టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా వైపే చూస్తున్నారు. అచ్చొచ్చిన ఉత్తరాంధ్రా జిల్లాలని పట్టుకుని సైకిల్ గేర్ మార్చాలనుకుంటున్నారు.
బాదుడే బాదుడు ప్రోగ్రాం ని శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసిన చంద్రబాబు లేటెస్టుగా జిల్లాల టూర్లకు కూడా ఉత్తరాంధ్రాయే బెటర్ అని పక్కాగా లెక్కేశారు.
అందుకే ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలలో పర్యటిస్తున్నారు. 15న అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో నిర్వహించే అనకాపల్లి జిల్లా మహానాడులో పాల్గొంటారు. ఇక 16న అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తారు. 17న విజయనగరం జిల్లాలో టూర్ చేస్తారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు మరోసారి ఉత్తరాంధ్రానే నమ్ముకోవడం వెనక బలమైన సెంటిమెంట్ కార్డ్ ఉందని అంటున్నారు. గతంలో ఈ జిల్లాల నుంచే అత్యధిక సీట్లు టీడీపీకి రావడంతోనే బాబు సీఎం అయ్యారు.
మరి ఈసారి ఆ మ్యాజిక్ రిపీట్ కావాలని బాబు గట్టిగా తలపోస్తున్నారు. అందుకే విజయం కోసం విశాఖ వైపు చూడు అంటున్నారు. మరి అది వర్కౌట్ అయ్యే పనేనా…