Advertisement

Advertisement


Home > Politics - National

ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ.. ప్రజల్లో డైలమా!

ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ.. ప్రజల్లో డైలమా!

దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఇన్ ఫ్లూయెంజ కేసులున్నాయి. రెండు వైరస్ ల లక్షణాలు దాదాపు ఒక్కటే. దీంతో ఏది కరోనా, ఏది ఇన్ ఫ్లూయెంజ అనే డైలమాలో ప్రజలు పడిపోతున్నారు. వైరస్ ఏదైనా, ట్రీట్ మెంట్ ఒకటే కావడంతో, వైద్యులు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయకుండానే ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

కానీ అసలైన తేడా మందుల్లో ఉందని చెబుతోంది ఎయిమ్స్. కరోనా వైరస్ కు తప్పనిసరిగా యాంటీ బయాటిక్స్ వాడాల్సిందే. కానీ ఇన్ ఫ్లూయెంజ కేసులకు మాత్రం అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ వాడకూడదని ఎయిమ్స్ సూచిస్తోంది. ఇన్ ఫ్లూయెంజ కేసులకు అధిక మోతాదులో యాంటీ బయాటిక్స్ వాడితే.. అది ఒంట్లో సహజసిద్ధంగా ఉన్న రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని, తద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

సో.. ఇకనైనా ప్రాధమిక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకోవాలని ఎయిమ్స్ సూచిస్తోంది. సరిగ్గా ఇక్కడే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ ను హెచ్చరిస్తోంది.

తాజాగా కరోనా కేసులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించింది డబ్ల్యూహెచ్ఓ. భారతదేశంలో కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పడిపోయిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1590 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8600 దాటింది. ఎక్కువగా కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక నుంచి కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోసారి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..

సోకింది కరోనానా.. ఇన్ ఫ్లూయెంజ వైరస్సా అనే విషయాన్ని పక్కనపెట్టి.. బాధితులంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీంతో పాటు ప్రజలంతా మరోసారి కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది. భౌతిక దూరం పాటించకపోయినా, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం లాంటివి తిరిగి మొదలుపెట్టాలని సూచిస్తోంది.

మరోవైపు దేశంలో ఆస్పత్రుల సన్నద్ధతపై కూడా ఆరా తీస్తోంది కేంద్రం. మరోసారి వైరస్ పెచ్చుమీరితే వైద్యులు, ఆస్పత్రులు చేతులు ఎత్తేయకుండా ఉండేందుకు.. వచ్చేనెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాక్-డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యుల సన్నద్ధత, ఆక్సిజన్, మందుల లభ్యత, వైద్యసామగ్రిపై ఈ డ్రిల్ నిర్వహించనున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?