విమర్శ చేశారు బుద్ధా వెంకన్న. చంద్రబాబుకు విశాఖలో ఆస్తులు లేవని, ఉన్నాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు. వైసీపీ మాఫియా ఉత్తరాంధ్రాను కమ్ముకుందని చెబుతున్నారు

వైసీపీని విమర్శించి టీడీపీని పెంచి బుద్ధా వెంకన్న లాంటి తమ్ముళ్ళు ఇక ఏముంది టీడీపీ రాజ్యమే అని ప్రకటిస్తున్నారు. ఇంత చేస్తున్నా వై నాట్ 175 అని అన్ని సీట్లకు పోటీ చేసే దమ్మూ ధైర్యం టీడీపీకి ఉందా అని ఒకే ఒక్క సూటి ప్రశ్న వైసీపీ నేతల నుంచి వస్తోంది.