ఏపీ సిఐడి పోలీసులు పనిగట్టిని మరీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటికి మరోసారి వచ్చారు. ఇది రాజకీయంగా చూస్తే సంచలన పరిణామంగానే ఉంది. సిఐడి అధికారులు ఇప్పటికి పలుమార్లు అయ్యన్న ఇంటికి రావడం అది ఏపీలోనే అతి పెద్ద రాజకీయ రచ్చగా మారడం తెలిసిందే.
ఒకసారి తెల్లవారుజామను గోడ దూకి తన ఇంటికి సిఐడి పోలీసులు వచ్చారని అయ్యన్న అప్పట్లో విమర్శలు కూడా చేశారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు విజయ్ పాత్రుడి మీద కూడా సిఐడి అధికారులు గతంలో పలు కేసులు పెట్టారని అంటున్నారు. ఈ నేపధ్యంలో తండ్రీ కొడుకులలో ఎవరిని ఈసారి టార్గెట్ చేశారు అన్నదే తమ్ముళ్లకు అర్ధం కావడం లేదుట.
ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడు ఇంటికి సిఐడి పోలీసులు రావడంతో మరోసారి నర్సీపట్నంలో రాజకీయ వేడి మొదలైంది. అయితే ఈసారి అయ్యన్న ఇంట్లోనే ఉన్నారు. వచ్చిన సిఐడి పోలీసులతో ఆయన మాట్లాడారు కూడా.
ఆయన కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద లేకపోవడంతో అయ్యన్నపాత్రుని కలిసి మాట్లాడుతున్నారని అంటున్నారు. అంటే విజయ్ కేసు విషయంలోనే సిఐడి పోలీసులు వచ్చారా అన్న డౌట్లు వస్తున్నాయి.