విశాఖ రాజధాని విషయంలో ధర్మాన బాంబు లాంటి వార్త..?

విశాఖ రాజధాని కావాలని 2014 తరువాత అంతా అనుకున్నారు. దానికి పెద్దగా లాజిక్ కూడా అవసరం లేదు. ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం విశాఖ. అంతే కాదు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు…

విశాఖ రాజధాని కావాలని 2014 తరువాత అంతా అనుకున్నారు. దానికి పెద్దగా లాజిక్ కూడా అవసరం లేదు. ఏపీలో ఉన్న అతి పెద్ద నగరం విశాఖ. అంతే కాదు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కర్నూల్ నుంచి విశాఖకు రాజధాని షిఫ్ట్ కావాలని ఆనాడే అనుకున్నారు

ఉమ్మడి ఏపీ లేకపోతే ఎప్పుడో విశాఖనే రాజధానిగా ఉండేది. అలాంటిది విభజన తరువాత మెగా సిటీ విశాఖ కాక మరేమి ఉంటుంది అని తెలంగాణా ఉద్యమకారులు కూడా సలహా ఇస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు తొలి సీఎం గా అమరావతి అంటూ కొత్త సృష్టి మొదలెట్టారు.

దీని మీద చాలా చర్చలు కూడా జరిగాయి. వైసీపీకి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే విశాఖ రాజధాని అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినా కూడా చంద్రబాబు వినకుండా అమరావతిలో రాజధాని పెట్టారని అంటూ ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. ఆయన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎచ్చెర్లలో మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

అంటే కేంద్రంలోని వారికి కూడా విశాఖ రాజధాని అయితే బాగుండు అన్న భావన ఉందా అన్నది ధర్మాన మాటల ద్వారా అర్ధం అవుతోంది. చంద్రబాబు అమరావతినే ఎందుకు ఎంచుకున్నారు అంటే వైసీపీ నేతలు చేసే విమర్శలు రియల్ ఎస్టేట్ కోసం అని అంటారు.

ఏ విధంగా చూసినా విశాఖ అన్యాయం అయిపోయింది అన్నది ధర్మాన సహా సీనియర్ నేతలు వైసీపీ నాయకుల వాదన. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరిచేస్తామని అంటున్నా కూడా ఈ రోజుకీ విశాఖ సహా ఉత్తరాంధ్రా మీద టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని అంటున్నారు.