చంద్రబాబు గెలిస్తే అవన్నీ మూసివేతే!

‘‘ ఒక కుక్కను చంపదలుచుకుంటే గనుక, ముందుగా అది పిచ్చిది అని ప్రచారం చేయి’’ అనేది సార్వజనీనమైన సామెత. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలివితేటలు ఎక్కువైపోయిన వాళ్ళు అమలు చేసే సిద్ధాంతం ఇది. ఒక వ్యక్తిని…

‘‘ ఒక కుక్కను చంపదలుచుకుంటే గనుక, ముందుగా అది పిచ్చిది అని ప్రచారం చేయి’’ అనేది సార్వజనీనమైన సామెత. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలివితేటలు ఎక్కువైపోయిన వాళ్ళు అమలు చేసే సిద్ధాంతం ఇది. ఒక వ్యక్తిని భ్రష్టు పట్టించాలంటే, ముందు అతని ఇమేజ్ను సర్వనాశనం చేయాలి. చంద్రబాబు నాయుడుకు ఇలాంటి తెలివితేటలు చాలా ఎక్కువ. అందుకే ఆయన ఒకవేళ తాను అధికారంలోకి రావడం అంటూ జరిగితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే తీసుకుంటాడో.. అవన్నీ అద్భుతాలు అని ప్రజలను నమ్మించడానికి ఇప్పటినుంచి చాటుమాటు దొంగ ప్రచారాలు ప్రారంభిస్తున్నారు. 

చంద్రబాబు నాయుడు కలగంటున్నట్టుగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే గనుక జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అనేకానేక సంక్షేమ పథకాలకు నిర్మొహమాటంగా మంగళం పాడేస్తారని ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పేదలకు ఇస్తున్న పథకాలు అమ్మ ఒడిలాంటివి, లానేస్తం లాంటివి ఏవి అమలు కావు అని ప్రజలు భయపడుతున్నారు.  

ప్రజలలోని ఇలాంటి నమ్మకం తనను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించదు అనే భయంతో.. తాము అధికారంలోకి వచ్చినా సరే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఉన్నదున్నట్టుగా కొనసాగుతాయని చంద్రబాబు అండ్ కో పదేపదే చెబుతున్నారు. సంక్షేమ పథకాల విషయం ఏమోగానీ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మరొక అద్భుతమైన వ్యవస్థను మాత్రం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నిర్మూలించే ప్రమాదం ఉంది.

జగన్మోహన్ రెడ్డి వివిధ కులాలకు సామాజిక వర్గాలకు సమతుల అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడానికి కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఆయా సామాజిక వర్గాలలో పేదలను ఆదుకునే ప్రయత్నం పుష్కలంగా జరుగుతుంది. అయితే వీటిని కొనసాగించే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు లేదు. ఆ విషయం గురువారం నాడే స్పష్టమైపోయింది. కార్పొరేషన్లు అన్నింటినీ సర్వ నాశనం చేసేయాని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు.. ముందుగా అని వృధా అనే ప్రచారాన్ని ప్రారంభించారు.

గురువారం నాడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలో కార్పొరేషన్ల ప్రస్తావన వచ్చింది. కార్పొరేషన్లన్నీ మూసివేసే పరిస్థితి వచ్చిందంటూ చంద్రబాబు నాయుడు తన విశ్లేషణను వినిపించారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో దానికి నిదర్శనం ఏమిటో ఆయన మచ్చుకైనా చెప్పలేదు.  

ఇదే కార్పొరేషన్లను మూసివేసే పరిస్థితి ఉన్నదంటూ ప్రచారం చేయడం ద్వారా.. కార్పొరేషన్లు మూసి వేయడానికి ఆయన ముందే ప్రజలను సిద్ధం చేస్తున్నారని అనిపిస్తుంది.  చంద్రబాబు అధికారంలోకి వస్తే వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రత్యేకించిన అనేకానేక కార్పొరేషన్లు కనుమరుగైపోవడం గ్యారంటీ. చంద్రబాబు మాటలు విన్న ప్రతి ఒక్కరికి అలాంటి కొత్త భయం మొదలైంది.