ష‌ర్మిల నాశ‌నం చేస్తోంది బాబోయ్‌!

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మ‌రింత స‌ర్వ‌నాశ‌నం చేసేలా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల ఏ విధంగా న‌ష్టం తీసుకొస్తున్నారో ఆ పార్టీ…

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మ‌రింత స‌ర్వ‌నాశ‌నం చేసేలా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిల ఏ విధంగా న‌ష్టం తీసుకొస్తున్నారో ఆ పార్టీ నాయ‌కులు కొంద‌రు అధిష్టానానికి తాజాగా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో వ్య‌క్తిగ‌త విభేదాల‌ను మ‌న‌సులో పెట్టుకుని రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఈ ప‌రిణామాలు పార్టీ శ్రేణుల‌కు వ్య‌తిరేక సంకేతాలు పంపుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది.

హ‌ర్యానా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎక్స్ వేదిక‌గా స్పందించార‌ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఈవీఎంల‌లో గోల్‌మాల్ చేయ‌డం వ‌ల్లే హ‌ర్యానాలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్న అభిప్రాయాన్ని జ‌గ‌న్ వ్య‌క్తం చేయ‌గా, దాన్ని ష‌ర్మిల త‌ప్పు ప‌ట్ట‌డం ఏంట‌ని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్‌తో విభేదాలుంటే ఇంట్లో చూసుకోవాలే త‌ప్ప‌, వాటిని కాంగ్రెస్‌కు ముడిపెట్టి న‌ష్టం చేయాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌కీయంగా జ‌గ‌న్ కాంగ్రెస్‌తో క‌లిసొస్తే ష‌ర్మిల‌కు న‌ష్టం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈవీఎంల‌పై జ‌గ‌న్ అభిప్రాయంతో ష‌ర్మిల మిన‌హా మిగిలిన ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఏకీభ‌విస్తున్నారు. మాజీ మంత్రి శైల‌జానాథ్ కూడా ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అనుమానం వ్య‌క్తం చేశారు. మ‌రీ ముఖ్యంగా ఫ‌లితాల్లో అసాధార‌ణ వ్య‌త్యాసం, అలాగే మూడు నెల‌ల త‌ర్వాత ఈసీ వెబ్‌సైట్‌లో ఫారం-20కి సంబంధించి వివ‌రాలు పెట్ట‌డాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇవ‌న్నీ అనుమానాల‌కు బ‌లం క‌లిగిస్తున్నాయ‌ని శైల‌జానాథ్ పేర్కొన్నారు.

తాజాగా ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ నిధుల విడుద‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ ష‌ర్మిల ట్వీట్ చేయ‌డాన్ని కాంగ్రెస్ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అనేక త‌ప్పులు చేయ‌డం వ‌ల్లే వైసీపీ ఓడిపోయింద‌ని, ఇక ఆ పార్టీని విమ‌ర్శించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంట‌ని కాంగ్రెస్ నేత‌లే ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు కాంగ్రెస్ పార్టీని ఏం చేయాల‌ని ష‌ర్మిల అనుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ష‌ర్మిల చేతిలో మ‌రికొంత కాలం కాంగ్రెస్ పార్టీ వుంటే, ఇక మ‌రిచిపోవ‌డం మంచిద‌ని ఆ పార్టీ నాయకులు అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది.

14 Replies to “ష‌ర్మిల నాశ‌నం చేస్తోంది బాబోయ్‌!”

  1. ఏంటి GA …. మన అన్నయ్య ను అక్రమం గా లోపల వేయించిన పార్టీ మీద సడెన్ గా ఇంత ప్రేమ….ఇంత ఆవేదన…😂😂😂

  2. “తాజాగా ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ నిధుల విడుద‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ ష‌ర్మిల ట్వీట్ చేయ‌డాన్ని కాంగ్రెస్ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు”

    పై వాక్యాన్ని చదివి ఎవ్వరూ GA ని తప్పుపట్టలేరు. హర్యానాలో గెలిచింది బీజేపీ అయినా ప్రభుత్వం మాత్రం వైసిపీస్ దే!

  3. నీచుడు జగన్ రెడ్డి కి వేరే దారి లేదు షర్మిల ఎన్ని తిట్టినా నీచుడు ఆ పార్టీ తో కలిసిన లేకున్నా చర్లపల్లి కి వెళ్లాల్సిందే

  4. బి గళూరు ప్యాలస్ లో రాహుల్ తో రహస్య సమావేశం జరిగిందా ఏమిటి?

    అందులో రాహు*ల్ కాళ్ళు మీద పడి బోరుమని ఏడ్చాడ ప్యాలస్ పులకేశి?

  5. వై చీపి పుట్టి ముంచితేన కదా కాంగ్రెస్ బలపడేది .. ఆ మాత్రం తెలియదా ముం డా నా కొ డ కా ..

Comments are closed.