సంకటంలో చంద్రబాబు!

చంద్రబాబు నాయుడు ఇపుడు గొప్ప సంకటంలో పడ్డారు. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు గనుక ఆయనకు బోలెడు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎంతోమంది వచ్చి పార్టీలో చేరుతాం అంటుంటారు. అయితే ఆ ఆఫర్లను…

చంద్రబాబు నాయుడు ఇపుడు గొప్ప సంకటంలో పడ్డారు. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు గనుక ఆయనకు బోలెడు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎంతోమంది వచ్చి పార్టీలో చేరుతాం అంటుంటారు. అయితే ఆ ఆఫర్లను ఎంత ‘ప్రయోజనకరం’గా వాడుకోవాలి అనేది ఆయన వ్యూహ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పార్టీలో చేరడానికి వచ్చే ఆఫర్లు, వారిని చేర్చుకోవద్దు అంటూ అంతర్గతంగా ఉన్న ఒత్తిడిల మధ్య చంద్రబాబు నాయుడు నలిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది.

గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన మద్దాలి గిరి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆయన తెలుగుదేశం లో చేరడానికి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వెళ్లిపోయిన గిరిని చేర్చుకోవద్దు అంటూ పార్టీలో ఒత్తిడులు ఉన్నాయి. ఇలాంటి చేరికల విషయంలో చంద్రబాబు మెతకగా ఉంటారనేది పార్టీలో పలువురి అభిప్రాయం.

ఇదివరకు కూడా ఒకసారి పార్టీని వదలి వెళ్లిపోయినా మళ్లీ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించిన చరిత్ర ఉంది. చివరకు సి రామచంద్రయ్య వంటి నాయకుడు కూడా, పార్టీ ఓడినప్పుడు వదలి వెళ్ళిపోయి, మళ్లీ వచ్చినా బాబు చేర్చుకున్నారు. కాకపోతే ఆయన ఎన్నికలకు ముందే వచ్చారు. గెలిచిన తర్వాత వస్తున్న మద్ధాలి గిరి లాంటి వారిని చేర్చుకోవద్దని పార్టీ వారు అంటున్నారు.

అయితే చంద్రబాబు ఆలోచన ఇంకో రకంగా ఉన్నదని విశ్వసనీయ సమాచారం. రాజకీయ పదవులు ఎన్నికల్లో టికెట్లను ఆశించకుండా ఉంటే చేర్చుకుంటాం అని చెబుతున్నట్టు సమాచారం. అంటే కేవలం వ్యాపారాలకు మాత్రం ప్రభుత్వ అండ ఉంటుందన్న మాట.

చంద్రబాబు అలాంటి యోచనతో ఉన్నారు. మరొకవైపు మద్దళి గిరి మాత్రం టీడీపీ తో పాటు, జనసేనతో కూడా మంతనాలు జరుపుతున్నారని, ఎటునుంచి బెటర్ ఆఫర్ వస్తే అటు వెళతారని వినిపిస్తోంది.

8 Replies to “సంకటంలో చంద్రబాబు!”

  1. 23 సీట్లు సంక్షోబాన్ని ఎదురుకుని, తిరిగి పుంజుకున్న ఆయనకి ఇదో సంకటం కాదు .. సంకటము మనకి వొచ్చింది .. అది చెప్పుకోలేక పక్క వాళ్ళ మీద తోసేస్తున్నాము ..

Comments are closed.