హ‌వ్వా.. న‌వ్విపోతున్నారు బాబు!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించారు. అధికార పార్టీ పై అనేక విమర్శలు చేశారు. అంత వరకు బాగానే ఉంది. రాజకీయాల్లో ఇది సహజం. పనిలో పనిగా…

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించారు. అధికార పార్టీ పై అనేక విమర్శలు చేశారు. అంత వరకు బాగానే ఉంది. రాజకీయాల్లో ఇది సహజం. పనిలో పనిగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి పై నిరాదరణ ఆరోపణలు చేశారు. ధర్మారెడ్డి శ్రీవారిని అడ్డంగా పెట్టుకుని కేసులు లేకుండా పైరవీలు చేస్తున్నారని. టీటీడీ ఈఓగా పని చేయడం ఓ కల, అలాంటిది ఐదేళ్లు ఒకరినే ఎలా కొనసాగిస్తారంటూ అర్ధం పర్థం లేని ఆరోపణలు, ప్ర‌శ్న‌లు వేశారు.

ధర్మారెడ్డి సరే బాలసుబ్రహ్మణ్యం మాటేమిటి?

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం అనే అధికారిని 9 సంవత్సరాలు తిరుమల JEOగా కొనసాగించిన విషయాన్ని చంద్ర‌బాబు ఎలా మ‌రిచారు? బాలసుబ్రహ్మణ్యం JEO గా కొనసాగినంత కాలం ఈఓలు సైతం ఆయ‌న‌ కనుసన్నల్లోనే పని చేయాల్సిన వచ్చింది.

ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబును భక్తులు ఇంకా ఎంత కాలం బాలసుబ్రహ్మణ్యంను తిరుమల జేఈఓ గా కొసాగిస్తారని నేరుగా ప్రశ్నించారు. అయినా తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయ‌న్నే కొనసాగించారు. ఏపీ విభజన తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పటికే చాలా కాలం జేఈఓ గా పని చేస్తున్న శ్రీనివాసరాజును మార్చాల‌నే ఆలోచ‌న చేయ‌లేదు. బాబు సీఎంగా ఉన్నంత కాలం శ్రీ‌నివాస‌రాజే జేఈవోగా కొన‌సాగిన సంగ‌తి ఇంకా అంద‌రికీ గుర్తుంది. ఇన్ని చేసిన చంద్రబాబు దర్మారెడ్డి నియామకం విషయంలో రాద్ధాంతం చేయడం రాజకీయం తప్ప మరోటి కాదు.

ధర్మారెడ్డిపై తప్పుడు విమర్శలు

ధర్మారెడ్డి అదనపు ఈఓగా పని చేస్తున్నారు. ఈఓ FAC గా  దాదాపు 20 నెలలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అనిల్ కుమార్ సింగాల్ 15 నెలలు, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి 20 నెలలు ఈఓలుగా బాధ్యతలు నిర్వహించారు. వీళ్లిద్ద‌రు సీనియర్ ఐఏఎస్‌ అధికారులు. అలాంటిది ధర్మారెడ్డి ఐదేళ్లుగా ఈఓగా కొనసాగుతున్నారని విమర్శలు చేయడం చంద్రబాబుకే చెల్లింది.

విధి నిర్వ‌హ‌ణ‌లో ధ‌ర్మారెడ్డి  తప్పులు చేస్తే ప్రశ్నించవచ్చు. అంతే తప్ప అవాస్తవాలు, అర్ధ సత్యాలను చెబితే భక్తులు అంగీకరించరు. ప్రతి అంశంపై అవినీతి ఆరోపణలు చేసే చంద్రబాబు… ధర్మారెడ్డి విషయంలో ఎలాంటి ఆరోపణలు చేయలేకపోయారు. శ్రీ‌వారి భక్తులు న‌వ్వుకుంటార‌నే స్పృహ కూడా లేకుండా చంద్ర‌బాబు అవాకులు చెవాకులు పేలారనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.