తెలుగు సినిమాలో ఒక డైలాగ్ 'అమ్మ తోడు నన్ను ఎవరూ కొట్టలే.. నమ్మండి స్వామి… నమ్మండి' అంటూ మీడియా ముందుకు విలన్ వచ్చి వేడుకొంటాడు అలాగే ఉంది చంద్రబాబు పొత్తు వ్యవహరం. 'నేను ఎవరిని పొత్తు అడగలేదు.. నమ్మండి స్వామి నమ్మండి' అని చంద్రబాబు ఇప్పుడు డైలాగులు చెప్పుతున్నారు. తనే ఒక వైపు పవన్ కు లవ్ ప్రపోజల్ చేసి తీరా లవ్ ఒప్పుకుంటే లేదులేదు.. లవ్ లేదు అని తప్పుంచుకొని తిరుగుతున్నాడు 40 సంవత్సరాల అనుభవ రాజకీయ ఉద్దండుడు.
చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పొత్తు గురించి మాట మార్చి తన గోప్పలు చెప్పుతున్నారు తప్ప పొత్తు ఉంటుందా లేదా అనేది తెల్చలేదు. అసలు నేను ఎక్కడ బీజేపీ పొత్తు కొసం వెంప్లడటం లేదని చంద్రబాబు చెప్పుతున్నాడు. కానీ రోజు ఎల్లో మీడియాలో బీజేపీ- టీడీపీ తొందరలోని కలుస్తుందని, తెలంగాణలో సీమాంధ్రులు ఓట్ల కోసం బాబు ఆవసరం అని పొత్తు ఉంటుందని ఎల్లో మీడియా వార్తలు వడ్డి వర్చింది. పాపం ఎల్లో మీడియా చేసిన హడవుడికి సొంత పార్టీ కార్యకర్తలకు కూడా చంద్రబాబు నాయకత్వంపై అనుమానలు వచ్చేలాగా చేశాయి.
ఎప్పుడో కలిసినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అని మాట్లాడినా మాటలను కూడా వారం రోజులు పాటు డిబెట్లు పెట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కలిసి పోటీ చేసీ అధికారంలోకి వస్తాయి అని వార్తలు వండి రాతలు రాశారు టీడీపీ అను'కూల' మీడియాలో. తీరా ప్రజల్లో ఆ వార్తలు నెగిటివ్ గా వెలుతున్నాయి అని ఇప్పుడు బాబు మాట మారుస్తున్నారు.
చంద్రబాబు ఎంత దాబాయించుకున్న పరిస్ధితి మాత్రం చేయి జారిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీతో పోత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీకి లాభం కంటే నష్టం అనేది తెలంగాణ బీజేపీ నేతలకు బాగా తెలుసూ, ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోని చివరికి కాంగ్రెస్ పరిస్ధితి ఏమయిందో అందరికి తెలుస.
ఒక వైపు టీ.బీజేపీ వద్దంటూంటే.. ఆంధ్రలో కొంత మంది చంద్రబాబు అను'కూల' వర్గ బీజేపీ నేతలు మాత్రం పొత్తు పెట్టుకోవాలని అశిస్తున్నారు. కానీ కేంద్ర బీజేపీకి బాగా తెలుసు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఇంకా టీడీపీలో లోకేష్, బాబు తప్పా ఎవరూ మిగలరు అని అందుకే బహుశ టీడీపీ గురించి కేంద్ర బీజేపీ నేతలు పట్టించుకోవడం మానేసినట్లు కనపడుతుంది.
చంద్రబాబుకు శత్రువులు ఎక్కడ లేరు కొడుకు రూపంలో లోకేష్, మీడియా రూపంలో ఎల్లో మీడియా చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలను సాగనీయకుండా చెస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడల్లో అరితేరినా నాయకుడు.. సొంత మామ నుండి పార్టీ లాక్కోని మామ ఫోటోనే పెట్టుకోని ఓట్లు అడేగే సత్తా ఉన్న చంద్రబాబు పొత్తుల కోసం ఇంతగా దిగజారడనికి కారణం ఎల్లో మీడియానే అనేది నగ్న సత్యం. ఇప్పటికి అయిన చంద్రబాబు ఎల్లో మీడియా ట్రాప్ లో పడకుండా సొంతగా అలోచిస్తే మంచిది, లేకపోతే వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ ముసుకోవాల్సి వస్తోంది.