రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈట‌ల రాజేంద‌ర్‌

రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌పై మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చేయి చేసుకున్నారు.

రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌పై మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చేయి చేసుకున్నారు. పేద‌ల భూముల్ని ఆక్ర‌మించార‌నే కార‌ణంతోనే ఆయ‌న కొట్టిన‌ట్టు బీజేపీ కార్య‌క‌ర్త‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. పోచారం మున్సిపాలిటీ ప‌రిధిలోని ఏక‌శిలాన‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

ఏక‌శిలాన‌గ‌ర్‌లో రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు పేద‌ల భూములు ఆక్ర‌మించుకున్న‌ట్టు మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. త‌మ‌ను తీవ్ర ఇబ్బంది పెడుతున్నార‌ని ఎంపీ ఎదుట పేద‌లు వాపోయారు. త‌మ‌పై ఎంపీకి ఫిర్యాదు చేశార‌ని తెలిసినా బ్రోక‌ర్లు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఒక‌వేళ ఈట‌ల రాజేంద‌ర్ వ‌చ్చినా అడ్డుకుంటామ‌ని ఏజెంట్లు హెచ్చ‌రించారు. అంతేకాదు, పేద‌లు వేసుకున్న టెంట్లను త‌గ‌ల‌బెడ‌తామ‌ని కూడా వాళ్లు హెచ్చ‌రించారు.

దీంతో ఏజెంట్ల క‌థేందో తేల్చుకోవాల‌ని స్వ‌యంగా ఈట‌ల సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఏక‌శిలాన‌గర్‌లో పేద‌ల భూముల‌ను ప‌రిశీలిస్తున్న ఏజెంట్లు ఈట‌ల కంట ప‌డ్డారు. వాళ్ల‌లో ఒక‌రిపై ఈట‌ల చేయి చేసుకున్నారు. ఇదే అదునుగా భావించిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు స‌ద‌రు ఏజెంట్‌పై దాడికి పాల్ప‌డ్డారు.

పేద‌ల భూముల్ని ఆక్ర‌మించ‌డానికి ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే ఊరుకునేది లేద‌ని ఈట‌ల రాజేంద‌ర్ హెచ్చ‌రించారు. రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

6 Replies to “రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్‌ను కొట్టిన ఈట‌ల రాజేంద‌ర్‌”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. దోచుకున్న దాంట్లో వీడికి వాటా ఇచుండడు, ఆ ఫ్రస్ట్రేషన్ లో కొట్టుంటాడు. అసైన్డ్ భూములు దోచుకున్న వాడికి పేదల మీద ప్రేమ పాడా?

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.