పాపం లోకేశ్‌.. వ‌ణికిపోతున్నాడు!

చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ బాగా భ‌య‌ప‌డిపోతున్నారు. అందుకే ఆయ‌న నిజాలు మాట్లాడ్డానికి ధైర్యం చేయ‌డం లేదు. చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక సీఎం వైఎస్ జ‌గ‌న్ కేవ‌లం పాత్ర‌ధారి…

చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ బాగా భ‌య‌ప‌డిపోతున్నారు. అందుకే ఆయ‌న నిజాలు మాట్లాడ్డానికి ధైర్యం చేయ‌డం లేదు. చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక సీఎం వైఎస్ జ‌గ‌న్ కేవ‌లం పాత్ర‌ధారి మాత్ర‌మే అని, అస‌లు సూత్ర‌ధారి ప్ర‌ధాని మోదీ అని టీడీపీ అనుకూల ప‌క్షాల‌న్నీ గొంతెత్తి అరుస్తున్నాయి. కానీ బాబు అరెస్ట్‌తో ప్ర‌థ‌మ బాధితుడైన లోకేశ్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులెవ‌రూ ఆ మాట అన‌డానికి జంకుతున్నాయి.

దేవుడికైనా దెబ్బే గురువంటే ఇదే కాబోలు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఢిల్లీలో లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ త‌న తండ్రి అరెస్ట్ ఎలా అక్ర‌మ‌మో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ప్ర‌మోయంపై ఆయ‌న స్పందించారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేక‌పోవ‌చ్చున‌ని ఆయ‌న అనడం గ‌మ‌నార్హం. సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డం కేవ‌లం జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఆలోచ‌నే కాద‌నేది అంద‌రి అభిప్రాయం.

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండ‌దండ‌లు, ప్రోత్సాహం లేక‌పోతే చంద్ర‌బాబును అరెస్ట్ చేసేంత సాహ‌సం జ‌గ‌న్ చేసి వుండేవారు కాద‌నే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తోంది. అయితే బ‌హిరంగంగా ఆ మాట అంటే, చంద్ర‌బాబుతో పాటు ఇత‌ర నేత‌ల‌కు మ‌రిన్ని చిక్కులు ఎదుర‌వుతాయ‌ని టీడీపీ భ‌య‌పెడుతోంది.

అబ్బే, చంద్ర‌బాబు అరెస్ట్‌కు, బీజేపీకి అస‌లు సంబంధ‌మే లేద‌ని లోకేశ్ అన‌డం ఆయ‌న‌లోని భ‌యాన్ని బ‌య‌ట పెట్టింద‌ని చెప్పొచ్చు. ఢిల్లీలో లోకేశ్‌ను బీజేపీ పెద్ద‌లు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఢిల్లీలో లోకేశ్ ప‌ర్య‌ట‌న వృథా ప్ర‌యాస అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అంతోఇంతో లోకేశ్‌కు ఇండియా కూట‌మిలోని పార్టీలే నైతికంగా అండ‌గా నిలిచాయి. ఇంత‌కు మించి లోకేశ్‌కు ఢిల్లీలో ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు.