బిందుమాధ‌వ్ నియామ‌కం వెనుక లోకేశ్‌!

బిందుమాధ‌వ్‌ను కాకినాడ బాస్‌గా పంప‌డం ద్వారా, సానా స‌తీష్‌ను మ‌రింత శ‌క్తిమంతుడిగా తీర్చిదిద్ద‌డం, జ‌న‌సేన ప్రాభ‌వాన్ని త‌గ్గించే వ్యూహం క‌నిపిస్తోంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

కాకినాడ ఎస్పీగా బిందుమాధ‌వ్‌ను నియ‌మించ‌డం వెనుక మంత్రి నారా లోకేశ్ వ్యూహం ఉన్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కాకినాడ జిల్లా ప‌రిధిలోకే పిఠాపురం కూడా వ‌స్తుంది. కాకినాడ ఎంపీగా జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆత్మీయుడు తంగెళ్ల ఉద‌య్ శ్రీ‌నివాస్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అంతేకాదు, కాకినాడ జిల్లాలో జ‌న‌సేన బ‌లంగా వుంది.

ఈ నేప‌థ్యంలో కాకినాడ ఎస్పీగా బిందుమాధ‌వ్‌ను నియ‌మించ‌డం వెనుక లోకేశ్ రాజ‌కీయ వ్యూహం వుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆ జిల్లాలో లోకేశ్ స‌న్నిహితుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు సానా స‌తీష్ చ‌క్రం తిప్పుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు స‌న్నిహితుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట చెల్లుబాటు అయ్యేది. టీడీపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కొత్త త‌రం నాయ‌క‌త్వం తెర‌పైకి వ‌చ్చింది.

దీంతో కాకినాడ జిల్లాలో ప‌ట్టు సాధించేందుకు పోలీస్‌బాస్‌గా త‌న మ‌నిషిని నియ‌మించాల‌ని లోకేశ్ ప‌ట్టుప‌ట్టిన‌ట్టు తెలిసింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌ల్నాడు ఎస్పీగా బిందుమాధ‌వ్ తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకున్ని ఆయ‌న్ను అక్క‌డి నుంచి బ‌దిలీ చేసింది. కానీ బిందుమాధ‌వ్ టీడీపీ అధికారిగా గుర్తింపు వుంది.

లోకేశ్‌కు ద‌గ్గ‌రి అధికారిగా పేరున్న‌ బిందుమాధ‌వ్‌ను కాకినాడ ఎస్పీగా నియ‌మించ‌డం ద్వారా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్ట‌డం, ఇదే సంద‌ర్భంలో జ‌న‌సేన నాయ‌కుల అధికారాల‌కు క‌త్తెర వేయించే ఎత్తుగ‌డ వుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ప్ర‌స్తుతం కాకినాడ జిల్లాలో జ‌న‌సేన నాయ‌కులు పోలీస్‌స్టేష‌న్ల‌లో హ‌వా కొన‌సాగిస్తున్న‌ట్టు లోకేశ్‌కు ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు తెలిసింది.

అలాగే కాకినాడ ఎంపీ అత్యుత్సాహంతో ముందుకెళుతూ, టీడీపీ నాయ‌కుల‌కు విలువ లేకుండా చేస్తున్నార‌నే ఫిర్యాదుల్ని లోకేశ్ సీరియ‌స్‌గా తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో బిందుమాధ‌వ్‌ను కాకినాడ బాస్‌గా పంప‌డం ద్వారా, సానా స‌తీష్‌ను మ‌రింత శ‌క్తిమంతుడిగా తీర్చిదిద్ద‌డం, జ‌న‌సేన ప్రాభ‌వాన్ని త‌గ్గించే వ్యూహం క‌నిపిస్తోంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

12 Replies to “బిందుమాధ‌వ్ నియామ‌కం వెనుక లోకేశ్‌!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే, బాయ్, వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. Ento nee badha. Lokesh, and pawan venakala paddaventi? Lokesh never become CM when Babu is alive. Pawan don;t seek CM when Babu is around in kootami govt, what are you trying?

Comments are closed.