వలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. తాజాగా వలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలిస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఇది ప్రైవేట్ కంపెనీ అయితే దానికి అధిపతి ఎవరని ఆయన నిలదీశారు. ఇంకా ఏవేవో ఆయన వలంటీర్లకు సంబంధించి ప్రశ్నలతో అజ్ఞానాన్ని ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలో వలంటీర్లకు బాస్ ఎవరో ఇవాళ్టి వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని నెటిజన్లు సమాధానం ఇవ్వడం విశేషం. వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ పదేళ్లుగా చంద్రబాబునాయుడికి దత్త పుత్రుడు వలంటీర్‌గా సేవలందిస్తున్నారని దెప్పి పొడిచారు. వలంటీర్లపై పవన్ విమర్శలకు కౌంటర్‌గా జగన్ రివర్స్ ఎటాక్ చేయడాన్ని గమనించొచ్చు.
జగన్ సెటైర్‌తో వలంటీర్ల బాస్ ఎవరూ చెప్పకనే చెప్పినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబుకు రాజకీయ సేవలందిస్తున్న అతిపెద్ద వలంటీర్ దత్త పుత్రుడే అని వేలాది మంది సాక్షిగా జగన్ విమర్శ చేశారు. దీంతో వలంటీర్ల బాస్ ఎవరనే పవన్ ప్రశ్నకు… చంద్రబాబు అని జగన్ వ్యంగ్య ధోరణిలో సమాధానం ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వలంటీర్లపై పవన్ విమర్శలు మిస్ ఫైర్ అయ్యాయి. దాని నుంచి ఆయన బయటికి రాలేకున్నారు.
తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, అహానికి పోతూ మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఈ పరంపరలోనే తాజాగా ట్విటర్ వేదికగా పవన్ సంధించిన ప్రశ్నలను చూడాల్సి వుంటుంది. అయితే పవన్‌కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు పదేళ్లుగా సేవలందిస్తున్న వలంటీర్‌గా చిత్రీకరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్‌కు బాగా బుద్ధి చెప్పారనే కామెంట్స్ రావడం విశేషం.