ఆదాయం కోసం కూట‌మి పెద్ద‌ల ఉత్తుత్తి భ‌రోసా!

మ‌ద్యం షాపుల టెండ‌ర్ల‌కు సంబంధించి సాధ్య‌మైనంత ఎక్కువ ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌రోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు త‌మ‌ను కాద‌ని మ‌ద్యం దుకాణాల్ని ఎలా న‌డుపుతారో చూస్తామంటూ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఫోన్లు…

మ‌ద్యం షాపుల టెండ‌ర్ల‌కు సంబంధించి సాధ్య‌మైనంత ఎక్కువ ఆదాయాన్ని స‌మ‌కూర్చుకోవాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తోంది. మ‌రోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు త‌మ‌ను కాద‌ని మ‌ద్యం దుకాణాల్ని ఎలా న‌డుపుతారో చూస్తామంటూ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఫోన్లు చేసి మ‌రీ వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి. కూట‌మి ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణాల‌ ద‌ర‌ఖాస్తుదారుల నుంచి రూ.2 వేల కోట్లు రాబ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

అయితే అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి నేత‌లు ఎవ‌ర్నీ లెక్క చేయ‌డం లేదు. తాము చెప్పిందే శాస‌నం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం దుకాణాల‌కు త‌మ‌కు తెలియ‌కుండా ద‌ర‌ఖాస్తు చేసినా, టెండ‌ర్ల‌లో ద‌క్కించుకున్నా ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నాయ‌కుల‌తో గొడ‌వలెందుకుని దూరంగా వుంటున్నారు.

ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే చివ‌రికి ప్ర‌భుత్వం న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని కూట‌మి పెద్ద‌లు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర త‌న శాఖ అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఏ ఒక్క‌రూ ఇబ్బందిప‌డ‌కూడ‌ద‌ని, ఎవ‌రైనా బెదిరింపుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే పార్టీ ప‌రంగా కూడా నాయ‌కులు విజ‌య‌వాడ నుంచి ఫోన్లు చేస్తూ, సొంత వాళ్ల‌ను కూడా ద‌ర‌ఖాస్తు చేయ‌కుండా అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

ఎవ‌రైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ఒక‌వేళ షాపు ద‌క్కించుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తాము బాధ్య‌త తీసుకుంటామ‌ని హామీ ఇస్తున్నారు. అయితే ఇవ‌న్నీ ఆదాయాన్ని పెంచుకోడానికి చెబుతున్న మాట‌లే త‌ప్ప‌, మంత్రులు, ఎమ్మెల్యేల్ని కాద‌ని, త‌మ‌కు అండ‌గా నిలిచే ప‌రిస్థితి వుండ‌ద‌ని మ‌ద్యం వ్యాపారులు భ‌య‌ప‌డుతున్నారు. వీరిలో కూట‌మి వ్యాపారులు కూడా వుండ‌డం గ‌మ‌నార్హం.

అయితే ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి వార్నింగ్‌లు రావ‌డంతో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా చోట్ల ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి ద‌య చూపారు. షాపులు ద‌క్కించుకున్న త‌ర్వాత‌, త‌మ‌కు అప్ప‌గించ‌కుండా, సొంతంగా వ్యాపారాలు చేసుకోలేర‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అధికారం ఉండ‌గానే సంపాదించుకోవాల‌నే ఆలోచ‌నే ఇష్టానుసారం దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డేలా చేస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

18 Replies to “ఆదాయం కోసం కూట‌మి పెద్ద‌ల ఉత్తుత్తి భ‌రోసా!”

  1. కనీసం వారు ప్రభుత్వానికి నష్టం అని ఆలోచిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం లో కేవలం డబ్బు ద్వారానే అమ్మకాలు జరిపి ఎంత లెక్కల్లోకి రాకుండా బొక్కారో ఎప్పుడైనా వారు ఆలోచించారా?

  2. అప్పట్లో ప్రెసిడెంట్ మెడల్ అమ్మే రోజుల్లో చూసే వాళ్ళం ఎంత నీతి గా ఉండేదో .ఆంధ్రు నోళ్ళు వెళ్ళబట్టి చూడటమే తపల్ ఎవడు మాటడ తానికి కూడా లేదు

  3. మద్యం గురించి నువ్వు రాస్తున్నావా జగన్ పాలనలో చేసిన దోపిడీ గురించి ఒక్కరోజైనా రాసావా?. మద్యం తాగే వాళ్ళు ఎవ్వరూ జన్మలో జగన్కు ఓటెయ్యరు.

      1. నేను రాసిన దానికి నువ్వు రిప్లై పెట్టిందా అర్థం ఉందా! ఐదేళ్లు కల్తీ మద్యం అధికంగా రేట్లు దోచేయడం చేసింది జగన్ కాదా?. ఇక జగన్కు జీవితాంతం ఓటు వేయరు నువ్వే తెలుసుకుంటావు

Comments are closed.