విశాఖ ఉక్కు ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం!

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ మొత్తంలో ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, పెద్ద సంఖ్య‌లో ఉద్యోగుల తొల‌గింపున‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ మొత్తంలో ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, పెద్ద సంఖ్య‌లో ఉద్యోగుల తొల‌గింపున‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. సుమారు 2,300 మంది కాంట్రాక్ట్ కార్మికుల‌ను తొల‌గించేందుకు యాజ‌మాన్యం చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిసింది. అలాగే ఇప్ప‌టికే 600 మంది రెగ్యుల‌ర్ ఉద్యోగులు వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యం వుంది.

దీంతో మ‌రింత మంది రెగ్యుల‌ర్ ఉద్యోగులు వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం వుంద‌ని స‌మాచారం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్ర‌భుత్వాధినేత‌లు విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ కాకుండా వుండేందుకే భారీ మొత్తంలో ప్యాకేజీ ప్ర‌క‌టించిన‌ట్టు చెప్పారు. మ‌రోవైపు ఉద్యోగుల సంఖ్య‌ను భారీగా కుదించ‌డంపై అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీలో బ్యాంకుల‌కు చెల్లించాల్సిన అప్పులు, వ‌డ్డీల‌తో పాటు వీఆర్ఎస్ తీసుకుంటున్న ఉద్యోగుల‌కు ప్యాకేజీ ఇచ్చేందుకు వినియోగిస్తార‌ని స‌మాచారం. ఇదే జ‌రిగితే విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌డం అసాధ్య‌మ‌ని కార్మికులు, యూనియ‌న్ నేత‌లు అంటున్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్లు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఒక‌వైపు కాంట్రాక్ట్‌, రెగ్యుల‌ర్ ఉద్యోగుల్ని ఇళ్ల‌కు సాగ‌నంపుతూ, మ‌రోవైపు ప్రైవేటీక‌ర‌ణ చేయ‌మ‌ని చెప్ప‌డం వెనుక దురుద్దేశం ఉంద‌ని కార్మిక నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏదో ఒక‌టి మాత్ర‌మే నిజం వుంటుంద‌ని వాళ్లు అంటున్నారు. కార్మికుల్ని అంద‌రూ క‌లిసి వంచిస్తున్నార‌ని వాళ్లు మండిప‌డుతున్నారు.

17 Replies to “విశాఖ ఉక్కు ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం!”

  1. VRS అన్నది ఒక ఇచ్చికం మాత్రమె! నిర్బందం కాదు. VRS కి apply చెస్తె దాన్ని ఉద్ద్యొగులని తొలగించటం అనరు రా అయ్యా!

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. ప్రపంచం లో ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా.. నష్టాల్లో ఉన్నప్పుడు చేసే మొదటి పని.. ఉద్యోగాల్లో కోత విధించడం..

    ఒక పక్క 6 ఏళ్లుగా నష్టాల్లో ప్లాంట్ నడుస్తోందని చెపుతున్నారు.. 18000 కోట్లు ఆర్థిక సాయం చేస్తే గట్టెక్కిస్తామని ప్లాంట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారు.. దానికి కేంద్రం 65% నిధులు సమకూర్చింది..

    ..

    ఇక ప్లాంట్ ని బతికించుకోవాల్సింది అక్కడి అధికారులే.. ఖర్చులు తగ్గించుకోవాలి.. ఉన్న రిసోర్సెస్ తోనే మాన్ హౌర్స్ పెంచుకోవాలి.. కొన్నాళ్ళు కష్టపడితే.. నష్టాల నుండి గట్టెక్కేస్తారు.. అప్పుడు ఈ సన్నాయి నొక్కులు తగ్గిపోతాయి..

    ..

    నష్టాల్లో ఉన్నప్పుడు.. అప్పుల్లో బతుకుతున్నప్పుడు.. 500 కోట్లు పెట్టి పాలస్ లు కట్టుకొనే దౌర్భాగ్యం ఉండకూడదు.. కనీసం ఆ అవసరం ఏమిటో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలీదు..

    అందుకే.. జనాలు అదను చూసి కోసి పడేస్తుంటారు..

      1. నా కామెంట్స్ నా ఇష్టం మోహన్ గారు..

        మీకు నచ్చకపోతే నన్ను బ్లాక్క్ చేసుకోండి..

        ఇక్కడ కొందరు చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ ని తిడుతూ కామెంట్స్ పెడుతుంటారు.. నేను మీలాగే వాళ్ళని ఎందుకు లాగుతున్నారు అని అడిగానా..?

        ఎవరి ఇష్టం వాళ్ళది.. నా ఇష్టాన్ని కాదనే ఇష్టం మీకు ఉండదు..

  4. కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది.

    వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ… కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు… ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. మూడు రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ, ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది.

    andhrajyothy.com/2025/andhra-pradesh/kakinada-sea-port-returned-to-original-owner-kv-rao-1361819.html

  5. కాకినాడ సీ పోర్టు

    వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ… కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు… ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. మూడు రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ, ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది.

    andhrajyothy.com/2025/andhra-pradesh/kakinada-sea-port-returned-to-original-owner-kv-rao-1361819.html

    1. ఎమిటయ్యా! భలవంతంగా లొక్కొని ఇప్పుడు తిరిగి ఇస్తె అంతా కర్రెక్ట్ అయిపొతుందా?

      మన జగనె 30 ఎళ్ళు అనుకున్నారు! పాపం 11 తొ ఎంత ప్రమాదం వచ్చింది

      1. కొన్ని నీలి బతుకులు ఇంతే..

        బియ్యం దాచేసి దోచేసుకొంటారు.. దొరికిపోతే.. డబ్బు కట్టేస్తాం .. సన్మానాలు చేయమంటారు..

        పీక మీద కత్తి పెట్టి పోర్టులు లాగేసుకొంటాం.. దొరికిపోగానీ.. చడీ చప్పుడు లేకుండా తిరిగి ఇచ్చేస్తాం.. సన్మానాలు చేయమంటారు..

        1700 కోట్లు లంచం తీసుకుని.. రాష్ట్రానికి 9000 కోట్లు నష్టం లో ముంచేస్తాం.. FBI కి దొరికిపోగానే .. సన్మానాలు చేయమంటారు.. బిరుదులతో సత్కరించమంటారు..

        ..

        దండుపాళ్యం బ్యాచ్.. వాళ్ళ ఆలోచనలే ఓ రేంజ్ లో ఉంటాయి..

  6. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  7. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక పాకేజ్ వచ్చినందుకు సంతోషం, కూటమి నాయకులకు ధన్యవాదాలు చెప్పాలి విశాఖ ప్రజలు మరియు ఉద్యోగులు. అదే విధంగా సొంత గనులు కూడా ఉక్కు ఫ్యాక్టరీకి యిస్తే ఫ్యాక్టరీ కష్టాలు నుంచి బయట పడుతుంది. ఆ విధంగా నాయకులు కృషి చేయాలి అని అందరం కోరుకుందాం

Comments are closed.