‘తల’ తప్పు చేస్తే.. ‘తోక’పై కోపమా!

తప్పు ప్రభాకర రెడ్డి చేస్తే.. ఆయనను పల్లెత్తు మాట అనలేని, ఫోనులోనైనా మందలించలేని చంద్రబాబునాయుడు, అస్మిత్ రెడ్డి మీద కోప్పడితే ఏం వస్తుందని, ఏం ఒరుగుతుందని..

చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ మీద పట్టు కోల్పోయి ఎంతో కాలం అయింది. పార్టీ ఈ దఫా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది గానీ.. లేకపోతే.. ఆ పార్టీ ఈపాటికి కకావికలు అయిపోయి ఉండేది. ఆయన చేతిలో అధికారం ఉన్నది గనుక.. ఆయన పట్ల గౌరవంగానీ, భయంగానీ లేని నాయకులందరూ కూడా ప్రస్తుతానికి కిమ్మనకుండా గడుపుతున్నారు. అయితే.. ఆయన చెప్పే మాటలను మాత్రం వారు అస్సలు పట్టించుకోవడంలేదు. బేఖాతరు చేస్తున్నారు.

‘మేం చేసేది మేం చేస్తాం.. నీ మాటతో మాకు లెక్కలేదు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో’ అన్నట్టుగానే పలువురు నాయకులు వ్యవహరిస్తూ ఉండడం విశేషం. చంద్రబాబునాయుడు కూడా అరాచకంగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉండడాన్ని గమనించాలి.

తాజా ఉదాహరణను గమనిస్తే.. ఆర్టీపీపీ వెట్ యాష్ కు సంబంధించి.. కూటమి పార్టీ నాయకుల మధ్య దందాలను పంచుకోవడంలో తగాదా వచ్చింది. ఆర్టీపీపీ వృథాగా బయట పారబోసే వెట్ యాష్ ద్వారా రోజుకు రెండు లక్షల రూపాయల దందా నడుస్తుందనేది ఒక అంచనా.

ఆర్టీపీపీ అనేది తమ జిల్లాలో ఉన్నది గనుక.. ఈ దందా మొత్తం తమ సొంతం కావాలని, తామే లాభం పొందాలని జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తెలుగుదేశం నాయకుడు భూపేష్ రెడ్డి తదితరుల కోరిక. అయితే ఇది నయాపైసా పెట్టుబడి లేకుండా ప్రతిరోజూ లక్షలు దండుకునే వ్యవహారం కాబట్టి తాడిపత్రి డాన్ జేసీ ప్రభాకర రెడ్డికి కూడా దీని మీద కన్నుంది. ఈ వ్యవహారం కూటమి పార్టీ నేతల మధ్య తీవ్ర వివాదంగా మారింది.

చంద్రబాబునాయుడు స్వయంగా పంచాయతీకి పూనుకుంటే జేసీ ప్రభాకరరెడ్డి పట్టించుకోలేదు. నాకు జ్వరంగా ఉంది నేను రాను అంటూ కబురు పంపాడు. ఇది ఖచ్చితంగా బాబును బేఖాతరు చేయడమే అని పార్టీలో అందరూ గుర్తిస్తున్నారు. పైగా లిక్కరు దందాలు, ఇసుక దందాలు వద్దు అని చంద్రబాబు చెబుతుండగా.. లిక్కరు వ్యాపారాల్లో తనకు లాభాల్లో పాతిక శాతం, పెట్టుబడితో పాతికశాతం వాటా ఇవ్వకపోతే.. ఎవ్వరినీ దుకాణాలు నడపనివ్వనని బాహాటంగా వీడియోల సాక్ష్యంగా ప్రకటించిన నేత జేసీ ప్రభాకరరెడ్డి. చంద్రబాబునాయుడుకు కనీసం మందలించడానికి కూడా ధైర్యం చాల్లేదు.

తీరా ఇప్పుడు వెట్ యాష్ వివాదంలో.. జేసీ దూకుడు ప్రదర్శిస్తూంటే.. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు, అక్కడ స్వాగతం చెప్పడానికి వచ్చిన అస్మిత్ రెడ్డి మీద ఆగ్రహం ప్రదర్శించారట. తల పగ తోక చుట్టురికం అని ఒక సామెత ఉంటుంది. అసలు వాళ్లతో వైరం పెట్టుకుని కొసరు వాళ్లమీద ప్రేమ చూపించడాన్ని ఇలా అంటారు.

అదే తరహాలో.. తప్పు ప్రభాకర రెడ్డి చేస్తే.. ఆయనను పల్లెత్తు మాట అనలేని, ఫోనులోనైనా మందలించలేని చంద్రబాబునాయుడు, అస్మిత్ రెడ్డి మీద కోప్పడితే ఏం వస్తుందని, ఏం ఒరుగుతుందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

4 Replies to “‘తల’ తప్పు చేస్తే.. ‘తోక’పై కోపమా!”

  1. షర్మిల పార్టీ వదిలి వెళ్ళిపోతే.. తల్లి ఇజయమ్మ కి రంకు గట్టినప్పుడు..

    తోక తప్పు చేస్తే.. తల పై కోపమా అంటూ ప్రశ్నించలేదే ..

    ..

    షర్మిల జగన్ రెడ్డి రాజకోట రహస్యాలన్నీ బయట పెట్టేస్తుంటే.. తల్లి కారు టైర్లు పేల్చి చంపేయాలని చూసినప్పుడు..

    తోక ఎదురు తిరిగితే.. తల్లి ప్రాణం తీయడం భావ్యమా అని ప్రశ్నించలేదే ..

  2. పోనులోనైనా మందలించలేని చంద్రబాబు…….CBN ఫోన్ సంభాషన నీకు వినపడుతుందా……?

Comments are closed.