ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం విశాఖ చూట్టునే తిరుగుతోంది. ఒక వైపు టీడీపీ, జనసేన పార్టీలు అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా కొనసాగలాని యాత్రలు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం మూడు ప్రాంతాల అభివృధి అజెండాను ఎంచుకున్నాయి. అమరావతి యాత్ర ఉత్తరాంధ్ర వైపు వస్తుండంతో ఉత్తరాంధ్ర మేధావులు ప్రజలు కలిసి.. విశాఖ ఎక్స్ క్యూటివ్ రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడంతో టీడీపీ దిక్కు తెలియడం లేదు.
విశాఖ రాజధానిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడుపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఫైరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసే పనులు ఇప్పటికైనా అపాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారని, విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో నష్టపోయారని ఇప్పటికైనా చంద్రబాబు మారి ఉత్తరాంధ్రకు మంచి చేయాలన్నారు.
ఒక్కచోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబడతాయని, ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడుతాయని అలాంటివి ఉండకూడదు అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అమరావతి ఒక్కటే అభివృద్ధి చేందాలనుకోవడం అవివేకం అని, అమరావతిలో ఒక వర్గం వారు మాత్రమే నివాసించాడానికి ఆవకాశం ఉందని ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందడానికి ఆవకాశం ఇవ్వాలన్నారు.
అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందలానే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు అమరావతి ప్రాంతం అయిన మంగళగిరిలో స్వయాన చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఓడిపోయారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు.