టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఐటీ

చిత్ర పరిశ్రమలో ఈరోజు ఉదయం నుంచి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

మొన్నటివరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అట్టుడికింది టాలీవుడ్. ఆ తర్వాత మినిమం గ్యాప్ లో మోహన్ బాబు ఇష్యూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సంచలనాల పరంపర కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతున్నట్టుంది. చిత్ర పరిశ్రమలో ఈరోజు ఉదయం నుంచి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

ప్రారంభంలో కేవలం దిల్ రాజు ఆఫీసులు, ఆయన ఆస్తులపై మాత్రమే ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే, 55కి పైగా బృందాలు టోటల్ టాలీవుడ్ పై పడ్డాయి.

దిల్ రాజు ఆఫీసులతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, అభిషేక్ అగర్వాల్ ఆఫీసులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు టాలీవుడ్ కు ప్రైమ్ ఫైనాన్షియర్ గా కొనసాగుతున్న సత్య రంగయ్య ఆఫీసులు, నివాసాలపై కూడా దాడులు జరుగుతున్నాయి.

కేవలం వీళ్లపై మాత్రమే కాకుండా.. వీళ్లకు సన్నిహితంగా ఉండే వ్యక్తులపై కూడా దాడులు కొనసాగడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల విషయంలో కీలకంగా వ్యవహరించే ఓ వ్యక్తి నివాసంపై దాడులు కొనసాగుతున్నాయి. అటు దిల్ రాజుకు వ్యాపార భాగస్వామిగా కొనసాగుతున్న మ్యాంగో రామ్ ఆఫీసు, నివాసంపై కూడా ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు భారీ వసూళ్లు సాధించినట్టు పోస్టర్లు కనిపిస్తున్నాయి. కొన్ని పీఆర్ టీమ్స్ ద్వారా కొంతమంది కావాలని నంబర్స్ పెంచుతూ పోస్టర్లు వేయిస్తున్నారు. వీటి ఆధారంగా ఐటీ దాడులు జరిగినట్టు ప్రారంభంలో కథనాలు వచ్చినప్పటికీ, ఓవరాల్ గా చూసుకుంటే, ఆదాయపు పన్నుశాఖ అధికారులు పక్కా సమాచారంతో భారీ స్కెచ్ తో రంగంలోకి దిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫేక్ పోస్టర్లు చూసి ఐటీ ఆఫీసర్లు సోదాలు చేయరనే విషయం చిన్నపిల్లాడ్ని అడిగినా చెబుతాడు.

సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్యను పలు బ్యాంకులకు తీసుకెళ్లి మరీ ఆమెతో లాకర్లు ఓపెన్ చేయించి, ఆస్తులు లెక్కగట్టారు అధికారులు. ఏం జరగలేదని, ఐటీ అధికారులు జనరల్ గానే వచ్చారని దిల్ రాజు భార్య మీడియాతో చెప్పినప్పటికీ, తాజా సోదాల సరళి చూస్తుంటే, ఇంకేదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు దిల్ రాజు సోదరుడు, కూతురు నివాసాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి వరకు ఈ సోదాలు కొనసాగుతాయని అంటున్నారు.

7 Replies to “టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఐటీ”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. Anni రిస్క్ లు మనవి సక్సెస్ అయితే అందరికీ మన మీదే కాన్ను .ఫెయిల్ అయితే విషం కొనుక్కడానికి కూడా డబ్బు దొరకదు

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. ప్రభుత్వానికి అధిక ధరల టికెట్లతో జీఎస్టీ వస్తుందని పవన్ చెప్పాడని, నిర్మాతలు ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు కనిపిస్తోంది

Comments are closed.