విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ళ పండుగ జరుగుతోంది. తెలుగు నాట ఒక విశ్వవిద్యాలయం శతాబ్ది పూర్తి చేసుకోవడం అంటే ఎంతో ఘనతను సాధించడమే. ఈ వందేళ్ళ పండుగ చిరస్మరణీయంగా నిర్వహించాలని ఏయూ నిర్వాహకులు భావించారు. అయితే ఈ ఉత్సవాలకు ప్రముఖులను పెద్దలను ఆహ్వానించినప్పటికీ ఎవరూ హాజరు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాకుండా ఆవేదనకు గురి చేసింది.
ఏయూ శతాబ్ది ఉత్సవాల వేళ విశాఖలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 1926 లో స్థాపించబడిన ఏయూ విద్యా రంగంలో ఎంతో కీర్తిని ఆర్జించింది. అటువంటి విశ్వవిద్యాలయం తన ప్రస్థానం లో కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ఏలికలు వచ్చి ఆ సంబరాలలో పాలుపంచుకుంటే ఆ కీర్తి మరింత ఎక్కువగా దశ దిశలా వ్యాపిస్తుంది అని అంటున్నారు. అయితే ఆహ్వానించినా ఈ వైపునకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ రాకపోవడం పట్ల అంతా తర్కించుకుంటున్నారు. దీని మీద రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఘనత వహించిన విశ్వవిద్యాలయాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. ఏయూ లాంటి ప్రఖ్యాత వర్శిటీకి తగిన ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం తగని పని అన్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యా రంగంలో ఆంధ్రా యూనివర్సిటీ అశేషమైన కృషి చేస్తోందని ఆయన గుర్తు చేశారు. అటువంటి ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చూస్తే ప్రభుత్వానికి ప్రయివేట్, కార్పొరేట్ అనుకూల విద్యావిధానం బాట అన్నది స్పష్టమవుతోందని ఆయన విమర్శలు చేశారు.
ఆయన అన్నారని కాదు కానీ ఏయూని అభిమానించేవారు కూడా ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఈ వైపునకు రాలేదు అని ఆలోచిస్తున్నారు. బ్రిటిష్ వారి హయాంలో ఏర్పాటు అయి రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్న ఒక అత్యున్నత విశ్వవిద్యాలయం విషయంలో ఈ తీరున వ్యవహరించడం మంచి సంకేతం కాదని అంటున్నారు.
Veedu eppudu anthe
Private universities ayithe cheppu vachi Gitam oka brand Narayana schools oka brand ani chepi potham
AU JNTU la ki endhuku vastham sir
Miru inka update avvali
Vasthe fee reimbursement ivvale ani students k***a pagala kodatharu ami bhayam emo
Asale 3 days lo 2025 batch students reveal avthunaru…2024 pass out batch ante jagan pending lu petti velladu ani valla midha thosesyaru..but idhi ee govt vachina taruvatha batch… So reason dorakale rale
కాళీ గా “ప్యాలెస్ పంది” ఉన్నాడు . ఆడు రావొచ్చు గా