మహా కవి శ్రీశ్రీ అనేక గేయాలు రాశారు. ఆయన మహాప్రస్థానం ఆధునిక భారతానికి ఒక భగవద్గీత లాంటిది. కార్మికులే క్రిష్ణులు కష్టపడేవారే అర్జునులు. వారితోనే దారిద్ర నిర్జనం సాధ్యపడుతుందని మహాకవి తలపోశాడు. అందుకే వారికి ఏడవవద్దు నేనున్నాను అని ఓదార్చాడు. మహాకవి శ్రీశ్రీ రాసిన పతితులు భ్రష్టులు బాధా సర్ప ద్రష్టులు వర్తమానంలోనూ ఉన్నారు. వారినే రాజకీయ పరిభాషలో బడుగులు పేదలు అంటారు మరి అలాంటి బడుతులు పేదలకు ఏ ప్రభుత్వం సంక్షేమం పేరిట సాయం చేసినా మెచ్చుకోవాల్సిందే.
అందునా పేదల కోసమే మేము అని గట్టిగా చెప్పే నాయకులు ఇంకా ఉదారంగా ముందుకు రావాలి. కానీ లక్షల పుస్తకాలు చదివాను అంటున్న పవన్ కళ్యాణ్ కి పతితులు భ్రష్టులు అంటే అర్ధం తెలియదా తాము వారి కోసం అమలు చేస్తున్న పధకాలు ఆయన దృష్టిలోకి రాలేదా అని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సెటైర్లు వేశారు.
ఉద్ధానం పవన్ వెళ్ళి చూస్తే తమ ప్రభుత్వం అక్కడ శాశ్వత పరిష్కారం కోసం కార్యక్రమాలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. దానికైనా ఆయన బాగా చేశారు అని అనలేకపోతుననరే అని విసుర్లు విసిరారు. ఏం పిల్లో ఎల్దామొస్తవా అంటూ శ్రీకాకుళం కవి వంగపండు ప్రసాదరావు అట్టడుగు వర్గాలను చైతన్యపరచింది సంక్షేమం కోసమేనని ఆయన అన్నారు.
వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఒక్క మంచి పని అయినా జనసేనానికి కనిపించకపోవడం విడ్డూరం అన్నారు. మహా నాయకులు కవులను తలచుకోవడం కాదు వారి స్పూర్తిని కూడా తమలో నింపుకుంటే బాగుంటుంది అని ఆయన పవన్ కి చురకలు అంటించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ కి వైసీపీ అంటే ద్వేషం ఉండొచ్చు కానీ పేదలకు అందే పధకాల మీద కాదు కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నో పుస్తకాలు చిదివిన పవన్ పతితులు భ్రష్టుల విషయంలో మేలు చేసే వైసీపీని విమర్శితున్నారు అని అంటున్న మంత్రి గారికి ఆయన జవాబు ఏమని ఇస్తారో చూడాలి.