చంద్రబాబుకు ఆత్మసాక్షి ఉందా?

తాము ప్రతిపక్షంలో ఉన్నాము గనుక.. ఏ సభ పెట్టినా, పాలిస్తున్న వారిని ఎడాపెడా తిట్టిపోయాలి. నిందించాలి. తూర్పారపట్టాలి. వారి మీద బురద చల్లాలి. వారు చేస్తున్న ప్రతి పనీ.. తప్పే అని అభివర్ణించాలి. ఇదే…

తాము ప్రతిపక్షంలో ఉన్నాము గనుక.. ఏ సభ పెట్టినా, పాలిస్తున్న వారిని ఎడాపెడా తిట్టిపోయాలి. నిందించాలి. తూర్పారపట్టాలి. వారి మీద బురద చల్లాలి. వారు చేస్తున్న ప్రతి పనీ.. తప్పే అని అభివర్ణించాలి. ఇదే నవతరం రాజకీయం. ఇందులో విమర్శించే వారికి మంచీ చెడూ అక్కర్లేదు. తమ మాటల్లో నిజాయితీ ఉండాలనే పట్టింపు కూడా లేదు. అడ్డగోలుగా విమర్శలు చేస్తే ప్రజలు నవరంద్రాలతో నవ్వుతారనే జ్ఞానం కూడా వారికి ఉండదు.

ప్రతిపక్షం ప్రభుత్వం మీద దాడి చే స్తూ ఉండాలనే సిద్ధాంతం ఒకే. కానీ ఆ దాడి ఎలా ఉండాలి..? ప్రభుత్వం చేసే తప్పుల మీద మాత్రమే ఉండాలి.. పాలనలో లోపాల మీద మాత్రమే ఉండాలి. వాటిని ఎండగట్టడం ద్వారా తమ నిజాయితీకి కూడా ప్రజల్లో మన్నన దక్కేలా చేసుకోవాలి. అదేమీ ఆలోచించకుండా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్న అంశాలను కూడా తిట్టిపోస్తూ ఉంటే.. ప్రజలు ఛీకొడతారు. 

చంద్రబాబు ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఆయన చేస్తున్న అడ్డమైన విమర్శలు ఆయననే నవ్వుల పాలు చేస్తున్నాయి. తటస్థులకు కూడా.. చంద్రబాబుకు అసలు ఆత్మసాక్షి ఉందా అనే అనుమానం కలిగిస్తున్నాయి. 

అర్థం పర్థంలేని ఆయన మాటలు చూద్దాం..

(1) ఉత్తరాంధ్ర మీద పరాయివాళ్ల దోపిడీ జరుగుతున్నట్లుగా చంద్రబాబు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. కీలకమైన ప్రాంతాల మీద పార్టీ ముఖ్యులను ఇన్చార్జిలుగా నియమించుకోవడం కొత్త సంగతి కాదు. తెలుగుదేశం కూడా అలాంటి నిర్ణయాలు అనేకం చేసింది. జాతీయ పార్టీల్లో ఒక రాష్ట్రానికి ఇన్చార్జిగా పరాయి రాష్ట్రాల నాయకులు ఉండడం చాలా సాధారణం. ఉత్తరాంధ్రకు విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి ఇన్చార్జిలుగా ఉంటే చంద్రబాబు తప్పు పడుతున్నారు. దోచుకోవడానికి వచ్చారంటున్నారు.

తన పుట్టిన ఊరు, సొంత నియోజకవర్గంలో ప్రజలను నమ్మించి గెలవడం చేతకాక, పుట్టెడు అమాయకత్వం పోత పోసిన ప్రజలు ఉండే కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లి.. అక్కడి నాయకులను మభ్యపెట్టి గెలుస్తున్న నేత చంద్రబాబు. ఆయన వంచనను అక్కడి ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. అలా తాను గెలవడానికే పరాయి ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు.. పరాయి ప్రాంతంలో పార్టీనేతలు ఇన్చార్జిలుగా ఉంటే దాన్ని తప్పు పట్టడం ఆత్మసాక్షితో చేసే పనేనా?

(2) అప్పులు, రోడ్లు బాలేకపోవడం వంటి ప్రభుత్వ లోపాలు ఎండగడితే బాగానే ఉంటుంది. కానీ.. నవరత్నాల సంక్షేమ పథకాలను కూడా తప్పుపడితే ప్రజలు ఊరుకుంటారా? నవరత్నాల పథకాలను ఎద్దేవా చేస్తూ నవ ఘోరాల పాలన అంటూ కామెడీ చేస్తే సహిస్తారా? కార్పొరేట్లకు మాత్రమే దోచిపెట్టడం అలవాటు చేసుకున్న చంద్రబాబు.. పేద ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తోంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.