ఇంటికి చేరుకున్న సైఫ్

కత్తిపోట్లకు గురై, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యాడు.

కత్తిపోట్లకు గురై, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యాడు. అతడు బాంద్రాలోని తన నివాసానికి చేరుకున్నాడు. సైఫ్ వస్తున్నాడని తెలుసుకొని, అతడి చుట్టుపక్కల ప్రజలు భారీ ఎత్తున సైఫ్ నివాసానికి చేరుకున్నారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే సైఫ్ ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించాడు. దొంగతనం చేసే ఉద్దేశంతో వచ్చిన అతడికి, సైఫ్ కు మధ్య పెనుగులాట జరిగింది. ఈ ఘర్షణలో కత్తితో దాడిచేసిన అగంతకుడు, సైఫ్ ను తీవ్రంగా గాయపరిచాడు.

శరీరంలో 6 చోట్ల తీవ్ర గాయాలు కావడంతో, సైఫ్ ను ఉన్నఫలంగా ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు అతడికి 2 సర్జరీలు నిర్వహించారు. అతడి వెన్నుపూసకు దగ్గర్లో 2 అంగుళాల కత్తి మొనను తొలిగించారు.

మరోవైపు జరిగిన ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముంబయి పోలీసులు, 2 రోజుల వ్యవధిలోనే దుండగుల్ని పట్టుకున్నారు. సైఫ్ పై దాడిచేసిన వ్యక్తిని బంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లామ్ షెజాద్ గా గుర్తించారు. అతడితో ఈరోజు సైఫ్ నివాసంలో క్రైమ్ సీన్ రీ-కనస్ట్రక్షన్ కూడా పూర్తిచేశారు.

హత్యా యత్నంతో పాటు పాస్ పోర్టు చట్టంలోని పలు సెక్షన్లపై అతడిపై కేసు నమోదు చేయగా, కోర్టు నిందితుడ్ని పోలీస్ కస్టడీకి అప్పగించింది. మొత్తానికి సైఫ్ ప్రాణాపాయం నుంచి బయటపడి సేఫ్ గా ఇంటికి చేరుకోవడంతో, బాలీవుడ్ తో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఊపిరిపీల్చుకుంది.

6 Replies to “ఇంటికి చేరుకున్న సైఫ్”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. So what ,? AP lo inkaa vartalu levaa ? Marakalu desaniki chetu…

    Akkada Kumbha mela jarugutunte adi chupinchdam manese yevattho nalla beauty tayattulu ammukuntunte daani cover chetunnaru ..ko jj a gaalii , kaa man dulu hindi media ku kka lu …chi media antene ummalani undi

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.