Viswam Review: మూవీ రివ్యూ: విశ్వం

సినిమా చూస్తున్నంతసేపూ చూసేసిన సీన్లే అనిపిస్తుంటుంది.

చిత్రం: విశ్వం
రేటింగ్: 2/5
తారాగణం: గోపీచంద్, కావ్య థాపర్, జిషు సేన్ గుప్తా, శ్యామ్, నరేష్, సునీల్, ప్రగతి, వెన్నెల కిషోర్, అజత్ ఘోష్ తదితరులు
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
కెమెరా: గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
నిర్మాతలు: వేణు దోనేపూడి, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కొండల్ జిన్నా
దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2024

చాలా కాలం తర్వాత మళ్లీ శ్రీను వైట్ల మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించారు. వరుస ఫ్లాపులతో నిట్టూరుస్తూ నెట్టుకొస్తున్న గోపీచంద్ హీరోగా “విశ్వం” మన ముందుకొచ్చింది. ట్రైలర్ చూస్తే శ్రీను వైట్ల మార్క్ కామెడీతో కూడిన యాక్షన్ చిత్రం అని అర్ధమయింది. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

ఒక రెస్టారెంట్లో టెర్రరిస్ట్ బాంబు పేల్చడంతో కథ మొదలవుతుంది. ఆ పేలుడుకి కారణం సంజయ్ శర్మ (జిషు సేన్ గుప్తా). అతనికి బాచిరాజు (సునీల్) కి ఆర్ధికపరమైన లావాదేవీలుంటాయి. ఆ బాచిరాజు అన్నయ్య (సుమన్) కేంద్ర మంత్రి. టెర్రరిస్ట్ యాక్టివిటీ గురించి మంత్రికి తెలిసిపోయిందని అతనిని బాచిరాజు, సంజయ్ శర్మలు చంపేస్తారు. ఆ హత్యని ఒక చిన్న పిల్ల చూస్తుంది. సాక్ష్యం ఉండకూడదని ఆమెను చంపాలనుకుంటారు ఈ ఇద్దరూ. ఎన్ని పన్నాగాలు పన్నినా అన్నింటినీ పటాపంచలు చేసి ఆ పిల్లని కాపాడుతుంటాడు గోపి (గోపిచంద్). ఇంతకీ ఈ గోపి ఎవరు? అతనికి ఈ పాపని కాపాడాల్సిన అవసరమేంటి? సంజయ్ శర్మ అసలు రూపమేంటి? వీటికి సమాధానాలు ఒక్కొక్కటిగా విప్పుతూ సాగుతుంది ఈ కథనం.

సినిమా చూస్తున్నంతసేపూ చూసేసిన సీన్లే అనిపిస్తుంటుంది. దానికి కారణం శ్రీను వైట్ల తన పాత సినిమాల్లోని సీన్లని, డైనమిక్స్ ని, పాత్రల్ని రిపీట్ చేసినట్టుంది. దూకుడు, వెంకి, బాద్షా, ఢీ ఇలా అన్ని సినిమాలూ గుర్తుకొస్తుంటాయి. దానివల్ల కొత్త అనుభూతి ఏమీ కలగదు. ఆ పాత సినిమాల్నే రీమిక్స్ చేసి వడ్డించినట్టుంది.

దానికి తోడు సంగీత దర్శకుడు కూడా వైట్ల తీసిన పాత సినిమాలన్నీ చూసి అదే పంథాలో కంపోజ్ చేసాడు. ఆ రకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొత్తగా వినిపించలేదు. పాటలు చాలా పేలవంగా ఉన్నాయి. ఆరెక్స్ 100 తో హిట్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చైతన్ భరద్వాజ్ ఈ కమర్షియల్ కి సరైన సంగీతం ఇచ్చుంటే నెక్స్ట్ రేంజుకి వెళ్ళుండేవాడు.

కొంత కామేడీ, కాస్తంత సెంటిమెంటు, కావల్సినన్ని ఫైట్లు, అందమైన హీరోయిన్, ఫారిన్ లోకేషన్లు, పాటలు.. అన్నీ పనిగట్టుకుని జోడించిన ఫక్తు కమర్షియల్ మాస్ మసాలా చిత్రమిది. ఈ దినుసుల మధ్యలో అసలు కథ అరగంట ఉంటుందంతే.

అసలీ కథకి ఇటలీ ఎపిసోడ్ దేనికో అర్ధం కాదు. జస్ట్ రిచ్నెస్ కోసం అంటే సరిపోదు. పర్పస్ లేకుండా కథని ఎక్కడెక్కడికో తీసుకెళ్తే ప్రేక్షకులు హర్షిస్తారనుకోవడం ఔట్ డేటెడ్ థాట్. కథనం బలంగా ఉండాలే కానీ మొత్తం ఒక ఊరికే పరిమితం చేసి తీసినా చూస్తారు, ఆదరిస్తారు. అలాంటి ఉదాహరణలు అనేకం.

ఫార్ములా పాతదే అయినా కొత్త రకమైన ప్రెజెంటేషన్ మీద ఫోకస్ పెట్టొచ్చు. అలా చేయకుండా వింటేజ్ మోడల్ లో తీసినట్టుంది ఈ చిత్రం.

ఈ కంప్లైంట్లు పక్కనపెట్టి మంచి విషయాలు చెప్పుకోవాలంటే సినిమా టేకాఫ్ బాగుంది. మొదలవడమే గ్రిప్పింగ్ నెరేషన్ తో నడిచింది. పాత్రలు, పరిచయాలు పెట్టుకోకుండా డైరెక్టుగా తొలి సీనుతోటే కథలోకి వెళ్లిపోయింది. అయితే తర్వాత.. తర్వాత కథకు సంబంధం లేని జంక్ సీన్లు, వీక్ ఎపిసోడ్స్ దర్శమిచ్చాయి.

కామెడీ సీన్లు కూడా కొన్ని పండాయి. పృథ్వీ కామెడీ ట్రాక్ బాగుంది. ఆ తర్వాత ట్రెయిన్లో అజయ్ ఘోష్ విలన్ ముందు ప్రదర్శించే శాడిజం, వెన్నెల కిషోర్ మెంటల్ డిజార్డర్, సెక్యూరిటీ గార్డ్ గా జెమిని సురేష్ చెప్పిన ఒక డైలాగ్ నవ్వించాయి. నరేష్, ప్రగతి మామిడపళ్ల డైలాగులు కాసేపు బాగానే ఉన్నా కొంతసేపటికి ఫ్లాటైపోయాయి. షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి..ఇలా కొందరు కనిపించినా వాళ్లని పెద్దగా వాడుకున్నది లేదు.

సెంటిమెంట్ ట్రాక్ మాత్రం చాలా ఫోర్స్డ్ గా ఉంది. ఏడెనిమిదేళ్ల పిల్లకి బులెట్ వీపులోకి దిగి గుండెలోంచి రక్తం చిమ్ముతూ బయటికొచ్చినా కూడా ఆమె బతికేయడం అతికే అతిశయోక్తి అనిపించే విషయం. ఈ తరహా లాజిక్ లెస్ సీన్లు సగటు పాతకాలపు మాస్ చిత్రాల్లో కామన్. ఆ పాతకాలం సినిమాలు చూసిన వాళ్లు తట్టుకోగలరేమో కానీ, ఉన్నంతలో కొంతైనా లాజిక్ కోరుకునే నేటి తరం ప్రేక్షకులు మాత్రం ఇలాంటి సీన్లకి కంగారుపడడం ఖాయం.

అలాగే సెంటిమెంట్ పాట కూడా సడెన్ గా కథనుంచి డీవియేషన్లా అనిపిస్తుంది. ఆ సాంగ్ ఒక్కటీ అనవసరమనిపిస్తుంది.

ప్రధామార్ధం గ్రిప్పింగ్ గా సాగింది. ఇంటర్వల్ బ్లాక్ ఉన్నంతలో ఆసక్తి కరంగానే ఉంది. సెకండాఫులో కాస్తంత కామెడీ నడిచింది. క్లైమాక్స్ రొటీన్ రొట్టకొట్టుడుగా ముగిసింది. హీరోని విలన్ ఒక డెన్ లాంటి చోట బంధించడం, అతనింక పోతాడనగా ఏదో సర్ప్రైజ్ జరిగి విలన్లంతా పోవడం ఎన్ని సినిమాల్లో చూశాం.

గోపీచంద్ లుక్ బాగుంది. అయితే తన క్యారక్టర్ తో బలమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపొయాడు. కావ్య థాపర్ కూడా తెరకింపుగా ఉంది. నటనపరంగా చేయడానికి ఆమెకేమీ లేదు.

శ్యామ్ అక్కడక్కడ కొన్ని సీన్లలో వస్తుంటాడు. బెనెర్జీది ఆద్యంతం ఒకే టెంపోలో సాగే మనవరాల్ని కాపాడుకునే తాత పాత్ర.

జిషు సేన్ గుప్తా సీరియస్ విలనైతే, సునీల్ కామెడీ టచ్ తో కనిపించిన విలన్. అతని పక్కన రాహుల్ రామకృష్ణ “నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు” అనే ఢీ బ్రహ్మానందం తరహా పాత్రలో కనిపించాడు.

శ్రీకాంత్ అయ్యంగార్ ది అవసరం లేని పాత్ర. అతని క్యారెక్టర్ కంట్రిబ్యూషన్ ఏంటో తెలియలేదు.

శ్రీనువైట్ల సినిమాల్లో ఆద్యంతం హాస్యం ఉన్నవి, అందులోనూ సెంటిమెంట్, లవ్ ట్రాక్, యాక్షన్ కలగలిసినవి చాలా వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా వీక్. అవే ఎలెమెంట్స్ ఉన్నా అప్పటి గ్రిప్ ఇప్పుడు వైట్లలో లేదని అర్ధమవుతోంది. పైగా తన పాత టీములో గోపీమోహన్ ఒక్కడూ స్క్రీన్ ప్లేలో ఉన్నాడు. ఎక్కడా సస్పెన్స్ మెయింటేన్ చేయలేదు. ట్రైలర్లోనే హీరో ఆర్మీయో, పోలీసో అన్నట్టు చూపించేసారు కనుక తెర మీద ఆ విషయం రివీలైనప్పుడు ఏ రకమైన ఉత్కంఠ కలగలేదు. అలా ఉన్న ఒక్క చిన్నపాటి సస్పెన్స్ కూడా స్క్రీన్ ప్లేలో వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ దానిని సస్పెన్స్ అనుకున్నా కూడా “పోకిరి” మోడల్లో ఉందని నిట్టూర్చేవాళ్లం. కనుక స్క్రీన్ ప్లే పరంగా ఉత్కంఠగా కూర్చోబెట్టే అంశాలు లేవు.

శ్రీను వైట్ల సిన్మాలు థియేటర్లో చూడకపోయినా టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ చూసేసిన నేటి తరం ప్రేక్షకులకి ఇది అక్కడక్కడ కొన్ని సీన్లను మినహాయించి మిగతాది చాలా పేలవంగా అనిపిస్తుంది.

ఇందులో ప్రగతి, నరేష్ లది మామిడిపళ్ల వ్యాపారం. పచ్చి కాయలమీద కార్బైడ్ కొట్టి పండించి వాటిని అమ్మేయమని ఫోన్లో చెబుతుంది ప్రగతి. కార్బైడ్ కొట్టడం నేరమని చెబితే అలాంటివాటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేమంటుంది. సరిగా ఈ సినిమా కూడా అలానే ఉంది. పాపులర్ నటులందరూ కనపడితే బాగా పండిన మామిడిపండులా నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. కానీ రుచి చూస్తే పులుపు. కథనాన్ని పండేంత వరకు ఆగకుండా జనం మీదకి వదిలితే ఇంతే మరి.

బాటం లైన్: పుల్ల మామిడిపండు

16 Replies to “Viswam Review: మూవీ రివ్యూ: విశ్వం”

  1. సినిమాల మీద విపరీతమైన మక్కువతో ఆ నిర్మాత విశ్వప్రసాద్ సినిమాలు నిర్మిస్తున్నారు, కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మీరు మరీ పగబట్టినట్టు ఇస్తున్నారు రివ్యూలు. బ్రతకండి బ్రతికించండి. నా మటుకు నేను సినిమా లవర్ గా సినిమాని ఎంజాయ్ చేసాను.

  2. “ రాహుల్ రామకృష్ణ ‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు’ అనే ఢీ బ్రహ్మానందం తరహా పాత్రలో కనిపించాడు.”

    ఇది మంచు విష్ణుని ఉద్దేశించిందే కాబట్టి supreme లో పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి రావొచ్చు.

  3. అరేయ్ ఎర్రి పూకా నువ్వు నీ రివ్యూ వేస్ట్

    అసలు సినిమాచూసావా నువ్వు సినిమా చాలా బాగుంది నువ్వు కావాలని చెప్తున్నా డబ్బు కోసం

  4. అరేయ్ ఎర్రి పూకా నువ్వు నీ రివ్యూ వేస్ట్ అసలు సినిమా చూసావా నువ్వు సినిమా చాలా బాగుంది నువ్వు డబ్బు కోసం చెత్త నా కొడకా వేసి నా కొడకా సినిమా సూపర్ ఉంది

  5. గోపీచంద్‌కి పరమ రొటీన్, పాత చింత కాయ పచ్చడి లాంటి కథలే నచ్చుతాయి. అలాంటి కథలే ఒప్పుకుంటాడు. అందుకు కారణం అతని పక్కన ఉండే కోటరీ కావచ్చు. ఉదాహరణకి ప్రస్థానం సినిమా కథ దేవ్‌కట్టా గోపీకి చెబితే అతని పక్కనున్నవాళ్లు ఆ కథ మీద బూ..తు జోకులేస్తూ హేళన చేస్తూ మాట్లాడారట. గోపీకి శ్రీనువైట్ల లాంటి షెడ్ కెళ్లిన డైరెక్టర్స్ మాత్రమే సరిపోతారు. OTT, హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ మీద నెట్టుకొచ్చెయ్యడమే అతనికి మిగిలింది.

Comments are closed.