2018లో ఒలింపిక్స్.. అది కూడా అమరావతిలో.. ఒలింపిక్స్ లో గెలిస్తే ఏమిస్తారో తెలుసా? నోబెల్ బహుమతి! ఇవన్నీ చంద్రబాబుగారు జనాల జ్ఞానగవాక్షంలోకి ప్రసరింప చేసిన వెలుగులు! ఆఖరికి ఆ పిచ్చి మాటలను కూడా సమర్థించే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారనుకోండి!
అసలు 2018 లో ఒలింపిక్స్ జరిగాయని.. అమరావతిలోనే అవి జరిగాయని అని నమ్మించే వాళ్లు, నమ్మే వాళ్లూ, అలా కాకపోతే.. ఆయనే సీఎంగా ఉండుంటే.. 2018 లోకాకపోతే.. 2020లో అయినా అమరావతిలో ఒలింపిక్స్ జరిగేవని వాదించే వాళ్లూ, అదెలా అని లాజికల్ గా అడిగినా.. మీదపడి రక్కే జనాలూ ఉన్నారు!
మరి చంద్రబాబు జైల్లో ఉన్న వేళ అవతల మోడీ ఒలింపిక్స్ బిడ్ కోసం ప్రయత్నిస్తున్నారట! అయితే చంద్రబాబు తరహాలో.. ఎప్పుడు పడితే అప్పుడు ఒలింపిక్స్ అని, పంట పొలాల భూములు తీసుకుని వాటిల్లో ఒలింపిక్స్ అని, ఒలింపిక్స్ లో పతకం తీసుకొస్తే.. నోబెల్ ఇస్తానంటూ మోడీ ప్రకటించలేదనుకోండి!
2036లో జరగబోయే ఒలింపిక్స్ కు ఇప్పుడు బిడ్డింగులు జరుగుతున్నాయి! అది కూడా ఎలాగైనా దక్కించుకోవాలంటూ మోడీ అంటున్నారట! అంటే ఇంకా అవకాశం దక్కుతుందనే కాన్ఫిడెన్స్ కూడా లేదు! ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఆ స్థాయి అంశం! మరి అమరావతిలో వచ్చేసారి ఒలింపిక్స్ అన్నట్టుగా ఆయన తలాతోక లేకుండా ఎలా ప్రకటించారు?
ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ బహుమతిని ఇప్పిస్తానని ఎలా చెప్పారు? అంటే.. ఆయనకు మతి లేదు మరి! ఆ మతిలేని మనిషిని మాటలను పట్టుకుని అదొక విజన్ అని ప్రచారం చేస్తూ ఒక కులం ఆయనను ప్రజల ఆస్తి అని చెబుతోంది! ఇలా చెప్పి అయినా తమ కులపు ఆస్తిని కాపాడుకోవాలనే ప్రయత్నం కాబోలు!