బీఆర్ నాయుడు, జీవీరెడ్డి… విలువ‌ల్ని ఎలా చూడాలి?

బీఆర్ నాయుడి పిల్ల‌ల వ‌య‌సు బ‌హుశా జీవీరెడ్డి కంటే పెద్ద‌వాళ్లై వుంటారు. కానీ విలువ‌లు పాటించ‌డంలో బీఆర్ నాయుడు, జీవీరెడ్డి పంథాను ప‌రిశీలించి, ఎవ‌రికి వారు అంచ‌నా వేసుకోవాల్సిందే.

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్‌, అలాగే టీడీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేసి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిన జీవీరెడ్డి విలువ‌ల్ని ఎలా చూడాల‌నే చ‌ర్చ‌కు తెర లేచింది. ఇద్ద‌రికీ ఐఏఎస్ అధికారుల‌తోనే విభేదాలు. కాక‌పోతే బీఆర్ నాయుడు … అబ్బే త‌న‌కెవ‌రితోనూ గొడ‌వ‌ల్లేవ‌ని అంటుంటారు. అది వేరే విష‌యం. వాస్త‌వం ఏంటో అంద‌రికీ తెలుసు.

వైకుంఠ ద్వార ద‌ర్శ‌న టికెట్ల జారీ సంద‌ర్భంగా తిరుప‌తిలో తొక్కిస‌లాట జ‌రిగి ప‌లువురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తిరుప‌తికి వెళ్లారు. టీటీడీ చైర్మ‌న్‌, ఈవో శ్యామ‌లారావు త‌దిత‌రుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య డైలాగ్ వార్ జ‌రిగింది. త‌న‌కు ఈవో ఏ మాత్రం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, ఎలాంటి విష‌యాలు చెప్ప‌డం లేద‌ని సీఎం స‌మ‌క్షంలో బీఆర్ నాయుడు వాపోయారు.

టీటీడీ చైర్మ‌న్ వాద‌న‌ను ఈవో గ‌ట్టిగా సీఎం స‌మ‌క్షంలోనే తిప్పి కొట్టారు. ఇలాగైతే ఎలా అని చంద్ర‌బాబు మంద‌లించారు. అప్ప‌టి నుంచి టీటీడీ చైర్మ‌న్ తిరుమ‌ల‌కు ఎప్పుడొస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. టీటీడీ ఉన్న‌తాధికారుల తీరుపై ఆయ‌న అల‌క‌బూనార‌న్న‌ది వాస్త‌వం. అన్య‌మ‌న‌స్కంగా ఆ ప‌ద‌విలో బీఆర్ నాయుడు కొన‌సాగుతున్నార‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

ఇదే జీవీరెడ్డి విష‌యానికి వ‌స్తే, ఫైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ ప‌ద‌వినే కాదు, టీడీపీ ప్రాథ‌మిక సభ్య‌త్వాన్ని కూడా తృణ‌ప్రాయంగా వ‌దిలేశారు. ఆత్మాభిమానం కంటే ప‌ద‌వులు, అధికారం ఎక్కువ కాద‌ని అత‌ను నిరూపించారు. అధికారం, ప‌ద‌వుల కోసం నానాగ‌డ్డి తినే నేటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో జీవీరెడ్డి చ‌ర్య‌లు పిచ్చి చేష్ట‌లుగా అనిపించొచ్చు. కానీ విలువ‌ల దృష్ట్యా అత‌ను వ్య‌వ‌హ‌రించిన తీరు త‌ప్ప‌క ప్ర‌శంస‌లు అందుకుంటుంది. బీఆర్ నాయుడి పిల్ల‌ల వ‌య‌సు బ‌హుశా జీవీరెడ్డి కంటే పెద్ద‌వాళ్లై వుంటారు. కానీ విలువ‌లు పాటించ‌డంలో బీఆర్ నాయుడు, జీవీరెడ్డి పంథాను ప‌రిశీలించి, ఎవ‌రికి వారు అంచ‌నా వేసుకోవాల్సిందే. ఎందుకంటే, ప్ర‌జ‌లు అంద‌రికంటే జ్ఞానులు.

26 Replies to “బీఆర్ నాయుడు, జీవీరెడ్డి… విలువ‌ల్ని ఎలా చూడాలి?”

  1. మరి జగన్ ఎందుకు ఎ ఆత్మాభిమానం లెకుండా జనం తనకు ఇవ్వని ప్రతిపక్ష హొదా కావాలి అడుకుంట్టున్నాడు?

    1. How you call yourself a Rational??? when you are so biased and one sided. pls remove the mask.

      Jagan asking for Opposition status – is good for Democracy (since they get chance to speak as a right)

      Jagan should attend Assembly with or without Opposition status. – He should attend Assembly and aks questions.. if Govt doesn’t give him time.. PEOPLE would obviously be sympathetic towards Jagan.

      Not giving opposition status to one and only Opposition party is not Democratic.

      Not giving PAC chairman ship to Opposition party is so undemocratic from Kutami parties..

      Not allowing Mr. GV reddy to work is really bad administration by Mr. CBN

  2. నిన్ననే గా తాటిపర్తి చంద్ర శేఖర్ ని అందరిముందు జగన్ అవమానించాడు అని రాసావ్. అంటే ఇప్పుడు ఆయన కూడా వైసీపీ రాజీనామా చెయ్యాలి అని నీ ఉద్దేశమా?

  3. MLA గ గెలిచి అసెంబ్లీ కి రాణి జగన్ అండ్ వైసీపీ లు విలువలు పాటించి రాజీనామా చెయ్యాలిగా మరి?జి వి రెడ్డి జగన్ కన్నా చాలా చిన్నవాడు…మరి జగన్ ఆదర్శంగా తీసుకుంటాడా?

  4. GV రెడ్డి గారిని అభిమానించని TDP క్యాడర్ ఉండరు. Fibernet MD ని కూడా తొలగించటం జరిగింది. అయితె TDP నాయకత్వం, GV రెడ్డి గారు ఇద్దరూ మరికొంత సమన్మయం తొ వ్యవరిస్తె బావుంటెది.

    1. కేడర్ ఏ పార్టీ అయినా నిజయితీ గా సపోర్ట్ చేస్తారు. కాని లీడర్ల లెక్కలు వేరే ఉంటాయి మరి.. ఆ లెక్కల్లో జీవీ రెడ్డి తూకం సరిపోలేదు

    2. BRO,

      Nenu GV reddy press meet chusanu ..internal gaa pedda godave jarigindi anukuntunnanu..

      GV Reddy gaaru adikarulatho coordination sarigaa leka ila chesinattunaru..

      GV Reddy TV debates pakkanbedithe oka Fiber-net chairman gaa konchem darpam chupinchi untaru anukuntunna anduke adikarulu ithanni light teesukunnaru kavochu – idi naa personal opinion matrme..

    3. బ్రో,

      నేను జీవీ రెడ్డి ప్రెస్ మీట్ చూసాను ..ఇంటర్నల్ గ పెద్ద గొడవే జరిగింది అనుకుంటున్నాను..

      జీవీ రెడ్డి గారు అదికారులతో కోఆర్డినేషన్ సరిగా లేక ఇలా chesi untaru anukuntunna.

      జీవ రెడ్డి టీవీ డిబేట్స్ పక్కనబెడితే ఒక ఫైబర్-నెట్ చైర్మన్ గా కొంచెం దర్పం చూపించి ఉంటారు అనుకుంటున్నా అందుకే అధికారులు ఇతన్ని లైట్ తీసుకున్నారు కావొచ్చు – this is my strictly personal opinion.

      Lets See …..

      1. కావచ్చు!

        ఇలా జీవీ రెడ్డి పబ్లిక్ గా ప్రెస్స్ మీట్ పెట్టటం, అలానె కొంచం ఘాటుగా IAS ని రాజద్రొహం అనటం.. వాళ్ళు అందరూ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కంపైంట్ చెయటం… TDP నాయకత్వానికి నచ్చక పొయి ఉండవచ్చు!

        అయితె అయన రాజీనామా ని TDP అమొదించకుండా ఉండాల్సింది! అతనిని పిలిపించుకొని మాట్లాడి ఉండాల్సింది!

        1. Mithramaa manam 1983 nunchi yemee asinchakundaa TDP parteethone vunnamu….ainaa 1989, 2004, 2009, 2019 lo partee odipoyindhi….ilaa GV REDDY laanti vaarini pogottukunte mallee meeru, nenu parteetho vunnaa 2029 lo gatham punaraavruthamouthundhi….2029 TDP ki chala mukhyam.

        2. YES,

          గత చెం డాల ప్రభుత్వ హ్యాంగోవర్ ఇంకా అదికారులకు వదలకపోయి ఉండొచ్చు ..చూద్దాం

  5. Mr. Jagan asking for Opposition status – is good for Democracy (since they get chance to speak as a right)

    Mr. Jagan should attend Assembly with or without Opposition status. – He should attend Assembly and ask questions.. if Govt doesn’t give him time.. PEOPLE would obviously be sympathetic towards Jagan and YSRCP

    Not giving opposition status to one and only Opposition party in Assembly is not Democratic.

    Not giving PAC chairman ship to Opposition party is so undemocratic(Big mistake) from TDP+JSP.

    Not allowing Mr. GV reddy to work (good job) is really bad administration by Mr. CBN

  6. Mr. Jagan asking for Opposition status – is good for Democracy (since they get chance to speak as a right)

    .

    Mr. Jagan should attend Assembly with or without Opposition status. – He should attend Assembly and ask questions.. if Govt doesn’t give him time.. PEOPLE would obviously be sympathetic towards Jagan and YSRCP

    .

    Not giving opposition status to one and only Opposition party in Assembly is not Democratic.

    Not giving PAC chairman ship to Opposition party is so undemocratic(Big mistake) from TDP+JSP.

    Not allowing Mr. GV reddy to work (good job) is really bad administration by Mr. CBN

  7. జీవీ రెడ్డి గారిని టీడీపీ లో అందరు ఇష్టపడతారు కానీ ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఎల్ల వేళల ముక్కు సూటి తత్త్వం పనికి రాదు అది పార్టీ కి నష్టం చేకూర్చొచ్చు ఆయన కూడా పార్టీ సాధకబాధకాలు చూడాలి ఆయనను టీడీపీ వదులుకోదు ఆయనకు నచ్చ చెప్పి తీసుకు వస్తారు

  8. వెకిలి వెధవ గాడి అసహ్యకరమైన తెలుగు భాష లో అన్నట్లు “వలవలు వశ్వసనీయత “ అని అంటావ్ అంతేనా!!

  9. నిజమైన రెడ్డి ఎవరు.

    తనకు గౌరవం లేదు ఆన్న పదవిని తూ నా బొడ్డు అని వదిలేసిన జీవి రెడ్డి గారు.

    తనకు లేని తాహతు ప్రతిపక్ష పదవి కోసం అడుక్కుంటన్న ప్యాలస్ పులకేశి ఫేక్ రెడ్డి.

    కానీ మన రెడ్డి లకు ఈ దొం*గ వాటికన్ మార్పిడి ఫేక్ రెడ్డి నే కులగజ్జి తో సపోర్ట్ చేస్తుంది.

    నిజమైన జీవి రెడ్డి లాటి లకి సపోర్ట్ చేయరు.

Comments are closed.