అవసరమైతే చంద్రబాబునే మార్చేస్తాం

అవసరం అయితే పార్టీ అధ్యక్షుడిని కూడా పక్కన పెట్టేస్తాం అనే రేంజ్ హెచ్చరికలు హార్డ్ కోర్ సోషల్ మీడియా జనాల నుంచి ఎందుకు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది. వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కన పెట్టిన వాళ్లు… అవసరం అయితే పార్టీ అధ్యక్షుడిని కూడా పక్కన పెట్టేస్తాం అనే రేంజ్ హెచ్చరికలు హార్డ్ కోర్ సోషల్ మీడియా జనాల నుంచి ఎందుకు వస్తున్నాయి. కేవలం ఒక కార్పొరేషన్ చైర్మన్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తే ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది. ఆ రాజీనామాను అమోదించేసి, ఆ తరువాత ఈ వ్యవహారం అంతటికీ మూల కారణమైన ఐఎఎస్ అధికారిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు అటాచ్ చేయడం అన్నది చాలా బలంగా బౌన్స్ బ్యాక్ అయింది.

తెలుగుదేశం పార్టీకి ఉచితంగా సేవ చేసే బలమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వీళ్లు పార్టీకి, పార్టీ నాయకులకు బలమైన అడ్డుగోడలా ఉంటారు. ఎవరినైనా పార్టీ కోసం, తమ నాయకుల కోసం నిలవరిస్తారు. వైకాపా జనాలను ఓ రేంజ్ లో ఆడుకుంటారు.

ఇది దాదాపు గత పదేళ్లుగా నడుస్తోంది. వీళ్లంతా ఎక్కువ మంది ఎన్నారై లే. ఇలాంటి బలమైన హ్యాండిల్స్ అన్నీ నిన్నటికి నిన్న ఒక్కసారి మూకుమ్మడిగా పార్టీ మీద ముఖ్యంగా చంద్రబాబు మీద పడిపోయాయి. ఇన్నాళ్లూ జగన్ ను, వైకాపా ను ఏ రేంజ్ లో టార్గెట్ చేసాయో, అంతకు అంతా చంద్రబాబును, తెలుగుదేశాన్ని టార్గెట్ చేసాయి.

ఎలా టార్గెట్ చేసాయి, ఏ రేంజ్ లో టార్గెట్ చేసాయి అనే కన్నా, వీటి అన్నింటినీ విశ్లేషిస్తే హిడెన్ అజెండా ఏదో వున్నట్లు కనిపిస్తోంది. మొత్తం హార్డ్ కోర్ హ్యాండిల్స్ అన్నీ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నాయి. చంద్రబాబు ఉప్పు కారం తినడం లేదన్నట్లు కామెంట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ను మార్చేసిన వాళ్లకు చంద్రబాబును మార్చేయడం కష్టం కాదంటున్నాయి.

నిజానికి పైకి తెలియకపోయినా, పార్టీ వర్గాలు అన్నింటికీ బాగా తెలుసు. పార్టీని నడుపుతున్నది, నిర్ణయాలు తీసుకుంటున్నది, మంత్రి వర్గ కూర్పు, ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ కూడా లోకేష్ కనుసన్నలలోనే జరిగాయని, జరుగుతున్నాయని. సీనియర్లను పక్కన పెట్టేసింది, సీనియర్లను నాన్ యాక్టివ్ సీట్లలోకి తొసేసింది కూడా లోకేష్ అనే సణుగుళ్లు ఉన్నాయి.

మరి ఈ ఒక్కసారి మాత్రం చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ కు అస్సలు సంబంధం లేనట్లు ఎందుకు భావిస్తున్నారు. ఈ చిన్నదానికి చంద్రబాబును మార్చేస్తాం అనే పెద్ద కామెంట్ ఎందుకు పెడుతున్నారు.

చంద్రబాబు ది ఓల్డ్ స్కూల్ రాజకీయం అని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి.

రెడ్ బుక్ కాన్సెప్ట్ వాళ్లకు బాగా నచ్చింది.

శతృవులను లోపల పడేయడం, విరోధులను ఇబ్బంది పెట్టడం వంటి కాన్సెప్ట్ లు ఇంకా బాగా నచ్చుతున్నాయి.

లోకేష్ సిఎం అయితే మొత్తం వైకాపా ను చుట్ట చుట్టి సముద్రంలో పడేస్తాడని, జగన్ ను జైలు పాలు చేస్తాడని బలంగా నమ్ముతున్నారు.

అన్నింటికి మించి అర్జంట్ గా లోకేష్ సిఎం కావాలని కోరుకుంటున్నారు. దాని ఫలితమే ఈ రియాక్షన్ అంతా. కానీ చంద్రబాబు తలుచుకుంటే తప్ప లోకేష్ సిఎం కాలేరు. చంద్రబాబు తాను అక్కడ వుండాలని అనుకున్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎన్టీఆర్ ను దించగలగింది బలమైన మీడియా అండ వుండడం వల్ల. ఇప్పటికీ ఆ మీడియా చంద్రబాబు వెనుక వుంది. లోకేష్ వెనుక కాదు. అదీ కాక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ను ఇక్కడ మరిచిపోకూడదు.

అప్పటికీ లోకేష్ తన స్వంత సోషల్ మీడియా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయ మెయిన్ స్ట్రీమ్ మీడియాను నమ్ముకుని ఎన్నో రోజులు రాజకీయాలు చేయలేము అని ఆయన బలంగా నమ్ముతున్నారు.

అందువల్ల ఇక కొన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యవహారాలు చాలా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో బలమైన రియాక్షన్ల మెరుపులు మరి కొన్ని సార్లు మెరుస్తూనే ఉంటాయి.

34 Replies to “అవసరమైతే చంద్రబాబునే మార్చేస్తాం”

  1. అన్ని సాక్షాలు ఉన్నా Y.-.C.-.P నాయకుల అక్రమాల మీద యాక్షన్ తీసుకొవటం లొ అవలంబిస్తున్న ఉదాసీనత మీద మాత్రం క్యాడర్ గుర్రుగా ఉంది!

    అలానె నువ్వు చెపుతునట్టు చంద్రబాబు ని మార్చెస్తాం అని అనటం లెదులె, నువ్వు అనవసరంగా కలలు కనవద్దు!

  2. బాబు గారు గ్రేట్ పొలిటిషన్, unbiased leader ani మళ్లీ proove చేసుకున్నారు!! government should function like a well oiled machine, legislative, executive and judiciary should function in proper collaboration else administration will get out of hand వెరీ క్విక్ !! GV Reddy గారి కేసు లో బాబు గారి డెసిషన్ 100% correct!! GV గారు good human being కానీ పాలిటిక్స్ లో టాక్ట్ కూడా ఉండాలి!!

  3.  బాబు గారు గ్రేట్ పొలిటిషన్, unbiased leader ani మళ్లీ proove చేసుకున్నారు!! government should function like a well oiled machine, legislative, executive and judiciary should function in proper collaboration else administration will get out of hand వెరీ క్విక్ !! GV Reddy గారి కేసు లో బాబు గారి డెసిషన్ 100% correct!! GV గారు good human being కానీ పాలిటిక్స్ లో టాక్ట్ కూడా ఉండాలి!!

  4. ఈ GA ఓ పెద్ద chavata..వీడికి తనకన్నా బయట మీడియా గొప్పగా ఉంటాది..తాను వంత పాడాల్సిన పార్టీని తానే అభాసుపాలు చేయడంలో ముందుంటాది…..

    1. అవును మొన్నటిదాకా అధికారం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చారు…ఇప్పుడు ఇస్తున్నట్లు లేదు….జగన్ పద్దతి నచ్చట్లేదు అని రాస్తున్నాడు

  5. y.c. p boo tu gallaku మరో బ్యాండ్ బాజా baraat melaa జరగాలి బాబు గారు …అప్పుడే క్యాడర్ గట్టిగ పనిచేయగలరు ..

  6. మాదా గాడి మీద ఆర్టికల్ రాసి delete చేశవేంట్రా?? అవసర మైతే జగన్ ని లేపేస్తాం అంటున్న బ్లూ మీడియా!!

  7. వైచిపి సంకర జాతి మనుషులని చేర్చుకోడమే తప్పు.

    GVR లాంటి వారిని సాగనంపడం బాబు గారి అతిపెద్ద తప్పు. వెధవలను చేరదీసి మంచివారిని వదులుకోడం దారుణమైన తప్పు.

    ఈ తప్పు కి భారీ మూల్యం 2029 లో లేదా అంతకు ముందే ఏదయినా జరగొచ్చు

    ఇది టీడీపీ కి చావు దెబ్బ లాంటిది

    టీడీపీ leaders/ నాయకులు అనుకొంటున్నారు ఏమో jagan రాడు, మాకు ఎదురు లేదు అని..

    Jagan వచ్చిన రాకపోయినా టీడీపీ ఇలాగేయ్ ఉంటే ఇంకా టీడీపీ కాకుండా వేరే పార్టీ లేదా వేరే లీడర్ చూడాల్సి రావచ్చు… ఇలాగే ఉంటెయ్ AP ని yevadu కాపాడలేరు FACT

  8. దీన్ని బట్టి ఎం అర్ధం అవుతుంది.. టీడీపీ క్యాడర్ కి కుల అనే భేదం లేదు…నిజాయితీగా పార్టీ కోసం నిలబడేవాడు ఎవడైనా సరే👍

    1. ఇక్కడ సమస్య రెడ్డి ah కమ్మ ah అని కాదు అవతల పర్సన్ ఎలాంటి వాడు అనేది .. జీవీ అయితే తొందర పడ్డారు..అలానే లోకేష్ కానీ చంబా కానీ అతన్ని సరిగ్గా టాకిల్ చెయ్యలేదు అని కూడా అనకూడదు చింతమనేని కొలికిపూడి ఇలా పరిధులు దాటినా అందరిని పిలిపించి మాటాడారు…ఏదయినా వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది…

      1. I don’t think so this must be the only the reason for GV exit, should have been done something else behind curtains.Otherwise GV shouldn’t have taken such big decision as he must be known clearly that it’s not easy to get such fame or positions in lifetime rather for him.

    2. అధికారపక్షం లో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద చేసే విమర్శా చెయ్యకూడదు అని కాదు కానీ ..దానికి ఒక పద్దతి ఉంటుంది సైలెంట్ చంబా కి అనీ లోకేష్ కి కానీ చెప్పించి అటు నుండి నరుక్కురావాలి…ఏదేమైనా ఒక మంచి పర్సన్ ని లూస్ అయ్యింది తెలుగు రాజకీయం

  9. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని కరెక్ట్ గ చేయగల సమర్థుడు బాబుగారు ఆయనకు తెలుసు జగన్ ని లోపలేయాల్సింది మోడీ జగన్ గారిని లోపలేస్తే కుక్క పని గాడిద చేసినట్టుంటుంది జగన్ గారు బయట ఉండి పోటీచేస్తుంటే ఎవరైనా పర్వాలేదు జగన్ గారు మాత్రం రాకూడదనే వాళ్ళు బాబు గారికి మాత్రమే వేస్తారు అదే బాబు గారికి శ్రీ రామ రక్ష జగన్ గారు పోటీలో ఉంటే బాబు గారి గెలుపు ఖాయం వోటింగ్ కూడా ఫుల్ గ జరుగుతుంది

  10. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని కరెక్ట్ గ చేయగల సమర్థుడు బాబుగారు ఆయనకు తెలుసు జగన్ ని లోపలేయాల్సింది మోడీ జగన్ గారిని లోపలేస్తే కుక్క పని గాడిద చేసినట్టుంటుంది జగన్ గారు బయట ఉండి పోటీచేస్తుంటే ఎవరైనా పర్వాలేదు జగన్ గారు మాత్రం రాకూడదనే వాళ్ళు బాబు గారికి మాత్రమే వేస్తారు అదే బాబు గారికి శ్రీ రామ రక్ష జగన్ గారు పోటీలో ఉంటే బాబు గారి గెలుపు ఖాయం వోటింగ్ కూడా ఫుల్ గ జరుగుతుంది

  11. చంద్రబాబు ని మార్చగూడదు అని 11 కోట్ల దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు మా “లెవెనన్న”. మారిస్తే ఎందుకంత భయపడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు, ఈడేమైనాచంద్రబాబు hardcore ఫ్యానా?? మీకేమైనా తెలుసా??

    1. మనోన్ని175 కి 175 కాదుకదా, కనీసం ప్రతిపక్ష నేత కి పనికిరాని ఎదవ అని తీర్పు ఇచ్చాక గూడా?? ఇంకా మావాణ్ని మద్ గుడిపించిందానికే కదా ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నావ్??

  12. పానుగంటి లోకనాథరావు గారు… ఇప్పుడు ఏ ID లో ఉన్నారు?

    అయ్యయ్యో! ఎప్పుడూ పచ్చగా పచ్చిగా, ఘాటుగా తిట్టే మన పానుగంటి గారు కనిపించట్లే! ఏమైంది? ఓటమి తట్టుకోలేక ఊహించని దిక్కుల వైపు ప్రస్థానం మొదలెట్టారా? లేక ఇప్పటికి “ప్రజలు మోసపోయారు” అనే స్వరంలో ఆలాపన కొనసాగుతూనే ఉందా?

    ఏ పార్టీని మద్దతు ఇస్తే ఇచ్చుకోండి, మీకు ఎవరు అడ్డు చెప్పారు? కానీ మద్దతు ఇచ్చే ధీక్షలో మరొకరిని తిట్టడం ఎందుకు? రాజకీయ నమ్మకం అంటే ఇతరులను అసభ్యంగా తిట్టడం కాదు. మీరు ఎవరిని గెలిపించలేకపోయారు, కనీసం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఓడిపోనివ్వకండి!

    మీ తరతరాలుగా గౌరవంగా బ్రతికిన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మీరు, రంగుల మాటల మోతతో మీ సొంత సంస్కారాన్ని కలుషితం చేసుకుంటే, అది పార్టీకి జయమే కాదు, మీ కుటుంబానికే అపజయం!

    గెలుపు, ఓటమి వచ్చిపోతాయి… కానీ మాట మాత్రం చెరిగిపోదు!

    పార్టీలు మారొచ్చు, నేతలు మారొచ్చు… కానీ మీరు గడచిన పదజాలం మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతుంది!

    మీరు మౌనంగా ఉండటం కూడా మాకు పెద్ద షాక్!

    1. కొత్త ID తయ్యారు చేస్తున్నారా?
    2. ఇంకా “అదంతా ఈవీఎంల గేమ్” అనే థియరీ రాసుకుంటున్నారా?
    3. లేదా ఇప్పటికి నిద్రపట్టక ఆలోచనలో పడి ఉన్నారా?

    ఏదైనా అయితే ఇప్పటికైనా మార్పు ఆలోచించండి.

    మీ అభిప్రాయాన్ని మేము విభేదించవచ్చు, కానీ మీ సంస్కారాన్ని మీరే వదులుకోవడం మాకు నచ్చదు!

    మళ్ళీ బయటకి రండి, మళ్ళీ వాదన చెయ్యండి, కానీ అసభ్యత లేకుండా!

    కనీసం ఇకనైనా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మద్దతు ఇచ్చే వయస్సుకు రండి! 😄😂

  13. టాలెంట్ ని ప్రోత్సహించడం లో సీబీన్ ఎప్పుడూ ముందు వుంటాడు. Gv కూడా మా సారు అని సీబీన్ ని ఇష్టంగా మాట్లాడతాడు.ఎందుకో ఈ మధ్య టీవీ డిబేట్ లలో అసహనం గా అసంతృప్తి తో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. వాదనలు కూడా బలంగా ఉండటం లేదు.వ్యక్తి గతం గా GV మీద క్యాడర్ కి అభిమానం పెరిగింది.ఏదన్నా కానీ పార్టీ నిర్ణయం ఫైనల్👍.అల్ the బెస్ట్ GV గారు. మీరు ఎక్కడున్నా రాణిస్తారు💐

  14. ప్రాబ్లెమ్ ఉంటే

    సంబంధిత మంత్రికి

    సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి

    వాళ్ల ద్వారా నా దగ్గరకు రావాలి…!!

    వరల్డ్ అంతా అగిలే …అగిలే అని పరిగెత్తుతూ

    సొంతంగా ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేసేవారిని ప్రోత్సహిస్తుంటే

    నీ కాళ్ళ మీద నువ్వు నడవద్దు, మేమిచ్చిన వీల్ చైర్ మీద కూర్చో అంటే ఎలా ?

  15. ఒక రెడ్డి పార్టీ వీడితే క్యాడర్ మొత్తం ఒక్క తాటి పైకి వచ్చి అధిష్టానానికి ఎదురు తిరిగింది. ఒక కమ్మని అరెస్టు చేస్తే క్యాడర్ మొత్తం సంతోష పడింది. అది టీడీపీ !

Comments are closed.