కమల నాయకులు తమ ఆప్తులే కదా!

జగన్ కేసుల సంగతి తేల్చేసే దాకా న్యాయమూర్తులు కూడా మారడానికి వీల్లేదని ఆయన అనుకుంటున్నారో ఏమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు ఒక సరికొత్త ఆరోపణతో తాజాగా వార్తల్లో నిలిచారు. ఈ దేశంలోని అత్యున్నత నేర విచారణ సంస్థ సీబీఐ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు అయినట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద ఆరోపణ.

ఏ విచారణ సంస్థ అయితే.. నిష్పాక్షిక, నిర్భయ దర్యాప్తు జరుపుతుందని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారో.. ఆ సంస్థ మీద.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శాసనసభ డిప్యూటీ స్పీకరు తరఫు న్యాయవాది సాక్షాత్తూ సుప్రీం కోర్టులో చేస్తున్న ఆరోపణ చాలా తీవ్రమైనది. అయితే ఇక్కడ సామాన్యులకు కలుగుతున్న సందేహం ఒక్కటే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమే రాష్ట్రంలో కూడా రాజ్యం చేస్తోంది. ఆయన అందులో భాగస్వామి. అలాంటి నాయకుడు.. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి సీబీఐ కుమ్మక్కు కాకుండా చూడలేరా? అనేదే సందేహం.

జగన్ ను ఇరుకున పెట్టాలనేది రఘురామక్రిష్ణ రాజు కోరిక. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రఘురామతో అనుబంధం చెడింది. ఇద్దరూ దానిని చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నారు గనుక.. రఘురామను అరెస్టు చేయించారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదల అయ్యారు.

ఇప్పుడు ఆయన అధికారం చేతిలో ఉన్న కూటమిలో ఉన్నారు గనుక.. జగన్ మీద వీలైనన్ని రకాలుగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నారు. తనమీద హత్యాయత్నం జరిగిందంటూ.. జగన్ ను ఏ1గా చేర్చి కేసు నడిపిస్తున్నారు. జగన్ అక్రమార్జనలకు సంబంధించిన కేసుల విచారణ తేలడం లేదంటూ సుప్రీం కోర్టులో దావా నడుపుతున్నారు. ఆ కేసు విచారణ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ఆరోపణ.. సీబీఐ మీదకే నెపం నెట్టివేయడం. ఇంతకూ జగన్ తో సీబీఐ కుమ్మక్కు అయినట్టుగా ఆయనకు ఎందుకు అభిప్రాయం కలిగిందో ఆ కారణం వింటో చాలా చిత్రంగా అనిపిస్తుంది.

జగన్ తరఫు న్యాయవాదులు వాయిదా కోరిన ఏ సందర్భంలోనూ సీబీఐ వారు అభ్యంతరం చెప్పడం లేదుట. అందువల్ల సీబీఐ కుమ్మక్కు అయినట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఫర్ సప్పోజ్.. కుమ్మక్కు నిజమే అనుకుందాం. అయితే కేంద్రంలోని భాజపా నాయకులతో తనకు మహా గొప్ప దోస్తానా ఉంటుందని చెప్పుకునే రఘురామక్రిష్ణ రాజు వారి ద్వారా సీబీఐ మీద ఒత్తిడి తేలేకపోయారా? ఇక్కడేమీ ఆబ్లిగేషన్ కూడా లేదు కదా.. కుమ్మక్కు కాకుండా పనిచేయమని చెప్పడం మాత్రమే కదా! అది కూడా రఘురామ చేయించలేకపోతున్నారా? అనేది పలువురి సందేహం.

అయినా న్యాయమూర్తులు బదిలీ అవుతుండడాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించే తరహాలో రఘురామ ఆరోపణలు సాగుతున్నాయి. జగన్ కేసుల సంగతి తేల్చేసే దాకా న్యాయమూర్తులు కూడా మారడానికి వీల్లేదని ఆయన అనుకుంటున్నారో ఏమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.

15 Replies to “కమల నాయకులు తమ ఆప్తులే కదా!”

  1. CBI చాలా నికార్సైన సంస్థ అంటావ్ !! CBI/ED కేసులు 100% genuine అంటావ్ !! అవినా ‘ బావ, ja***, బ్రా రతి అంకు ని ఏసేయటం కూడా నిజమంటావ్!! పొట్ట చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కామ్ గా తేలుకుట్టిన దొంగ లా ఓ పక్కన పడి ఉంటే బెటర్ బామ్మర్ది !!

  2. C*B*I చాలా నికార్సైన సంస్థ అంటావ్ !! C*BI/E*D కేసులు 100% genuine అంటావ్ !! అ వినా ‘ బావ, ja***, బ్రా*రతి అంకు ని ఏసేయటం కూడా నిజమంటావ్!! పొట్ట చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కామ్ గా తేలుకుట్టిన దొం*గ లా ఓ పక్కన పడి ఉంటే బెటర్ బా*మ్మ*ర్ది !!

  3. C*B*I చాలా నికార్సైన సంస్థ అంటావ్ !! C*BI/E*D కేసులు 100% genuine అంటావ్ !! అ వినా ‘ బావ, ja***, బ్రా*రతి అంకు ని ఏసేయటం కూడా నిజమంటావ్!! పొట్ట చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కామ్ గా తేలుకుట్టిన దొం*గ లా ఓ పక్కన పడి ఉంటే బెటర్ బా*మ్మ*ర్ది !!

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  6. VRS అన్నది ఒక ఇచ్చికం మాత్రమె! నిర్బందం కాదు. VRS కి apply చెస్తె దాన్ని ఉద్ద్యొగులని తొలగించటం అనరు రా అయ్యా!

Comments are closed.