తప్పు చేసి కొవ్వొత్తులు కాదు ..దివిటీలే పట్టుకొస్తారు…!

తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు అవినీతికి పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే వదలరని…

తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్ష తప్పదని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు అవినీతికి పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే వదలరని సెటైర్లు వేశారు. అదే చేయాలంటే కొవ్వొత్తులు కాదు, దివిటీలే పట్టుకుని జనాలు రేపు బయలుదేరుతారని ఆయన కామెంట్స్ చేశారు.

చంద్రబాబు అవినీతి చేయలేదని అంటున్నారని అయితే  చంద్రబాబు ప్ర‌జాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయని ఇదే విష‌యం కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృవీకరించాయని, ఈడీ, ఐటీ, దర్యాప్తులో కూడా నిజం అని తేలిందన్నారు ధర్మాన. అలానే జ‌ర్మ‌న్ కంపెనీ సీమన్స్ కూడా మాకు ఆ అగ్రిమెంట్ కూ సంబంధం లేద‌న తేల్చి చెప్పిందన్నారు.  

కానీ ఆ సీమెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలకు డ‌బ్బులు అన్నీ  వెళ్ళాయని తేలింది. ఆ డబ్బు చంద్రబాబు,లోకేశ్ పీఏల‌కు వెళ్ళింది అని తేలిందని మంత్రి సీరియస్ ఆరోపణలు చేశారు.బాబు చినబాబు పీఏలు ఇద్దరూ ఇద్దరూ దేశం దాటి వెళ్లిపోయారు. అలా వ్యూహాత్మకంగా డబ్బులు తప్పు దారి పట్టాయని అన్నారు. ఇంతకీ చంద్రబాబు దోషి అవునా,కాదా అన్న‌ది కోర్టు పరిధిలో ఉంటుందని, ఇప్పటికైతే ఆయన నిందితుడని ధర్మాన స్పష్టం చేశారు.

ఈ దేశాన్ని ఏలైన మాజీ ప్రధానులు  ఇందిరాగాంధీకీ,పి.వి.న‌ర‌సింహారావుకూ అలాగే పక్క రాష్ట్రానికి చెందిన జయలలితకైనా లాలూ ప్రసాద్ యాదవ్ కైనా అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుందని ధర్మాన అంటున్నారు. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో చ‌ట్టం ముంద‌ర అంద‌రూ  సమానమేనని ధర్మాన స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కువ కాదని ఆయన అన్నారు. చట్టప్రకారం తన నిజాయతీని నిరూపించుకోవల్సిన చోట నిరసనలు చేస్తే లాభమేంటి అని ప్రశ్నించారు.