కొలికిపూడిని అడ్డుకునే ద‌మ్ము టీడీపీ పెద్ద‌ల‌కు వుందా?

కొలిక‌పూడిని ఏమీ చేయ‌లేక‌, అలాగ‌ని పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంటే చూస్తూ వుండ‌లేక‌, ఆ పార్టీ పెద్ద‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు.

టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీ‌నివాస్ కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యారు. కొలికిపూడి తీరుపై ఇప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గ మండ‌ల‌, గ్రామ నాయ‌కులు, టీడీపీ అనుకూల మీడియా ప్ర‌తినిధులు సీఎం చంద్ర‌బాబునాయుడితో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుకు ఫిర్యాదు చేశారు. కొలిక‌పూడిపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు కూడా వుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే త‌న‌పై వ‌స్తున్న తీవ్ర ఆరోప‌ణ‌ల్ని కొలిక‌పూడి ఏ మాత్రం ఖాత‌రం చేయ‌డం లేదు. ఏం చేస్తారో చూద్దాం అనే లెక్క‌లేనిత‌నంతో ఆయ‌న మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌న‌పై సొంత పార్టీలోనే కుట్ర జ‌రుగుతున్న‌ట్టు కొలిక‌పూడి అనుమానిస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఆయ‌న పెట్టిన రెండు పోస్టులు టీడీపీ పెద్ద‌ల‌కు స‌వాల్‌గా నిలిచాయి.

“అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ద‌ల‌య్యే ముందు… భ‌యంక‌ర‌మైన ప్ర‌శాంతంగా వుంటుంది”. “సెప్టెంబ‌ర్ 30 సాయంత్రం నాలుగు గంట‌ల‌కు వినాయ‌కుడి గుడి నుంచి రాజుపేట వ‌ర‌కు సేవ్ తిరువూరు ర్యాలీ”

ఈ రెండు పోస్టులు కూడా త‌మ గురించే అని తిరువూరు టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అనుకుంటున్నారు. సొంత పార్టీ వారి గురించి మ‌న‌సులో రుగుతున్న‌ కోపాగ్ని …అగ్ని ప‌ర్వ‌తంలా ఉంద‌ని కొలిక‌పూడి పేర్కొన్నారు. బ‌ద్ద‌ల‌య్యే ముందు భ‌యంక‌ర‌మైన ప్ర‌శాంతంగా వుంద‌ని చెప్ప‌డం అంటే… తాను ప్ర‌శాంతంగా వుండ‌డం గురించి సంకేతాలు ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అలాగే తాజాగా తిరువూరును ర‌క్షించాలంటూ ర్యాలీ నిర్వ‌హిస్తాన‌ని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారాయ‌న‌. అధికారాన్ని అడ్డు పెట్టుకుని త‌న పార్టీకి చెందిన కొంద‌రు నాయ‌కులు గ్రావెల్‌, ఎర్ర‌మ‌ట్టి, ఇసుక దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని, అలాగే జూదం లాంటి అసాంఘిక కార్య‌కలాపాల‌కు తెర‌లేపార‌ని, వారి నుంచి తిరువూరును కాపాడాల‌నేది కొలిక‌పూడి భావ‌న‌గా ఆ నియోజ‌క వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ అరాచ‌కాల నుంచి తిరువూరును కాపాడాల‌నేది ఆయ‌న ప‌రోక్ష నినాద‌మ‌ని సొంత పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

టీడీపీ అధిష్టానానికి కొలిక‌పూడి స‌వాల్ విసురుతున్నారు. కొలిక‌పూడిని ఏమీ చేయ‌లేక‌, అలాగ‌ని పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంటే చూస్తూ వుండ‌లేక‌, ఆ పార్టీ పెద్ద‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. కొలికిపూడిని అడ్డుకునే ద‌మ్ము వుందా అని పార్టీ పెద్ద‌ల్ని తిరువూరు టీడీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తుండ‌డం… ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీలో చోటు చేసుకున్న విభేదాల‌కు ప‌రాకాష్ట‌గా చెప్పొచ్చు.

9 Replies to “కొలికిపూడిని అడ్డుకునే ద‌మ్ము టీడీపీ పెద్ద‌ల‌కు వుందా?”

  1. “తెదేపా అధిష్ఠానం ఆదేశాలతో సోమవారం సాయంత్రం 4గంటలకు చేపట్టిన ‘సేవ్‌ తిరువూరు’ ర్యాలీ విరమించుకున్నట్టు ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.”

    ప్రొద్దున ఏదో అగ్ని పర్వతం బద్దలవుతుంది అని వ్రాసావు…ఇప్పుడేమిటి? తుస్సుమన్నదా?

  2. ఇతనిలో నాకు నచ్చింది ఎప్పుడు తలపాగా ధరించడం. ఇంట్లో వున్నప్పుడు నేను కూడా సరదాగా ధరిస్తా. అలా రెగ్యులర్ గ ధరిస్తే డెమెన్షియా రాదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

    1. The problem with him is that he lacks experience and he wish to implement theoretical ideas . It is not his job to control sand etc etc and talk about it in public as that job is to be done by officers. Looks like,he is over excited by his unexpected win which spurred his unrealistic ambitions. His personality also shaped up due to too many hours spent at ABN/ TV 5 for useless talks . His acts of chappal to Vishnu and warning to RGV were aimed at seducing TDP management to which the desperate TDP succumbed

      1. I don’t know much about this chalo tiruvuru call. He got an opportunity, he shall use it properly rather than high handedness. I think this is the second incident in 100 days.

Comments are closed.