వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన అధికారి సిట్‌లో స‌భ్యుడా?

వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఏ అధికారికైనా చంద్ర‌బాబు స‌ర్కార్‌లో పోస్టింగ్ ఇస్తే… జ‌గ‌న్‌తో అంట‌కాగిన అధికారికి ఎలా ఇచ్చార‌ని టీడీపీ అనుకూల మీడియా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసింది. అలాంటిది వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగి,…

వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఏ అధికారికైనా చంద్ర‌బాబు స‌ర్కార్‌లో పోస్టింగ్ ఇస్తే… జ‌గ‌న్‌తో అంట‌కాగిన అధికారికి ఎలా ఇచ్చార‌ని టీడీపీ అనుకూల మీడియా ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసింది. అలాంటిది వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగి, అది కూడా టీటీడీలో సీవీఎస్వోగా మూడేళ్ల పాటు కొండ‌పై కీల‌క విధుల్లో ఉన్న గోపినాథ్ జెట్టిని సిట్‌లో నియ‌మించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు బాబు స‌ర్కార్ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు స‌భ్యులుగా సిట్‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో గోపినాథ్ జెట్టి నియామ‌కంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ హ‌యాంలో గోపినాథ్ జెట్టి తిరుమ‌ల సీవీఎస్వోగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అంతేకాదు, ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ఈయ‌న స‌మీప బంధువు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణ‌య్య కీల‌క ప‌దవిలో ఉన్నారు. సిట్ సంస్థ వైసీపీ హ‌యాంలో ప‌ని చేసిన టీటీడీ ఈవోలు, బోర్డు చైర్మ‌న్ల‌కు నోటీసులు ఇచ్చి, విచార‌ణ చేప‌డుతుంద‌ని తెలుస్తోంది.

వైసీపీ హ‌యాంలో సీవీఎస్వోగా ప‌ని చేసిన గోపినాథ్ జెట్టి త‌న‌తో పాటు టీటీడీలో ప‌ని చేసిన వారిని విచారిస్తే, పారద‌ర్శ‌క‌త మాటేంటి? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. అలాగే నైతిక‌త అంశం కూడా తెర‌పైకి వ‌స్తోంది. ఏ ర‌కంగా చూసినా గోపినాథ్ జెట్టి నియామ‌కం స‌రైంది కాద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. త‌మ‌కు న‌చ్చిన వాడైతే చాలు… జ‌గ‌న్‌తో అంట‌కాగినా ఇబ్బంది లేద‌ని స‌రిపెట్టుకుంటే చేయ‌గ‌లిగేదేమీ లేదు. కానీ సిట్ విచార‌ణ నిష్పాక్షికంగా జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించాలంటే… గోపినాథ్ జెట్టి లాంటి వాళ్ల‌ను సిట్ నుంచి త‌ప్పించ‌డం మంచిద‌నే అభిప్రాయాన్ని బాబు స‌ర్కార్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

8 Replies to “వైసీపీ ప్ర‌భుత్వంతో అంట‌కాగిన అధికారి సిట్‌లో స‌భ్యుడా?”

  1. “ఎన్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై as A1 ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.”

    Good news

  2. నీలో ఈ యాంగిల్ కూడా వుందా? శభాష్. సిట్ ని అతను నీరుగార్చగలడు అనుకుంటే తీసెయ్యాలి.

Comments are closed.