నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే… ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన 90 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మరింత బాధ్యత పెరిగినట్టుగా ఆయన భావిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం ఆయన ప్రజాదర్భార్ చేపట్టారు. నిత్యం ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, వెంటనే పరిష్కారంపై చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ వాట్సప్‌కు సమస్యలతో కూడిన మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వాట్సప్ బ్లాక్ అయ్యింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని లోకేశ్ టీమ్ కనిపెట్టింది. లోకేశ్ పర్సనల్ మెయిల్ ఐడీని క్రియేట్ చేశారు.
ఇక మీదట [email protected]కి ప్రజానీకం తమ సమస్యల్ని పంపాలని లోకేశ్ సూచించారు. లోకేశ్ మాట్లాడుతూ సాయం కోసం వచ్చే వారి కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయన్నారు. మెయిల్‌కు వచ్చే సమస్యలన్నింటిని తానే స్వయంగా చూసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ తెలిపారు.
తనకు సమస్య పంపే వారు తమ పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీని, పూర్తి వివరాలతో పంపాలని లోకేశ్ కోరడం విశేషం. వాట్సప్ తరచూ బ్లాక్ అవుతుండడంతో మెసేజ్‌లు చూసే అవకాశం లేకపోవడంతో మెయిల్ ఐడీని ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.