ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!

కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. టాలీవుడ్ కు మూలస్తంభాలుగా చెబుతారు వీళ్లని. దశాబ్దాలుగా వీళ్లు పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత తరం హీరోల రాకతో వీళ్లలో కొంతమంది హవా తగ్గింది.

అయితే రీసెంట్ గా ఈ నలుగురు సీనియర్లలో ముగ్గురు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక మిగిలింది ఒకే ఒక్కరు. ఆయనే నాగార్జున.

ముందుగా చిరంజీవి విషయానికొద్దాం. మధ్య మధ్యలో భోళాశంకర్ లాంటి డిజాస్టర్లు వచ్చినప్పటికీ చిరంజీవి మార్కెట్ చెక్కుచెదరలేదు. ఇంకా చెప్పాలంటే సీనియర్లలో ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటున్నది కూడా చిరంజీవినే.

మొన్నటివరకు 3-4 ఫ్లాపుల మధ్య ఓ హిట్ ఇస్తూ వచ్చిన బాలకృష్ణ కూడా గాడిలో పడ్డారు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. సక్సెక్ తో పాటు తన పారితోషికాన్ని కూడా పెంచుకుంటూ పోతున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాతో వెంకీ కెరీర్ కూడా గాడిన పడింది. సంక్రాంతి సీజన్ లో క్లియర్ విన్నర్ గా నిలిచిన ఈ సినిమాతో వెంకటేష్, మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. మార్కెట్ వాల్యూ పెంచుకున్నారు.

ఈ నలుగురిలో ఇక నిరూపించుకోవాల్సింది నాగార్జున మాత్రమే. బంగార్రాజు సక్సెస్ తర్వాత ‘ది ఘోస్ట్’ రూపంలో పెద్ద డిజాస్టర్ ఇచ్చారు నాగ్. గతేడాది ‘నా సామిరంగ’ సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించినా, ఆయన స్థాయి విజయం కాదది. వెంకీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సినిమా ఎలా పడిందో, నాగార్జునకు కూడా ఆ స్థాయి సినిమా ఒకడి పడాల్సిన అవసరం ఉంది.

కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.

19 Replies to “ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. my comment disappeared..

    nagarjuna is the worst character in real life…when farmers were crying, this fellow put his foot on amaravati farmers land and said he came to support 3 capitals…a real b*stard who will pick a penny from s*hit

  4. Chiru’s son RC is superstar now

    Venky and Balayya kids – Not entered industry yet, no big responsibilities

    Nag focused on both sons career as both are still struggling. Nag not able to focus on his own movies lately.

  5. చిరు కొడుకు రామ్ చరణ్ ఇప్పుడు సూపర్ స్టార్

    వెంకీ, బాలయ్య పిల్లలు – ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు, పెద్దగా బాధ్యతలు లేవు

    కానీ నాగ్ ఇద్దరు కొడుకుల కెరీర్ పై దృష్టి పెట్టాడు, తన సొంత సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు.

Comments are closed.