హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ముగిసిన అధ్యాయం. అయితే ప్రజా సమస్యలపై మాట్లాడ్తారనే పేరున్న కమ్యూనిస్టులు మాత్రం మాధవ్ అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. చివరికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఊరుకున్నా, ఆ పార్టీ ఆదేశానుసారం నడుచుకునే సీపీఐ నాయకులు మాత్రం మరే సమస్య లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఛీప్ పబ్లిసిటీ కోసమే సీపీఐ నేతలు దిగజారి మాట్లాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
మాధవ్ వ్యవహరించిన తీరును ఏ ఒక్కరూ సమర్థించరు. అయితే ఫేక్ వీడియో అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఇక దాని గురించి మాట్లాడ్డం అంటే సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇవేవీ సీపీఐ నాయకులకు పట్టింపులేనట్టుంది.
తిరుపతిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మాధవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూపురం ఎంపీ పావలా ఖర్చులేకుండా బ్లూ ఫిల్మ్ తీసిచ్చాడన్నారు. దేవర దున్నపోతులా తయారైన దిగంబర ఎంపీని బట్టలు విప్పి తిరగమని కమ్మ, కాపులు చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు.
మాధవ్ పావలా ఖర్చు లేకుండా బ్లూఫిల్మ్ తీయడం సంగతేమో గానీ, పైసా ఖర్చు కూడా చూశానన్న ఆనందం రామకృష్ణ మాటల్లో కనిపిస్తోంది. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడితే ఉపయోగం వుంటుంది. న్యూడ్ బురదలో వైసీపీ, టీడీపీ పొర్లాడుతున్నాయి. తామెక్కడ వెనుకపడి పోతామో అన్న భయం రామకృష్ణలో కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కమ్యూనిజం అంటే ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతమని గొప్పగా చెబుతారు. దాన్ని ఒంటబట్టించుకుని వుంటే మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారాలపై మిగిలిన పార్టీల్లా కమ్యూనిస్టులు మాట్లాడరు. పేదల పార్టీ అనే విషయాన్ని రామకృష్ణ మరిచినట్టున్నారు. ఎందుకా చిల్లర గొడవలో తలదూర్చి టైం వేస్ట్ చేసుకుంటారనే ప్రశ్న.