మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీకి సీఐడీ నోటీసులు

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు సోమేశ్‌కుమార్‌పై పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. Advertisement వ‌స్తువులు…

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు సోమేశ్‌కుమార్‌పై పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

వ‌స్తువులు స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోయినా, చేసిన‌ట్టు బోగ‌స్ ఇన్వాయిస్‌లు సృష్టించిన‌ట్టు సోమేశ్‌తో పాటు మ‌రికొంద‌రిని గుర్తించారు. న‌కిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసిన‌ట్టు వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ గుర్తించింది. త‌న శాఖ‌లో అవినీతిపై వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ ర‌వి ఫిర్యాదు మేర‌కు తెలంగాణ సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్‌) ఎగ‌వేత ద్వారా భారీ అవినీతి జ‌రిగింద‌ని తెలంగాణ క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ శాఖ పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో సీఐడీ అధికారులు సోమేశ్‌కుమార్‌తో పాటు తెలంగాణ వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వ‌ర‌రావు, ఏ2గా ఉప క‌మిష‌న‌ర్ శివ‌రామ్‌ప్ర‌సాద్‌, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెస‌ర్ శోభ‌న్‌బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాల‌జీస్ కంపెనీ వున్నాయి.

రేవంత్‌రెడ్డి స‌ర్కార్ మాజీ సీఎస్‌పై కోపంగా ఉన్న నేప‌థ్యంలో విచార‌ణ ఎలా వుంటుందో ఊహించుకోవ‌చ్చు. సోమేశ్‌కుమార్ వీఆర్ఎస్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా సోమేశ్‌ను జైలుకు పంపాల‌ని రేవంత్ ప‌ట్టుద‌ల‌తో వుంది.

6 Replies to “మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీకి సీఐడీ నోటీసులు”

  1. ఇతను ము*క్కు దొర కి ప్యా*లస్ పులకేశి కి కామన్ చెం*చా బి*నామీ అని రెండు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల ము*డ్డి నాకే ఐఏ*ఎస్ లో మొదటి వారు అని బాగా ప్రచారం వింది.

Comments are closed.