స‌జ్జ‌ల అట‌వీభూముల‌పై మీడియా విప‌రీత పోక‌డలు!

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అంటే రాజ‌కీయంగా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ అధికారంలో వుంటూ, అట‌వీశాఖ అధికారుల‌ను అనుమానించేలా, అవ‌మానించేలా మీడియా క‌థ‌నాలు రాయ‌డం విడ్డూరంగా వుంది.

వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోద‌రుల భూముల‌పై అట‌వీశాఖ అధికారులు త‌మ రాత‌ల‌కు అనుకూల నివేదిక‌లు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ప్ర‌భుత్వ మీడియా జీర్ణించుకోలేక‌పోతోంది. అట‌వీశాఖ అధికారుల‌పై విషం చిమ్మ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నిజంగా స‌జ్జ‌ల కుటుంబ స‌భ్యులు అట‌వీభూముల్ని ఆక్ర‌మించి వుంటే, కూట‌మి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. ఇందులో ఎవ‌రికీ భిన్నాభిప్రాయం వుండాల్సిన ప‌నిలేదు. మ‌రీ ముఖ్యంగా అట‌వీ భూముల్ని స‌జ్జ‌ల కుటుంబం ఆక్ర‌మిస్తే, వెంట‌నే ఎత్తుకెళ్లి జైల్లో వేయ‌డానికి ప్ర‌భుత్వం కాచుకుని వుంటుంది.

వైఎస్సార్ జిల్లా క‌డ‌ప న‌గ‌రానికి స‌మీపంలోని చింత‌కొమ్మ‌దిన్నె రెవెన్యూ ప‌రిధిలో 200కు పైగా ఎక‌రాల అట‌వీ భూముల్ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ర‌క్త సంబంధీకులు ఆక్ర‌మించారంటూ ప్ర‌భుత్వ అనుకూల మీడియా క‌థ‌నాలు రాసింది. ఈ క‌థ‌నాలపై అట‌వీశాఖ మంత్రి ప‌వ‌న్‌కల్యాణ్ సీరియ‌స్‌గా స్పందించి విచార‌ణ‌కు ఆదేశించారు. టీడీపీ ప్ర‌భుత్వ అనుకూల మీడియా ఏఏ స‌ర్వే నంబ‌ర్ల‌లో ఎంతెంత అట‌వీ భూమి ఆక్ర‌మించారో వివ‌రాల‌తో స‌హా నివేదిక రూపంలో క‌థ‌నాల్ని రాసింది.

ఈ నివేదిక‌ల్నే య‌ధాత‌థంగా అట‌వీశాఖ అధికారులు తీసుకుని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆ మీడియా ఆశించింది. అయితే స‌ద‌రు భూములు త‌మ‌వి కాద‌ని అట‌వీశాఖ అధికారులు అంటున్నార‌ని ఆ మీడియా తీవ్ర ఆగ్ర‌హం, అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ భూములు అట‌వీశాఖ‌కు చెందిన‌వే అని రెవెన్యూ అధికారులు అంటున్నార‌ట‌. కానీ త‌మ‌వి కానే కావ‌ని ఒక‌టికి రెండుసార్లు స‌ర్వే చేసి అట‌వీశాఖ అధికారులు నిగ్గు తేల్చినా, మీడియా మాత్రం ఒప్పుకోవ‌డం లేదు. ఆ విధంగా ఎట్లంటార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి చెందిన మీడియా ప్ర‌తినిధుల్నే స‌ర్వేకి పంపి, ఆ భూముల‌న్నీ అట‌వీశాఖ‌వే అని నివేదిక ఇస్తే స‌రిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అంటే రాజ‌కీయంగా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ అధికారంలో వుంటూ, అట‌వీశాఖ అధికారుల‌ను అనుమానించేలా, అవ‌మానించేలా మీడియా క‌థ‌నాలు రాయ‌డం విడ్డూరంగా వుంది. ఇటీవ‌ల కాలంలో మీడియా శ్రుతిమించి ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్న విమ‌ర్శ బ‌లంగా వుంది. కూట‌మి ప్ర‌భుత్వం కంటే, ఎక్కువ‌గా వైసీపీని ఆ మీడియానే టార్గెట్ చేస్తోంది. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీరుతో పార్టీకి న‌ష్టం వ‌స్తోంద‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం. అలాగ‌ని ఆయ‌న సోద‌రుల‌కు సంబంధించి భూముల‌పై ఇష్టానుసారం రాయ‌డం, వాటికి బ‌లం క‌లిగించేలా ప్ర‌భుత్వాధికారుల నుంచి నివేదిక ఆశించ‌డం ఏం న్యాయ‌మో ఆలోచించాల్సి అవ‌స‌రం వుంది.

8 Replies to “స‌జ్జ‌ల అట‌వీభూముల‌పై మీడియా విప‌రీత పోక‌డలు!”

  1. అబ్బొ! మన సజ్జల కుటుంబ సబ్యులకి ఎక్కడి నుండి వందల ఎకరాలు వచ్చాయి?

    ఎ రిక్షా తొక్కి సజ్జల సంపాదించాడు?

    1. Kerosine ammi okadu paper and tv pettagalugaadu, pachallu ammi inkokadu paper tv film city kattagaligaadu, 2acres tho maraokadu lakshalaa kotlu pogesugogaligaadu.. Vellatho polchite bijjala oaka lekkana.

    2. Kerosine ammi okaru paper and tv pettagalugaadu, pachallu ammi inkokaru paper tv film city kattagaligaadu, 2acres tho marokaru lakshalaa kotlu pogesugogaligaadu.. Vellatho polchite bijjala oaka lekkana.

Comments are closed.