తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వీర ఆరోగ్యవంతుడని ఈ మధ్య ఆయన చేపట్టిన పర్యటనల సందర్భంగా తెలుగుదేశం నేతలే స్పెషల్ మెన్షన్ చేసేవారు! చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉన్న నేపథ్యంలో.. ప్రజల్లో కూడా ఏవైనా డౌట్లు వస్తాయేమో అనే భయంతో చంద్రబాబు అండ్ కో ఆయన వయసు, ఆరోగ్యం విషయంలో గప్ఫాలు కొట్టుకునే వారు!
మరి బయట ఉన్నంత వరకూ చంద్రబాబు వీర ఆరోగ్యవంతుడని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఇప్పుడు ఆయనకు లెక్కలేనన్ని అనారోగ్యాలను అంటగడుతున్నాయి! ఒకటి కాదు.. కూర్చుంటే ఒక బాధ అట, పడుకుంటే ఇంకో బాధట! చంద్రబాబు కు లేని రోగాలే లేవన్నట్టుగా పచ్చ ముఠా ప్రచారం చేస్తూ ఉంది.
చర్మరోగం, గోక్కోలేక సతమతం అవుతున్నారు, గుండె సమస్య, కంటి సమస్య, వెన్నునొప్పి, పైల్స్.. ఇలా చంద్రబాబు విషయంలో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా, ఆ పార్టీ ముసుగు వీరులు రకరకాల సందర్బాల్లో వెల్లడిస్తున్న విషయాలు!
వీరి మాటలు నిజమే అయితే.. చంద్రబాబుకు లేని రోగాలంటూ లేనట్టే! చంద్రబాబుకు అదేదో చర్మవ్యాధి ఉందనే ప్రచారం చాలా పాతదే. అందుకే ఆయన ఎప్పుడూ షేవ్ చేసుకోలేని, కేవలం కట్ చేసుకుని మేనేజ్ చేస్తూ ఉన్నారని.. చంద్రబాబు గడ్డం వెనుక ఉన్న సీక్రెట్ అదేననే ప్రచారం ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గరి నుంచినే ఉంది! చంద్రబాబు చేతులు, మొహాన్ని తప్ప తన శరీరాన్ని కనపడనివ్వకపోవడం వెనుక కూడా చర్మ వ్యాధే కారణం అనే అభిప్రాయాలూ ప్రజల్లో ఏర్పడినవే!
చంద్రబాబు చేతుల మీద కూడా నిత్యం ఏదో పౌడర్ ను రాసుకుని ఉంటారని, ఆయనను దగ్గర నుంచి చూసిన జర్నలిస్టులు కొందరు వ్యాఖ్యానించారు. ఇలా చంద్రబాబు కు చర్మ వ్యాధి విషయంలో అయితే దశాబ్దాల నుంచినే ప్రచారాలున్నాయి. పాలించే వాడికి చర్మ వ్యాధి ఉండటం రాజ్యానికి సుభిక్షం కాదని మన పురాణాలు చెబుతున్నాయి.
చంద్రబాబు చర్మ వ్యాధి గ్రస్తుడు కావడం తోనే ఆయన సీఎంగా ఉన్నప్పుడు కరువు కాటకాలే ఏపీలో రాజ్యమేలుతూ ఉంటాయనే అభిప్రాయాలూ ప్రజల్లో వినిపిస్తూ ఉంటాయి. చంద్రబాబు 14 యేళ్లు సీఎంగా ఉంటే.. అందులో సగానికి సగం పైగా సంవత్సరాల్లో విపరీతమైన కరువులు ప్రజలను భీతావహులను చేశాయి కూడా!
ఇప్పుడు చంద్రబాబు, చర్మ వ్యాధి అంటూ ఆయనకు కావాల్సిన వాళ్లే మాట్లాడుతూ ఉంటే.. ఇవన్నీ గుర్తుకొస్తాయి ప్రజలకు కూడా! కేవలం చర్మ వ్యాధే కాదని, ఆయనకు రకరకాల సమస్యలు ఉన్నాయని ఆయన పై సానుభూతి పెంచడానికో లేదా బెయిల్ కోసమో అనుకూల మీడియా వర్గాలు ఎత్తుగడలు వేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైద్యులు ఆయన బీపీ రిపోర్ట్ ఇస్తున్నారు, ఇతర పరీక్షలు చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నారు, అవసరమైన మెడిసెన్స్ ను ఆయన ఇంటి నుంచినే పంపుతున్నారు కోర్టు ఆదేశాల మీదట!