మాధురి స‌రే… అంద‌రిపై ఇట్లే కేసులు పెడ‌తారా?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువుదీరిన తిరుమ‌ల‌లో భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించార‌ని దివ్వ‌ల మాధురిపై అక్క‌డి వ‌న్‌టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. భ‌క్తుల మ‌నోభావాల్ని ఎవ‌రు దెబ్బ‌తీసినా చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు…

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువుదీరిన తిరుమ‌ల‌లో భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించార‌ని దివ్వ‌ల మాధురిపై అక్క‌డి వ‌న్‌టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. భ‌క్తుల మ‌నోభావాల్ని ఎవ‌రు దెబ్బ‌తీసినా చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు. అయితే అధికార ప‌క్షం నాయ‌కుల‌కు ఒక నీతి, ప్ర‌తిప‌క్షానికి మ‌రో నీతి ఉంటేనే స‌మ‌స్య‌.

తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు మాట్లాడ్డం శ్రీ‌వారి భ‌క్తుల మ‌నో భావాల్ని దెబ్బ తీయ‌డ‌మే అవుతుంది. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న అనంత‌రం చంద్ర‌బాబునాయుడు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల వెళ్లారు. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ తిరుమ‌ల‌లో నాడు రాజ‌కీయ అంశాలు మాట్లాడారు. అలాగే ఆ త‌ర్వాత స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, ఇత‌ర ప్ర‌భుత్వ పెద్ద‌లు తిరుమ‌ల వెళ్లిన సంద‌ర్భంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ స‌న్నిహితురాలు మాధురిపై తాజాగా కేసు న‌మోదు చేసిన‌ట్టే, ప్ర‌భుత్వ పెద్ద‌లు టీటీడీ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ప్పుడు పోలీసులు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నిబంధ‌న‌లు ఎవ‌రు ఉల్లంఘించినా కేసు న‌మోదు చేసిన‌ట్టైతే, శ్రీ‌వారి విష‌యంలో మ‌న‌త‌న అనేది ఉండ‌ద‌నే సంకేతాలు ఇచ్చిన ఘ‌న‌త ద‌క్కేది. కానీ అధికారాన్ని ప్ర‌తిప‌క్షాన్ని వేధించ‌డానికే అనుకుంటే మాత్రం, దేవుడు చూస్తూ ఊరుకోర‌న్న‌ది భ‌క్తుల అభిప్రాయం.

కావున తిరుమ‌ల శ్రీ‌వారి విష‌యంలో మాధురిపై కేసు న‌మోదు చేసిన‌ట్టే, రానున్న రోజుల్లో చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తే అభినంద‌న‌లు ద‌క్కుతాయి. లేదంటే విమ‌ర్శ‌ల‌పాల‌వుతారు. ఈ విష‌యాన్ని తిరుమ‌ల పోలీసులు, విజిలెన్స్ అధికారులు గుర్తించాల్సిన అవ‌స‌రం వుంది.

17 Replies to “మాధురి స‌రే… అంద‌రిపై ఇట్లే కేసులు పెడ‌తారా?”

  1. పాపం మన అన్నయ్య కే ఇలాంటి ఆణిముత్యాలు దొరుకుతాయి ఎందుకు GA…. కత్తి పోయాడు…. ఛీ రెడ్డి తప్పిపోయింది…ఇప్పుడు వీళ్ళు….😂😂…బావుంది GA….

  2. అప్పట్లో ప్రభువు, వారి వందిమగతులు 7కొండల వాడిని బాగా వాడుకున్నారు మొత్తం భ్రష్టు పట్టించారు, కానీ ఇప్పుడు అలా కాదుకదా, పాట తప్పులు సరి చేస్తూ ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా చట్టాలు చేస్తున్నారు, మాధురి వ్యవహార శైలి ఏంటో అర్థం కాదు, ఒకరి స్వంత వ్యవహారాల్లో జోక్యం కూడదని కామెంట్ చెయ్యట్లేదు కానీ, చెప్పాలంటే చాలా నిస్సిగ్గుగా రాయాలి

    పైగా వచ్చిన వారు వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళమా అన్నట్టు ఉండక ప్రెస్ మీట్ ఎందుకు, ఇంకా రీల్స్ కూడను, అది కూడా శ్రీ వారి సన్నిధిలో

    కేసులు నమోదు చెయ్యడం అస్సలు ఏమాత్రం తప్పు కాదు.

    మన రోజక్క యీ మధ్యన తిరుమల రావట్లేదు కదా, బహుశా టికెట్స్ అమ్ముకోవటం కుదరట్లేదు అనుకుంటా..

  3. అప్పట్లో ప్రభువు, వారి వందిమగతులు 7కొండల వాడిని బాగా వాడుకున్నారు మొత్తం భ్రష్టు పట్టించారు, కానీ ఇప్పుడు అలా కాదుకదా, పాట తప్పులు సరి చేస్తూ ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా చట్టాలు చేస్తున్నారు, మాధురి వ్యవహార శైలి ఏంటో అర్థం కాదు, ఒకరి స్వంత వ్యవహారాల్లో జోక్యం కూడదని కామెంట్ చెయ్యట్లేదు కానీ, చెప్పాలంటే చాలా నిస్సిగ్గుగా రాయాలి

    పైగా వచ్చిన వారు వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళమా అన్నట్టు ఉండక ప్రెస్ మీట్ ఎందుకు, ఇంకా రీల్స్ కూడను, అది కూడా శ్రీ వారి సన్నిధిలో

    కేసులు నమోదు చెయ్యడం అస్సలు ఏమాత్రం తప్పు కాదు.

    మన రోజక్క యీ మధ్యన తిరుమల రావట్లేదు కదా, బహుశా టికెట్స్ అమ్ముకోవటం కుదరట్లేదు అనుకుంటా

  4. When Duvvada & Madhuri like each other.. let them be like that.. Most of the telugu movies and serials deal with subjects of triangular and multi-angular love stories..

  5. అది ఎదో సమాజానికి ఏదో మంచి చేస్తున్నారు అన్నట్టు ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు..నీ ఆర్టికల్ ఏ మెట్టు తో కొట్టాలి రా మిమ్మల్ని

  6. వాళ్ళు చేసిన పనికి, వీళ్ళ మాటలు రెండూ పోల్చడం చండాలంగా ఉంది. నీకు అసలు బుద్ధి ఉందా అని అనుమానం కలుగుతోంది

Comments are closed.