ప్రభాస్ పై అప్పుడలా.. ఇప్పుడిలా

ప్రభాస్ స్థాయి ఏంటి, అతడి స్టామినా ఏంటనే విషయం అందరికీ తెలిసిందే.

“నాకు చాలా బాధగా ఉంది. అతడు సినిమాలో ఎందుకు జోకర్ లా కనిపించాడు. నేను మ్యాడ్ మ్యాక్స్ చూడాలనుకున్నాను. ఓ మెల్ గిబ్సన్ ను ఊహించుకున్నాను. అతడ్ని ఎందుకు అలా తయారుచేశారు. ప్రభాస్ ను ఎందుకలా చేశారో నాకు అర్థం కాలేదు.”

సరిగ్గా నెల రోజుల కిందట బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ప్రభాస్ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలివి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రభాస్ కు మద్దతుగా నాని లాంటి చాలామంది హీరోలు అర్షద్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పెద్ద యుద్ధమే చేశారు.

ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై మరోసారి స్పందించాడు అర్షద్ వార్సి. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, తను ప్రభాస్ ను బాడీ షేమింగ్ చేయలేదని, కేవలం అతడు పోషించిన పాత్రను విమర్శించానని చెప్పుకొచ్చాడు.

“ప్రభాస్ అద్భుతమైన నటుడు. తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలు ఆయన పోషించిన పాత్రను ఉద్దేశించినవే తప్ప, ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు.”

ప్రభాస్ స్థాయి ఏంటి, అతడి స్టామినా ఏంటనే విషయం అందరికీ తెలిసిందే. ఏ బాలీవుడ్ హీరోకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. అలాంటి హీరోపై కొంతమంది విమర్శలు చేయడం సహజం. అందులో అర్షద్ ఒకడు.

4 Replies to “ప్రభాస్ పై అప్పుడలా.. ఇప్పుడిలా”

Comments are closed.