ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్యే ఎన్నిక‌ల బ‌రిలో వైసీపీ!

వ‌చ్చే ఏడాది మార్చిలో ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యానికి కూట‌మి స‌ర్కార్ దాదాపు 9 నెలల పాల‌న పూర్తి చేసుకుంటుంది.…

వ‌చ్చే ఏడాది మార్చిలో ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యానికి కూట‌మి స‌ర్కార్ దాదాపు 9 నెలల పాల‌న పూర్తి చేసుకుంటుంది. కూట‌మి పాల‌న‌పై జ‌నంలో ఒక అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి ఇదేమీ పెద్ద స‌మ‌యం కాక‌పోయినా, చిన్న పరీక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది. కూట‌మిపై జ‌నంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని వైసీపీ విమ‌ర్శ‌ల్లో నిజ‌మెంతో తెలుసుకోడానికి ఈ ఎన్నిక‌లు కొద్ది మేర‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు విద్యావంతుల‌కు సంబంధించిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి నేత‌లు ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ కూట‌మి అభ్య‌ర్థిగా ఆల‌పాటి రాజా పేరును దాదాపు ఖ‌రారు చేశారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల రీత్యా ఆల‌పాటి గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. పైగా చేతిలో అధికారం ఉంది. దీంతో గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని కూట‌మి నేత‌లు చెబుతున్నారు.

మ‌రోవైపు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల అభ్య‌ర్థిని కూడా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను చూసుకుని ఖ‌రారు చేసే ప‌నిలో కూట‌మి నిమ‌గ్న‌మైంది. ఈ రెండు చోట్ల వైసీపీ పోటీ చేస్తుందా? లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక‌వేళ బ‌రిలో వుండాల‌ని అనుకుంటే ఇప్ప‌టి నుంచే ఆ ప‌నిలో ఉండాలి. ప్రస్తుతానికైతే వైసీపీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ఎలాంటి క‌స‌ర‌త్తు చేస్తున్న దాఖ‌లాలు లేవు.

వైసీపీ త‌ప్ప‌కుండా బ‌రిలో వుంటుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే అభ్య‌ర్థులెవ‌ర‌నేది త్వ‌ర‌లో తేలుతుంద‌ని చెబుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఎలాంటి హామీలు అమ‌లు చేయ‌ని నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వుంద‌ని, ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో అది ప్ర‌తిబింబిస్తుంద‌ని, త‌ప్ప‌కుండా పోటీ చేయాలనే ప‌ట్టుద‌ల‌తో ఎన్నిక‌లు జ‌రిగే జిల్లాల వైసీపీ నాయ‌కులు వుండ‌డం విశేషం.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట్ల‌పై ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న ఇచ్చిన నేప‌థ్యంలో, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా త‌మ నాయ‌కుల‌తో చ‌ర్చించే అవ‌కాశం వుంది.

12 Replies to “ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్యే ఎన్నిక‌ల బ‌రిలో వైసీపీ!”

    1. ఆనాడే సజ్జల గారు చెప్పారు కదా పట్టభద్రుల ఓటర్లు మావారు కాదని మా ఓటర్లు ప్రత్యేకంగా ఉన్నారని

  1. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కడప, అనంత పురం, లల్లో వైసీపీ అభ్యర్థులను పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకోలేక పోయారు ఇపుడు కోస్తా , గోదావరి జిల్లాల్లో ఏంటి పీకేది 😂

  2. నిస్సందేహం గ వైసీపీ భారీ తేడాతో ఓడిపోవటం ఖాయం జగన్ గారి పేరు చెపితే ఇక కోస్తాలో ఓట్లు రావు అయన అరాచక పాలన చూసాక చదువుకున్నాడు ఎవడు వెయ్యడు మొత్తం రెడ్లను నెత్తిమీద పెట్టుకోవటానికి ఎవడు వేస్తాడు వైసీపీ పోటీచేసి వాళ్ళ స్థానం ఏమిటో తెలుసుకోవడం చాల ముఖ్యం అనుమానం ఉన్న వాళ్ళకి అనుమానం పోయి వేరే పార్టీలలోకి జంప్ అయిపోతారు

Comments are closed.