విశాఖ కోటాలో ఎవరికి చాన్స్?

విశాఖ నుంచి దువ్వాడ రామారావు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తోంది. దాంతో ఆయన కోటాలో విశాఖ నుంచి మరొకరికి చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ టీడీపీలో వినిపిస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో ఏపీ నుంచి అయిదు ఎమ్మెల్సీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ అయిదు సీట్లు గుత్తమొత్తంగా టీడీపీ కూటమి గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీలో నూటికి తొంబై అయిదు సీట్లు కూటమి పార్టీలవే కావడంతో వారికే ఇవన్నీ దక్కుతాయి.

ఈ అయిదు సీట్లు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా వచ్చినవి. ఇందులో టీడీపీకి ఎన్ని సీట్లు మిగిలిన పార్టీలకు ఎన్ని సీట్లు అన్నది కూడా హాట్ టాపిక్గా ఉంది. టీడీపీ వరకూ తీసుకుంటే ప్రాంతాల వారీగా సమతూకం పాటించాలని కోరుతున్నారు.

విశాఖ నుంచి దువ్వాడ రామారావు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తోంది. దాంతో ఆయన కోటాలో విశాఖ నుంచి మరొకరికి చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ టీడీపీలో వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఆశావహులు ఉన్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ఈ సీటు ఇవ్వాలన్న డిమాండ్ ఆయన వర్గంలో ఉంది. ఒకవేళ ఆయన కాకపోతే యువతరం అనుకుంటే ఆయన కుమారుడికైనా ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.

గత ఎన్నికల్లో సీట్లూ త్యాగం చేసిన వారు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికైనా ఎమ్మెల్సీ పదవి ఇస్తే న్యాయం చేసినట్లుగా ఉంటుందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఏజెన్సీ నుంచి కూడా పోటీ అధికంగా ఉంది. పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆమెకు ఈ పదవి ఇస్తే ఏజెన్సీలో టీడీపీ బలోపేతానికి అవకాశాలు మెరుగు అవుతాయని అంటున్నారు.

అదే విధంగా సీనియర్ నేతల వారసులు కొంతమంది పెద్దల సభలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అవకాశం ఉంటే తమకూ ఒక చాన్స్ అని ద్వితీయ శ్రేణి నేతలూ ఆలోచిస్తున్నారు. ఇంతకీ విశాఖ నుంచి ఎమ్మెల్సీ పదవికి ఎవరినైనా ఎంపిక చేసే ప్రతిపాదన టీడీపీ పెద్దల మదిలో ఉందా అన్నదే ఇపుడు అంతా తర్కించుకుంటున్నారు.

4 Replies to “విశాఖ కోటాలో ఎవరికి చాన్స్?”

  1. పానుగంటి లోకనాథరావు గారు… మీ కొత్త అవతారం ఏంటి?

    ఎప్పుడూ అన్నివేళలా ఘాటుగా, పచ్చగా, భయంకరమైన పదజాలంతో రాజకీయ భక్తి చాటుకున్న మన పానుగంటి గారు… ఇప్పుడు కనబడకపోవడం విచిత్రం కదా! ఏమైంది? ఓటమిని జీర్ణించుకోలేక హిమాలయాలకు వెళ్లిపోయారా? లేక “ఈ ID చాలు, కొత్త ID లో న్యూ జన్మ” అన్న కోణంలో ఆలోచిస్తున్నారా?

    ఏ పార్టీని మద్దతు ఇస్తే ఇచ్చుకోండి గానీ, వేరేవాళ్లను అసభ్యంగా తిట్టి, అవమానించడం తప్ప రాజకీయ చైతన్యం కాదని ఇప్పటికైనా అర్థమైందా?

    పార్టీలు వచ్చి పోయి పోతాయి, కానీ మన మాట మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది! ఆ మాటమీద మీరు వుంటారా? లేక మీ పాత పోస్టులు చూసుకుని మీరే తలపట్టుకోబోతున్నారా?

    ఇప్పుడే క్లారిటీ తెచ్చుకోండి!

    1️⃣ మీ మాటల్లో ఉన్న అసభ్యతను మీరు గౌరవంగా చూసుకుంటారా? లేక సిగ్గుతో తలదించుకుంటారా?

    2️⃣ మిమ్మల్ని మీ కుటుంబం గౌరవంగా చూస్తుందా? లేక “ఆయన మన వారే కాదు” అని వెనక్కి తగ్గిపోతుందా?

    3️⃣ రాజకీయ నమ్మకానికి ఓ అర్ధం ఉండాలి, కానీ వ్యక్తిత్వం కోల్పోవాల్సిన అవసరమా?

    మీ బ్రాహ్మణ కుటుంబం తరతరాలుగా గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది, మీరు మాత్రం అదే గౌరవాన్ని అసభ్య పదజాలంతో తుడిచిపెట్టేస్తారా?

    ఇప్పటికైనా మార్పు రావాలి!

    మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, కానీ సంస్కారం మరిచిపోవద్దు!

    మీ మద్దతు చెప్పండి, కానీ వ్యక్తిత్వాన్ని బలిపీఠం మీద ఉంచకండి!

    ఒకవేళ ఇంకా “ఇది ప్రజల విజయం కాదు, ప్రజలు మోసపోయారు” అనే భ్రమలోనే ఉంటే, మేము ఏమి చెయ్యగలం? పచ్చ ID మారిపోతే ఎర్ర ID లో వస్తారా? లేక ఏదైనా “ఆధ్యాత్మిక ID” ట్రై చేయాలనుకుంటున్నారా? 😜😂

    ఇకనైనా బయటకి రండి, మౌనంగా మాయం కాకుండా, నిజమైన తత్వం గుర్తు పెట్టుకోండి! 😆👏

Comments are closed.