ఏపీ రాజకీయాల్లో రాబోతున్న కొత్త పార్టీ మీద ఎంతో కొంత రాజకీయ వర్గాలలో ఆసక్తి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రాలో తీసుకుంటే ఒక మాజీ మంత్రి, సీనియర్ మోస్ట్ లీడర్ కి నేరుగా టీఆర్ఎస్ అగ్ర నేతల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ మాజీ మంత్రి కూడా ఆషామాషీ లీడర్ కారు.
ఆయన సుదీర్ఘమైన తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు. అదే విధంగా వీలుని బట్టి, తన అవకాశాలను బట్టి ఆయన పార్టీలు కూడా అటూ ఇటూ మారారు. ఇపుడు కూడా ఏదైనా మంచి ఆఫర్ ఉంటే మరే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే ఆయనకు కేసీయార్ కొత్త పార్టీ నుంచి నేరుగానే పిలుపు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన కనుక చేరితే ఉత్తరాంధ్రా జిల్లాలలో కొత్త పార్టీకి పట్టు వస్తుందని భావిస్తున్నారుట. ఆయనకు కేసీయార్ తో మంచి పరిచయాలే ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఆయన ఏమైనా కేసీయార్ తో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.
ఉత్తరాంధ్రా జిల్లాలలో 34 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. పైగా బీసీ పాపులేషన్ ఎక్కువ. ఆ మాజీ మంత్రి సీనియారిటీతో పాటు రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటే ఇక్కడ ఏమైనా ఉనికి చాటుకోవచ్చు అన్న ఆలోచనతో గులాబీ పార్టీ పార్టీ పెద్దలు ఉన్నారట. మరి ఈ అట బోగట్టాలు నిజమేనా కాదా అన్నది చూడాలి.