దోపిడీ ఆపలేకపోయినా వైఫల్యమే కదా బాబూ!

వరద ముప్పు అనూహ్యమైనది. ప్రజలకు కష్టం వచ్చింది. ప్రభుత్వం చేయగలిగిన పని వారు చేస్తున్నారు. విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మంచి మనసు ఉన్న వాళ్లు, సాయం చేయదగిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా…

వరద ముప్పు అనూహ్యమైనది. ప్రజలకు కష్టం వచ్చింది. ప్రభుత్వం చేయగలిగిన పని వారు చేస్తున్నారు. విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మంచి మనసు ఉన్న వాళ్లు, సాయం చేయదగిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆదుకుంటూనే ఉన్నారు. చివరి ప్రాంతాల వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది తప్పకపోయినప్పటికీ.. వీలైనంతగా అందరినీ ఆదుకోవడానికి, అందరికీ ఆహారపొట్లాలు తదితరాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం కష్టపడుతూనే ఉంది.

ప్రభుత్వం చేస్తున్న పనులను తప్పుపట్టే పనిలేదు. అయితే.. వరదముప్పు సమయంలో సామాన్యులను దోచుకుంటున్న వారి సంగతేమిటి? ఇదే అదనుగా గతిలేని పేదలను నిలువుదోపిడీ చేస్తున్న వారిని అరికట్టలేకపోతే దానిని కూడా ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుంది కదా? అనేది ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్న సందేహం.

విజయవాడలో ఒకపక్క ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుండగానే.. మరోపక్క నిలువుదోపిడీ కూడా యథేచ్ఛగా సాగిపోతోంది. ఆటోడ్రైవర్లు, ప్రెవేటు బోటు యజమానులు, జేసీబీల యజమానులు విచ్చలవిడిగా ఆపదలో ఉన్నవారిని దోచుకుంటున్నారు. 8నెలల పాప, రెండేళ్ల బాబుతో నివాసం ఉన్న ఒక కుటుంబం ప్రెవేటు బోటును ఆశ్రయిస్తే వాళ్లను 20 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో బోటును 5వేలకు మాట్లాడుకుని వారు ప్రాణాలతో బయటపడ్డారు.

వరద ప్రాంతం నుంచి రోడ్ల మీదకు వచ్చిన తర్వాత.. ఆటో వాళ్లు కూడా అంతకు మించి దోచుకుంటున్నారు. సాధారణంగా 20 రూపాయలతో తీసుకువెళ్లే షేర్ ఆటో దూరానికి ఏకంగా మనిషికి 200రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. నలుగురు మనుషుల్ని నీటమునిగిన ఇంటినుంచి బయటకు తీసుకురావడానికి ఒక జేసీబీ నాలుగు వేల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇదంతా కేవలం అవసరంలో, ఆపదలో ఉన్న వారిని దోచుకునే పర్వమే.

ప్రభుత్వం తాము చేస్తున్న పనులు ఎన్నయినా చేయవచ్చు గాక.. కానీ, ఇలాంటి దోపిడీలకు కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వ వ్యవస్థ ఉన్నచోట జరిగే దోపిడీకి బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ బోట్లు వెళ్లలేని ప్రాంతాలకు అసలు ప్రెవేటు బోట్లు మాత్రం ఎలా వెళ్లగలుగుతాయి? అనేది ఒక ప్రశ్న. పైగా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు.. ప్రభుత్వ ప్రెవేటు అనే తేడాలేకుండా మొత్తం బోట్లు అన్నింటినీ ప్రభుత్వమే తమ స్వాధీనంలోకి తీసుకుని వాటిద్వారా సహాయక చర్యలు అందించాలి కదా! ఆ స్పృహ ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు లేకుండాపోయిందా? అని ప్రజల సందేహం.

బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, జీపులు వీలైనన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాటిద్వారా అన్ని రకాల సహాయక చర్యలు అందించాల్సింది బదులుగా.. ప్రెవేటుగా వాటిని కలిగిఉన్నవారు యథేచ్ఛగా ఆపదలో ఉన్న వారిని దోచుకోవడానికి ఆస్కారం కల్పించడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫ్యలమే. అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది.

9 Replies to “దోపిడీ ఆపలేకపోయినా వైఫల్యమే కదా బాబూ!”

  1. గుర్తు ఉందా! రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే ఇళ్ల rates పెంచిన bezawada తెలివి. ఇప్పుడు urukuntara?

    1. 2nd day ne 6 velu vunna illu 30K rent annaru.

      Maa inti owner plus realtor dhi original ga Gudivada, he wanted to do apartment construction in AP too and he was in discussion with sone owner for house for 6k for office and temporary stay, before he is about to give advance, announcement came and he was asked to pay 30K rent. My owner is nothing short of foul words towards the people who asked for high prices. Both are chowdaries that is the irony. he was like hyderabad is a developed city and how come they ask for Vijayawada as Amaravathi yet to develop.

      Imagine the prices of land rated then, he backed off from business in Vijayawada.

  2. ప్రస్తుత వరదలు కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో, కొందరు ఈ విపత్తును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం చాలా దారుణం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాల్సింది పోయి, కొన్ని వైసీపీ మద్దతుదారులు కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ, ద్వేషాన్ని ప్రోత్సహించడం నిజంగా శోచనీయమే. మనం చదువు 받은వారిగా, ఇలాంటి సన్నాశిక ధోరణులను వదిలిపెట్టాలి. మన ప్రాథమిక లక్ష్యం సానుభూతి, ఐక్యత, మానవతను కాపాడుకోవడం కావాలి.

    ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం చేయడం, మద్దతు అందించడం, సంఘీభావం వ్యక్తం చేయడం ముఖ్యమై ఉండాలి. రాజకీయ లాభాల కోసం లేదా కులం పేరుతో చీల్చిచెండాలని ప్రయత్నించడం కాదు. సహజ విపత్తులను ఈ విధంగా కులపరమైన క్షుద్ర ఆలోచనలకు వాడుకోవడం సమాజానికి ప్రమాదకరం. ఇది అలాంటి వ్యక్తుల ప్రతిష్టను మాత్రమే కాదు, వారు మద్దతిస్తున్న పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

    ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీకి ప్రజలు ఇప్పటికే స్పష్టమైన సందేశం ఇచ్చారు. మరోసారి ఇలాంటి విద్వేషపు చర్యలు కొనసాగితే, ప్రజలు మరింతగా దూరం అవుతారు, ఇది పార్టీ భవిష్యత్తుకు తీరని నష్టం అవుతుంది. వైసీపీ మద్దతుదారులు తమ చర్యలపై ఆలోచించి, ఈ విషపూరిత చర్యలను వదిలిపెట్టి, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది.

    మనం ముందుగా మనుషులం. కులం, రాజకీయాలు, చీలికలు అనేవి సంక్షోభ సమయాల్లో అసలు ఉనికిలో లేకుండా పోవాలి. మీ పార్టీ పట్ల నిజంగా శ్రద్ధ కలిగిన వారు అయితే, ప్రజలకు సహాయం చేయడంలో, ఐక్యతను పెంపొందించడంలో, మరియు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముందుండండి. ఈ విధంగా మాత్రమే గౌరవాన్ని సంపాదించవచ్చు, పార్టీకి మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు – ద్వేషంతో కాదు, మానవత్వంతో.

    ఈ కులపరమైన చర్చల నుండి బయటకు వచ్చి, మంచి మనిషిగా ఎలా ఉండాలో చూపించడమే నిజమైన మార్గం.

  3. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

  4. సలహా బాగుంది. జేసీబీలు, బోయలు అన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించాలి

Comments are closed.