డ‌చ్ జ‌ట్టుకు మ‌రో విజ‌యం..!

వ‌ర‌ల్డ్ క‌ప్ లో నెద‌ర్లాండ్స్ కు మ‌రో విజ‌యం సొంత‌మైంది. ఈ వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫైకి అయిన ద‌శ‌లోనే వెస్టిండీస్ ను ఓడించి, ఆ రెండు సార్లు ప్ర‌పంచ చాంఫియ‌న్ ను అస‌లు వ‌ర‌ల్డ్…

వ‌ర‌ల్డ్ క‌ప్ లో నెద‌ర్లాండ్స్ కు మ‌రో విజ‌యం సొంత‌మైంది. ఈ వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫైకి అయిన ద‌శ‌లోనే వెస్టిండీస్ ను ఓడించి, ఆ రెండు సార్లు ప్ర‌పంచ చాంఫియ‌న్ ను అస‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ కే క్వాలిఫై కాకుండా చేసి, ఆ స్థానాన్ని త‌ను ఆక్ర‌మించింది నెద‌ర్లాండ్స్! క్వాలిఫ‌య‌ర్స్ లోనే అలా సంచ‌ల‌నం న‌మోదు చేసిన డ‌చ్ జ‌ట్టు.. అస‌లు మ్యాచ్ ల‌లో కూడా ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. 

ఇంగ్లండ్ పై గెలుపుతో ఆ జ‌ట్టు కాన్ఫిడెన్స్ ను దారుణంగా దెబ్బ‌తీసింది డ‌చ్ జ‌ట్టు. వ‌ర‌ల్డ్ క‌ప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లండ్ కిందికి పడిపోవ‌డంలో మొద‌టి దెబ్బ‌ను నెద‌ర్లాండ్స్ వేసింది. అలా డిఫెండింగ్ చాంఫియ‌న్ పై ఘ‌న విజ‌యం సాధించ‌డం ద్వారా సంచ‌ల‌నం న‌మోదు చేసిన ఈ జ‌ట్టు బంగ్లాకు కూడా గట్టి షాకే ఇచ్చింది!

ఇత‌ర జ‌ట్ల‌కు షాక్ ఇవ్వాల్సిన బంగ్లాకు నెద‌ర్లాండ్స్ గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చింది. బంగ్లాపై నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యాన్నే న‌మోదు చేసింది. త‌ద్వారా ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్, బంగ్లాల‌పై విజ‌యాల ద్వారా.. త‌మ‌ది వ‌న్ మ్యాచ్ వండ‌ర్ కాద‌ని నెద‌ర్లాండ్స్ నిరూపించుకుంటున్న‌ట్టే! 

ఇంగ్లండ్ పై నెద‌ర్లాండ్స్ విజ‌యం, పాక్ పై ఆఫ్గాన్ విజ‌యం త‌ర్వాత ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ఇలా బంగ్లాపై నెద‌ర్లాండ్స్ విజ‌యంతో మ‌రో ఆస‌క్తిదాయ‌క‌మైన ఫ‌లితం వ‌చ్చింది. మ‌రి ఇక‌పై కూడా అలాంటి సంచ‌ల‌నాల‌కు ఏవైనా ఆస్కారం ఉందేమో వీక్షించాలి!