చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఆయన్ను సీఐడీ కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో రెండు రోజుల పాటు స్కాంకు సంబంధించిన విషయాలపై చంద్రబాబు విచారణ ఎదుర్కొబోతున్నారు. ఇప్పటికే న్యాయస్థానం రెండు రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించిన విషయం తెలిసిందే.
సీఐడీ అధికారులు ఐదు రోజులు పాటు చంద్రబాబు కస్టడీ కావాలని అడిగిన న్యాయస్థానం రెండు రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చింది. మరి విచారణ అనేది సీఐడీ ఆఫీసులో చేస్తారా లేకపోతే జైల్లోనే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
కాగా కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు చంద్రబాబు. రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారన్నారు.